Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో బల్లి ఉండకూడదు అంటే ఈ సింపుల్‌ టిప్స్‌ ఫాలో అవ్వండి..

బల్లితో ఎలాంటి సమస్య ఉండకపోయినా కూడా బల్లి నడిచే తీరు కొందరిలో వింత భయాన్ని కలిగిస్తుంది. మరికొందరు బల్లిని చూడగానే పులిలా అరుస్తూ ఇల్లంతా హంగామా సృష్టిస్తారు. అయితే, ఏ హానిచేయని బల్లుల గురించి భయపడాల్సిన అవసరం లేదు. బల్లులు ఇంట్లోకి రాకుండా నిరోధించడానికి, వాటిని తరిమి కొట్టడానికి సాధారణ పద్ధతులను ఉపయోగించవచ్చు. ఐతే ఆ సింపుల్ టిప్స్ ఏంటో చూద్దాం.

ఇంట్లో బల్లి ఉండకూడదు అంటే ఈ సింపుల్‌ టిప్స్‌ ఫాలో అవ్వండి..
Trouble With Lizards
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 27, 2023 | 8:51 PM

ఆఫీసులో పని చేసి అలసిపోయి సోఫాలో పడుకుంటే కళ్లు మూసుకోకముందే గోడమీద బల్లి మిమ్మల్యే తదేకంగా చూస్తుంటే ఏమవుతుంది.. దెబ్బకు నిద్ర అంతా పోతుంది. ఇంటి గోడలపై బొద్దింకలు, బల్లులు, సాలెపురుగులు వంటివి పాకుతూ ఉంటే ఖచ్చితంగా భరించడం కష్టమే. బల్లితో ఎలాంటి సమస్య ఉండకపోయినా కూడా బల్లి నడిచే తీరు కొందరిలో వింత భయాన్ని కలిగిస్తుంది. మరికొందరు బల్లిని చూడగానే పులిలా అరుస్తూ ఇల్లంతా హంగామా సృష్టిస్తారు. అయితే, ఏ హానిచేయని బల్లుల గురించి భయపడాల్సిన అవసరం లేదు. బల్లులు ఇంట్లోకి రాకుండా నిరోధించడానికి, వాటిని తరిమి కొట్టడానికి సాధారణ పద్ధతులను ఉపయోగించవచ్చు. ఐతే ఆ సింపుల్ టిప్స్ ఏంటో చూద్దాం.

1. బల్లులను తరిమికొట్టడానికి గుడ్డు పెంకులు ఒక సులభమైన ఉపాయం. బల్లులకు గుడ్ల వాసన పడదు. కాబట్టి, మీరు మీ ఇంట్లో గుడ్డును ఉపయోగించినప్పుడు..దాని షెల్‌ను చెత్తలో వేయకండి. దాన్ని బయటకు తీసి ఇంట్లో తలుపు దగ్గర, కిటికీ దగ్గర కొన్ని చోట్ల ఉంచాలి. కానీ ఇలా ఒక్కసారి పెడితే గుడ్డు పెంకు వాసన ఎక్కువ సేపు ఉండదు. కాబట్టి దానిని పదే పదే మారుస్తూ ఉండాలి.

2. బల్లులు చలిగా ఉండే ప్రదేశంలో ఉండటానికి ఇష్టపడవు. కాబట్టి మీ గది ఉష్ణోగ్రత 22 డిగ్రీల కంటే తక్కువగా ఉండేలా చూసుకోండి. అలా ఉంటే ఒక్క బల్లి కూడా అక్కడ కాలు పెట్టదు.

ఇవి కూడా చదవండి

3. బల్లులు ఘాటైన వాసనను ఎప్పుడూ తట్టుకోలేవు. కాబట్టి, వెల్లుల్లి, ఉల్లిపాయ వంటివి మీకు సహాయం చేస్తాయి. వెల్లుల్లి, ఉల్లిపాయలను ముక్కలుగా చేసి ఇంటి చుట్టూ అక్కడక్కడ ఉంచండి. ఆ వాసనకు బల్లులు పారిపోతాయి. వెల్లుల్లి, ఉల్లిని ఇంటి నిండా ఉంచుకోవడం ఇష్టం లేకుంటే దాని రసాన్ని తీసి ఆ రసాన్ని ఇంటి గోడలపై స్ప్రే చేస్తే సరిపోతుంది.

4. బల్లులు ఎప్పుడూ వెచ్చని వాతావరణంలో ఉండేందుకు ఇష్టపడతాయి. కాబట్టి మీరు బల్లులను చూసినప్పుడు, వాటిని ఫ్రిజ్‌లోంచి చల్లటి నీరు తీసుకుని చల్లండి. దెబ్బకు బల్లులు పారిపోతాయి.

5. నల్ల మిరియాలు, ఎర్ర మిరియాలు రెండింటినీ బల్లులు తట్టుకోలేవు. కాబట్టి నల్ల మిరియాల పొడి, కారం పొడిని నీటిలో కలిపి బల్లులు ఎక్కువగా కనిపించే చోట స్రే చేయాలి. కాకపోతే ఎండు మిరపకాయలను చుట్టూ వేలాడదీయవచ్చు.

6. బల్లులు కాఫీ వాసనను కూడా ఇష్టపడవు. కాబట్టి బల్లులు వచ్చే ప్రదేశాలలో కూడా కాఫీ నీటిని స్ప్రే చేయవచ్చు. లేదా కాస్త కాఫీ పౌడర్ చల్లుకోవచ్చు.

7. ఈ పద్ధతి మీకు పని చేయకపోతే, మీరు నాఫ్తలిన్ మాత్రలను కూడా ఉపయోగించవచ్చు. దుకాణాల్లో లభించే నాఫ్తలిన్ గుళికలను అక్కడక్కడ వేయటం వల్ల బల్లులను నివారించవచ్చు. అయితే దీన్ని వాడుతున్నప్పుడు ఇంట్లో పిల్లలు, పెంపుడు జంతువులు ఉండకుండా జాగ్రత్తపడాలి.

8. దోమల కోసం ఉపయోగించే స్ప్రేలు కూడా బల్లుల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. వాటిని గోడపై స్ప్రే చేయడం వల్ల దోమలే కాకుండా బల్లులు కూడా రాకుండా ఉంటాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..