పూజిత పొన్నాడ.. సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి.
టాలెంట్ నిరూపించుకుంటూ అందాల భామలు చాలా మంది వరుస అవకాశాలతో పాటు స్టార్ డమ్ కూడా సొంతం చేసుకుంటున్నారు వారిలో పూజిత ఒకరు.
ఈ అమ్మడు రంగస్థలం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో అది పినిశెట్టి ప్రేయసిగా నటించి ఆకట్టుకుంది.
పూజిత పొన్నాడ మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తెలుగు, తమిళ చలనచిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది.
ఆమె 1989 అక్టోబర్ 5న విశాఖపట్నంలో జన్మించింది. B.Tech పూర్తిచేసిన పూజిత, నటనలోకి రాకముందు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసింది.
2016లో "తుంటరి" చిత్రం ద్వారా చలనచిత్ర రంగంలోకి ప్రవేశించింది, కానీ ఈ చిత్రం విజయం సాధించలేదు. కానీ నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. ఛాన్స్ దొరికితే తన నటనతో స్టార్ డమ్ తెచ్చుకోవాలని చూస్తుంది ఈ అమ్మడు.