Watch Video: వినాయక నిమజ్జనం వేళ అద్భుతం.. ఎలుకకు ఏనుగు దంతాలు.. వీడియో చూస్తే షాకే..

పశ్చిమ బెంగాల్‌లో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. పెద్ద పెద్ద దంతాల్లా కనిపించే అవయవ నిర్మాణం కలిగిన ఓ ఎలుక ప్రత్యక్షమైంది. సాధారణంగా ఇళ్ళల్లో కనిపించే ఎలుకలా కాకుండా ఏనుగుకు ఉండే దంతాల మాదిరి.. పొడువాటి దంతాలు కలిగిన ఎలుక బోనులో చిక్కింది. ఈ వింత ఎలుకను చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు. గణేషుడి వద్ద ఉంచి పూజలు చేస్తున్నారు. గతంలో అంటే 1964 డిసెంబర్‌లో..

Watch Video: వినాయక నిమజ్జనం వేళ అద్భుతం.. ఎలుకకు ఏనుగు దంతాలు.. వీడియో చూస్తే షాకే..
Giant Toothed Rat
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 28, 2023 | 9:05 AM

Viral Video: పశ్చిమ బెంగాల్‌లో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. పెద్ద పెద్ద దంతాల్లా కనిపించే అవయవ నిర్మాణం కలిగిన ఓ ఎలుక ప్రత్యక్షమైంది. సాధారణంగా ఇళ్ళల్లో కనిపించే ఎలుకలా కాకుండా ఏనుగుకు ఉండే దంతాల మాదిరి.. పొడువాటి దంతాలు కలిగిన ఎలుక బోనులో చిక్కింది. ఈ వింత ఎలుకను చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు. గణేషుడి వద్ద ఉంచి పూజలు చేస్తున్నారు. గతంలో అంటే 1964 డిసెంబర్‌లో బీర్భూమ్‌లోని ఒక స్వీట్ షాపులోనూ ఇదే రకమైన పెద్ద ఎలుక తిరుగుతూ కనిపించింది. అప్పుడే వింత ఆకారంలో ఉన్న ఎలుక స్వీట్ షాప్ దుకాణదారుడు మిథున్ దాస్ దృష్టిలో పడింది. దాన్ని బంధించి చూడగా.. ఎలుకకు రెండు దంతాలు ఉన్నట్లు గుర్తించాడు. దీన్నంతటిని దైవలీలగా భావించి.. ఆ వ్యాపారి తన దుకాణంలోని గణేశ విగ్రహం పక్కనే బోనులో ఎలుకను ఉంచి పూజలు చేశాడు. ఈ వార్త అప్పట్లో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

మళ్ళీ 5 దశాబ్దాల తర్వాత, హౌరాలోని ఉలుబెరియాలో అదే సంఘటన పునరావృతమైంది. ఓ స్వీట్ షాపులో పొడవాటి దంతాలతో ఉన్న ఎలుక కనిపించింది. దీంతో మళ్లీ అలజడి మొదలైంది. ఉలుబెరియాలోని యదుర్బెరియా రత్తాలలోని ఒక స్వీట్ షాప్ యజమాని దంతాలు ఉన్న పెద్ద ఎలుక సంచరిస్తున్నట్లు చూశాడు. స్వీట్స్ ఉన్న కంటైనర్లోకి వచ్చిన ఎలుకను తీస్తుండగా ఎలుక నోటిలో ఏనుగుకు ఉన్నట్టు రెండు పెద్ద దంతాలు కనిపించాయి. ఆ రెండూ దవడ నుండి బయటకుు పొడుచుకు వచ్చినట్లు ఉన్నాయి. దీంతో పెద్ద ఎత్తున స్థానికులు స్వీట్ షాపులోని ఎలుకను చూసేందుకు తరలివస్తున్నారు.

అయితే ఎలుకలు త‌మ‌కు హాని చేసే వాటిని మాత్రమే కొరుకుతాయంటున్నారు జంతు శాస్త్రవేత్తలు. మనుషుల దంతాలకు ఎలుకల దంతాల మధ్య చాలా వ్యత్యాసం ఉందంటున్నారు. మానవ దంతాలు ఒక సమయం వ‌చ్చేస‌రికి పెరగడం ఆగిపోతాయి. కానీ ఎలుకల దంతాలు అందుకు భిన్నంగా.. ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయంటున్నారు. దంతాల పరిమాణాన్ని అదుపులో ఉంచుకోవడానికి రకరకాలుగా కొరుకుతూ ఉంటాయంటున్నారు నిపుణులు. ఎలుకలు వాటి పళ్లను ఆహారం తినడానికి మాత్రమే ఉపయోగిస్తాయి. ఇలా అవి కొరుకుకోకపోతే వాటి దంతాలు చాలా పెద్దవిగా మారతాయని వెల్లడించారు. అయితే ఈ వింత ఎలుకకు సంబంధించి మరిన్ని పరిశోధనలు జరిపితే కానీ.. అసలు విషయాలు తెలియంటున్నారు హీరాలాల్ మజుందార్ మెమోరియల్ కాలేజ్ అధ్యాపకులు.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..