AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డీకేతో మోత్కుపల్లి భేటీ.. త్వరలో కాంగ్రెస్ తీర్థం.. ఆ స్థానం నుంచి బరిలోకి..!

బెంగుళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మోత్కుపల్లి నర్సింహులు భేటీ కావడంతో.. కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరికపై ప్రాధాన్యత సంతరించుకుంది. అక్టోబర్ మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీలోకి మోత్కుపల్లి చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఆలేరు నియోజకవర్గం నుండి ఐదు సార్లు, తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఒక సారి మొత్తం ఆరు సార్లు మోత్కుపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.

డీకేతో మోత్కుపల్లి భేటీ.. త్వరలో కాంగ్రెస్ తీర్థం.. ఆ స్థానం నుంచి బరిలోకి..!
Motkupalli Narasimhulu - DK Shivakumar
M Revan Reddy
| Edited By: |

Updated on: Sep 29, 2023 | 4:04 PM

Share

ఎన్నికలు దగ్గర పడిన వేళ తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఉన్న పార్టీలో ప్రాధాన్యం దక్కని నేతలు తమకు అనుకూలమైన పార్టీలోకి జంప్ చేస్తున్నారు. తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలనుంది. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. బీఆర్ఎస్‌ను ఢీకొట్టేందుకు వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు, అసమ్మతి వాదులను పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ వ్యూహంగా ఉంది. ఇందులో భాగంగానే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులును కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా బెంగుళూరు కేంద్రంగా రాజకీయ మంతనాలు జరగడంతో చర్చకు తెరలేచింది.

బెంగుళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మోత్కుపల్లి నర్సింహులు భేటీ కావడంతో.. కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరికపై ప్రాధాన్యత సంతరించుకుంది. అక్టోబర్ మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీలోకి మోత్కుపల్లి చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఆలేరు నియోజకవర్గం నుండి ఐదుసార్లు, తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఒకసారి మొత్తం ఆరు సార్లు మోత్కుపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రారంభంలో తన అభిప్రాయాలు తీసుకున్న తర్వాత, ప్రాధాన్యం ఇవ్వకపోవడం, కనీసం కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని మోత్కుపల్లి  కామెంట్స్ చేశారు. దీంతో ఆయన్ను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు టచ్ లోకి వెళ్లారట. మోత్కుపల్లిని పార్టీలో చేర్చుకొని ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన తుంగతుర్తి నుంచి బరిలోకి దించాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు భావిస్తున్నారట. సీఎం కేసీఆర్‌ను నమ్మి మోసపోయానని నర్సింహులు చేసిన కామెంట్స్.. ఆయన పార్టీ విడబోతున్నారని స్పష్టం చేశాయి. ఆలేరు బీఆర్ఎస్ సీటు ఆశించి భంగపడ్డ మోత్కుపల్లి గత కొంత కాలంగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడం లేదు. అంతేకాదు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌‌కు  సానుకూలంగా మాట్లాడుతున్నారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మోత్కుపల్లి బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

బాబు అరెస్ట్‌ను ఖండించిన మోత్కుపల్లి

కాగా ఇటీవల మోత్కుపల్లి చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా గొంతెత్తిన విషయం తెలిసిందే. చంద్రబాబు లాంటి నేతలను తీసుకెళ్లి జైల్లో పెట్టి రాక్షసానందం పొందుతున్నారని ఆయన ఫైరయ్యారు. ఏకంగా నిరసన దీక్షకు సైతం దిగారు. రాజకీయాలు పక్కనబెట్టి.. చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించాలన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేయించినందుకు జగన్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..