AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త కారుకు పూజలు చేసిన కొరియన్‌ అంబాసిడర్.. వైరలవుతున్న వీడియో చూస్తే..

భారతదేశంలోని దక్షిణ కొరియా రాయబారి చాంగ్ జే-బాక్ కొత్త కారును పొందారు. ఇది అంబాసిడర్లకు ఇచ్చే అధికారిక కారు. కొత్త కారు డెలివరీ రోజున భారతీయ సంప్రదాయం ప్రకారం చాంగ్ జే బక్ పూజలు నిర్వహించారు. కారు ఎంబసీకి డెలివరీ చేయబడింది.

కొత్త కారుకు పూజలు చేసిన కొరియన్‌ అంబాసిడర్.. వైరలవుతున్న వీడియో చూస్తే..
South Korea Ambassador
Jyothi Gadda
|

Updated on: Sep 27, 2023 | 10:06 PM

Share

భారతదేశంలో కొత్త కారు లేదా వాహనం కొనుగోలు చేస్తే పూజ చేస్తారు. భగవంతుని అనుగ్రహం కలగాలని వాహనాన్ని పూజిస్తారు. ఈ సంప్రదాయం హిందూ కుటుంబాల్లో సర్వసాధారణం. ఇప్పుడు దక్షిణ కొరియా అంబాసిడర్ హిందూ సంప్రదాయం ప్రకారం సరికొత్త హ్యుందాయ్ జెనెసిస్ జివి80 కారుకు స్వాగతం పలికారు. ఈ వీడియో X ఖాతాలో షేర్‌ చేశారు. దక్షిణ కొరియా రాయబారి కొత్త కారుకు చేసిన పూజ నెటిజన్లతో ప్రశంసలు అందుకుంది.

భారతదేశంలోని దక్షిణ కొరియా రాయబారి చాంగ్ జే-బాక్ కొత్త కారును పొందారు. ఇది అంబాసిడర్లకు ఇచ్చే అధికారిక కారు. కొత్త కారు డెలివరీ రోజున భారతీయ సంప్రదాయం ప్రకారం చాంగ్ జే బక్ పూజలు నిర్వహించారు. కారు ఎంబసీకి డెలివరీ చేయబడింది. దక్షిణ కొరియా రాయబార కార్యాలయ అధికారి చాంగ్ జే-బాక్ పూజారులను పూజల కోసం పిలిచారు. అనంతరం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. టెంకాయ పగలగొట్టి హారతి వెలిగించారు.. అనంతరం కొత్త కారుకు కుంకుమపూజలు చేశారు.

ఇవి కూడా చదవండి

X ఖాతాలో తన ఆనందాన్ని పంచుకున్న దక్షిణ కొరియా ఎంబసీ అధికారి, కొత్త హ్యుందాయ్ జెనెసిస్ GV80 కారు మా ఎంబసీ కుటుంబానికి చెందినది. ఇది దక్షిణ కొరియా రాయబార కార్యాలయ అధికారుల అధికారిక కారు. కారుకు పూజలు చేశారు. కొత్త ప్రయాణంలో కొత్త రథసారధి మనల్ని ఆశీర్వదించాలి అని చాంగ్ జే బక్ అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

స్టార్ ఇమేజ్ కోసం ఆ విధంగా ట్రై చేస్తున్న ప్రగ్యా జైశ్వాల్
స్టార్ ఇమేజ్ కోసం ఆ విధంగా ట్రై చేస్తున్న ప్రగ్యా జైశ్వాల్
నెక్ట్స్ మూవీకి ఆ హీరోని రెడీ చేస్తున్న అనిల్ రావిపూడి ?
నెక్ట్స్ మూవీకి ఆ హీరోని రెడీ చేస్తున్న అనిల్ రావిపూడి ?
కండిషన్ పెట్టిన ప్రొడ్యూసర్‌.. శంకర్‌ పాస్‌ అవుతారా ??
కండిషన్ పెట్టిన ప్రొడ్యూసర్‌.. శంకర్‌ పాస్‌ అవుతారా ??
గ్లోబల్‌ స్టేజ్‌లో.. ట్రిపుల్‌ ఆర్‌ హీరోల రేంజ్‌ ఏంటి ??
గ్లోబల్‌ స్టేజ్‌లో.. ట్రిపుల్‌ ఆర్‌ హీరోల రేంజ్‌ ఏంటి ??
పోటాపోటీగా ఫౌజీ.. పెద్ది.. బరిలో నిలిచేదెవరు ?? గెలిచేదెవరు ??
పోటాపోటీగా ఫౌజీ.. పెద్ది.. బరిలో నిలిచేదెవరు ?? గెలిచేదెవరు ??
దీపిక రూట్లో శ్రద్ధ.. ఐకాన్‌స్టార్‌ కోసమేనా ??
దీపిక రూట్లో శ్రద్ధ.. ఐకాన్‌స్టార్‌ కోసమేనా ??
బోయపాటి ప్యాన్ ఇండియా ఫిల్మ్..రణ్‌వీర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారా
బోయపాటి ప్యాన్ ఇండియా ఫిల్మ్..రణ్‌వీర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారా
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్‌ పెంచిన సంక్రాంతి స్టార్స్
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్‌ పెంచిన సంక్రాంతి స్టార్స్
పసి పిల్లలు, బాలింతల కోసం జంపన్న వాగు వద్ద ఉడుకు నీళ్లు
పసి పిల్లలు, బాలింతల కోసం జంపన్న వాగు వద్ద ఉడుకు నీళ్లు
ఇక జంక్‌ ఫుడ్‌ యాడ్స్‌పై బ్యాన్.. ఆరోగ్య సమస్యలకు చెక్
ఇక జంక్‌ ఫుడ్‌ యాడ్స్‌పై బ్యాన్.. ఆరోగ్య సమస్యలకు చెక్