AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGSPDCL: విద్యుత్ వినియోగదారులకు సూపర్ న్యూస్.. వాట్సప్ సేవలు అందుబాటులోకి.. ఒక్క మెస్సేజ్‌తో అన్నీ సేవలు

తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్. టీజీఎస్పీడీసీఎల్‌ వాట్సప్ సేవలను ప్రారంభించింది. దీని ద్వారా మీరు విద్యుత్ పంపిణీ, బల్లులకు సంబంధించిన సమాాచారం మొత్తం తెలుసుకోవచ్చు. అలగే కరెంట్ బిల్లు స్టేటస్ లాంటి వివరాలు కూడా అందుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు కోసం..

TGSPDCL: విద్యుత్ వినియోగదారులకు సూపర్ న్యూస్.. వాట్సప్ సేవలు అందుబాటులోకి.. ఒక్క మెస్సేజ్‌తో అన్నీ సేవలు
Whatsapp
Venkatrao Lella
|

Updated on: Feb 23, 2026 | 5:31 PM

Share

విద్యుత్ వినియోగదారులకు ఊరట. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేదా సమస్య ఎదురైనప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదు. ఫోన్ నెంబర్లు కూడా అందుబాటులో ఉండవు. ఒకవేళ ఫోన్ నెంబర్లు ఉండి ఫిర్యాదు చేసినా లిఫ్ట్ చేయకపోవడం లేదా బిజీ రావడం జరుగుతుంది. ఒకవేళ ఆన్సర్ చేసినా సరిగ్గా సమాధానం ఇవ్వరు. ఈ సమస్యను పరిష్కరించేందుకు టీజీఎస్‌పీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సప్ ద్వారా విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చాట్ బాట్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఈ చాట్ బాట్ ద్వారా వినియోగదారులు విద్యుత్ పంపిణీ, సరఫరా, బిల్లులకు సంబంధించి అన్ని సేవలు పొందవచ్చు. తాజాగా ఈ సేవలను టీజీఎస్‌పీడీసీఎల్ ప్రారంభించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వాట్సప్ నెంబర్ ఇదే..

విద్యుత్ సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్ధ(TGSPDCL) వాట్సప్ సేవలను తాజాగా ప్రారంభించింది. ఈ నెంబర్‌కు జస్ట్ హాయ్ అని మెస్సేస్ చేస్తే చాలు.. ఫిర్యాదు చేయడంతో పాటు దానిని ట్రాక్ చేయడం, బిల్లుకు సంబంధించిన సమాచారం, విద్యుత్ సరఫరా స్థితి గురించి విచారణ లాంటి అన్నీ సేవలు పొందవచ్చు. ఈ మేరకు 8712441912 నంబర్‌ను అధికారులు తీసుకొచ్చారు. ఈ సేవలపై ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ ప్రకటన చేశారు. డిజిటల్ గవర్నెన్స్, వినియోగదారుల సౌలభ్యం కోసం ఇది ప్రధాన ముందడుగుగా అభివర్ణించారు. ఈ సాంకేతికత విద్యుత్ సేవలను మరింత సమర్థవంతంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఈ ఛాట్ బాట్ తీసుకొచ్చారు.

మోసగాళ్లకు చెక్

ఇటీవల విద్యుత్ బల్లుకు సంబంధించి కొన్ని నకిలీ మెస్సేజ్‌లు సైబర్ నేరగాళ్లు పంపిస్తున్నారు. మీరు విద్యుత్ బిల్లు చెల్లించలేదు.. వెంటనే చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తాం అంటూ సైబర్ నేరగాళ్లు తప్పుడు మెస్సేజ్‌లు పంపుతున్నారు. ఇలాంటి సమయాల్లో ఈ వాట్సప్ చాట్ బాట్ ద్వారా మీరు మీ కరెంట్ బిల్లు స్టేటస్ తెలుసుకోవచ్చు. దీని వల్ల అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ఈ వాట్సప్ చాట్ బాట్ సేవలను ఉపయోగించుకోవాలంటే తొలుత మీరు ఈ వాట్సప్ నెంబర్‌ను ఫోన్ కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకోవాలి. అనంతరం వాట్సప్‌లోకి వెళ్లి ఆ నెంబర్‌ను సెలక్ట్ చేసుకుని మెస్సేజ్ పంపాల్సి ఉంటుంది. హాయ్ అని మెస్సేజ్ పెడితే ఆప్షన్స్ వస్తాయి. మీరు మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకుని సమాచారం పొందవచ్చు. లేక విద్యుత్ సేవలపై ఫిర్యాదు చేయవచ్చు. కరెంట్ బిల్లుకు సంబంధించిన సమాచారం, బిల్లు స్టేటస్ వంటి వివరాలు తెలుసుకోవచ్చు.

Follow Us
రైల్వే స్టేషన్‌లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా..? ఈ మోసం గురించి..
రైల్వే స్టేషన్‌లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా..? ఈ మోసం గురించి..
మందుల కొరత తప్పదా?LPG సంక్షోభంతో ఆ మెడిసిన్స్‌ దొరుకుడు కష్టమే!
మందుల కొరత తప్పదా?LPG సంక్షోభంతో ఆ మెడిసిన్స్‌ దొరుకుడు కష్టమే!
ఆ ప్లంబర్ సంపాదన.. ఏడాదికి రూ.18 లక్షలు !
ఆ ప్లంబర్ సంపాదన.. ఏడాదికి రూ.18 లక్షలు !
ఎవర్రా మీరంతా.. ఇలా కూడా మోసం చేస్తారా.. ఇది తెలిస్తే..
ఎవర్రా మీరంతా.. ఇలా కూడా మోసం చేస్తారా.. ఇది తెలిస్తే..
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ.. పవన్ కల్యాణ్ సినిమా ఎలా ఉందంటే?
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ.. పవన్ కల్యాణ్ సినిమా ఎలా ఉందంటే?
అలర్ట్ :కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టన వానలు
అలర్ట్ :కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టన వానలు
ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే
ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే
కోట్లు కాదు వందల కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జంతువులు ఇవే
కోట్లు కాదు వందల కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జంతువులు ఇవే
సెకన్లలోనే రైల్వే టికెట్ పొందొచ్చు.. రైల్వేశాఖ కీలక నిర్ణయం
సెకన్లలోనే రైల్వే టికెట్ పొందొచ్చు.. రైల్వేశాఖ కీలక నిర్ణయం
మల్టీగ్రెయిన్ పిండి అందరికీ మంచిది కాదా? వీళ్లకు విషమే!
మల్టీగ్రెయిన్ పిండి అందరికీ మంచిది కాదా? వీళ్లకు విషమే!