కాటుక కళ్లల్లో నీలాంబరి లుక్స్.. కుర్రాళ్ళ గుండెల్లో మళ్ళీ అలజడి..

Rajitha Chanti

Pic credit - Instagram

14 May 2026

తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులకు 'నజ్రియా నజీమ్' గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అందంతోపాటు తన అల్లరి చేష్టలతో కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.

క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టుకున్న ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన బ్లాక్ డ్రెస్ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చిన నజ్రియా, 'రాజా రాణి' సినిమాతో సౌత్ ఇండియా మొత్తం ఫేమస్ అయిపోయింది. ఆ సినిమాతో ఆమె పేరు నెట్టింట మారుమోగింది.

పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినప్పటికీ, నాని సరసన 'అంటే సుందరానికీ!' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.

నేచురల్ యాక్టింగ్‌తో లీల థామస్ పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు అద్భుతం. తాజాగా నజ్రియా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను పంచుకుంది.

 అందులో ఆమె ధరించిన నలుపు రంగు దుస్తులు, కళ్ళలో ఉన్న తీక్షణత, చిలిపిగా నుదుటిపైకి పడిన జుత్తు ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి.

ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు "అందమే అసూయపడేలా ఉంది", "నజ్రియా ఈజ్ బ్యాక్", "స్టైలిష్ అండ్ మాస్ లుక్" అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

ముఖ్యంగా ఆమె కళ్ళలో ఉండే మేజిక్ ఏమాత్రం తగ్గలేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నజ్రియాకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఇప్పటికీ ఆమె ట్రెండింగ్.