TS TET 2023 Answer Key: తెలంగాణ టెట్ ప్రాథమిక కీ, తుది కీ మధ్య తేడాలెందుకొచ్చాయ్? టెట్ ‘కీ’పై పలు అనుమానాలు
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2023) ఫలితాలు సెప్టెంబర్ 27 విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి టెట్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం ఘననీయంగా తగ్గింది. పేపర్ 1కు మొత్తం 2,69,557 దరఖాస్తు చేసుకోగా 2,23,582 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 82,489 మంది అంటే 36.89 శాతం మంది అర్హత సాధించారు. ఇక పేపర్ 2లో 2,08,499 దరఖాస్తు చేసుకోగా 1,90,047 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో కేవలం 29,073 మంది అంటే 15.30 శాతం ఉత్తీర్ణత సాధించారు. దీనిపై అభ్యర్ధుల్లో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి...
హైదరాబాద్, సెప్టెంబర్ 29: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2023) ఫలితాలు సెప్టెంబర్ 27 విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి టెట్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం ఘననీయంగా తగ్గింది. పేపర్ 1కు మొత్తం 2,69,557 దరఖాస్తు చేసుకోగా 2,23,582 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 82,489 మంది అంటే 36.89 శాతం మంది అర్హత సాధించారు. ఇక పేపర్ 2లో 2,08,499 దరఖాస్తు చేసుకోగా 1,90,047 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో కేవలం 29,073 మంది అంటే 15.30 శాతం ఉత్తీర్ణత సాధించారు. దీనిపై అభ్యర్ధుల్లో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. టెట్‌కు సంబంధించి ప్రాథమిక ‘కీ’లో వచ్చిన అభ్యంతరాలను శాస్త్రీయంగా చూడకపోవడమే అందుకు కారణం. పైగా తుది ’కీ’ ఆలస్యంగా వెబ్‌సైట్ ఉంచడంపై పరీక్ష రాసిన అభ్యర్థుల నుంచి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక ఆన్సర్ కీ చూసుకొని ఉత్తీర్ణులవుతారని అనుకున్నవారు కూడా ఫెయిల్ అవ్వడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది.
ప్రాథమిక కీలో ఇచ్చిన ఆన్సర్ ఆప్షన్స్ తుది కీలో మార్చారు. దీంతో అనేక మంది అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంతరాలు వాస్తవమని భావిస్తే, సాధారణంగా రెండు ఆప్షన్లు ఇస్తారు. అప్పుడు అభ్యర్థులకు అన్యాయం జరగదని టెట్ రాసిన అభ్యర్ధులు అంటున్నారు. ఇదేమీలేకుండానే ఆప్షన్లు మార్చడం వల్ల ఐదు మార్కుల వరకూ కోల్పోయినట్టు అభ్యర్ధులు వాపోతున్నారు. కేవలం ఒకటి, రెండు మార్కుల్లో అర్హత సాధించలేని వారు దాదాపు 50 వేల మంది ఉన్నారు. దీంతో ఆన్సర్ ‘కీ’లో అవకతవకలు జరిగి ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.
అధికారుల గోప్యతపై అభ్యర్ధులకు పలు అనుమానాలు
తెలంగాణ టెట్-2023 ఫలితాల వెల్లడి సందర్భంగా అధికారులు స్పష్టమైన సమాచారం అందించలేదు. ఫలితాల వెల్లడి అనంతరం ఆలస్యంగా తుది కీ వెబ్‌సైట్‌లో ఉంచారు. ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంతరాల వివరాలు, వాటిల్లో వేటిని పరిగణనలోనికి తీసుకున్నారు.. వేటిల్లో మార్పులు చేశారనే సమాచారం సైతం విద్యాశాఖ వెల్లడించలేదు. ఈ పరిస్థితుల దృష్ట్యా టెట్ రాసిన అభ్యర్థులు ఓంఎంఆర్ షీట్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పలువురు అభ్యర్ధులు టెట్ కన్వినర్‌ను కలిసినా స్పందించకపోవడం మరో విశేషం.
ఈ విషయమై విద్యాశాఖ మంత్రిని నేరుగా కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. టెట్ ఆప్షన్ల మార్పు, సమాచారం వెల్లడించకపోవడంపై మంత్రికి విన్నవించనున్నారు. పరీక్ష, ఫలితాల వెల్లడిపై సరైన సమన్వయం లేదని అధికారవర్గాలు కూడా విమర్శిస్తు్న్నాయి. టెట్ కన్వీనర్ ఏకపక్ష ధోరణితో వ్యవహరించారని అంటున్నారు. ఏ సమాచారం చెప్పేందుకు వెళ్లినా టెట్ కన్వినర్ పట్టించుకోవడం లేదని, మంత్రి కార్యాలయం నుంచి వచ్చే సూచనలు కూడా పరిశీలించని సందర్భాలున్నాయని కొందరు అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో టెట్ నిర్వహణ తీరుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.