Viral: ‘పొట్టవిప్పి చూడ నట్లు.. బోల్టులుండూ..’ కడుపునొప్పితో వచ్చిన వ్యక్తి కడుపులో 100 రకాల వస్తువులు
పంజాబ్‌లోని మోగా జిల్లా మోగాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో రెండు రోజులుగా కడుపు నొప్పితోపాటు వాంతులు, తీవ్రవైన జ్వరం తోడయ్యింది. దీంతో అతను రాత్రిళ్లు నిద్ర పోకుండా ఉండటంతో కుటుంబ సభ్యులు మెడిసిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరిక్షల్లో భాగంగా వైద్యులు స్కానింగ్ చేశారు. స్కానింగ్ చేస్తున్న సమయంలో సదరు వ్యక్తి కడుపులో ఉన్న వాటిని చూసి డాక్టర్లు షాక్‌కు గురయ్యారు. అనంతరం ఆపరేషన్ చేసి కడుపులో..
చండీగఢ్, సెప్టెంబర్ 29: రెండేళ్లుగా కడపు నొప్పితో బాధపడుతోన్న ఓ వ్యక్తి తాజాగా ఆసుపత్రికి వెళ్లాడు. వైద్య పరిక్షల్లో భాగంగా వైద్యులు స్కానింగ్ చేశారు. స్కానింగ్ చేస్తున్న సమయంలో సదరు వ్యక్తి కడుపులో ఉన్న వాటిని చూసి డాక్టర్లు షాక్‌కు గురయ్యారు. అనంతరం ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న ఇయర్‌ఫోన్స్, తాళం, తాళం చెవి, బోల్టులు, నట్లు, వాచర్లు, తదితర వస్తువులను వైద్యులు శస్త్ర చికిత్స చేసి తొలగించారు. వివరాల్లోకెళ్తే..
పంజాబ్‌లోని మోగా జిల్లా మోగాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. మానసిక స్థితి సరిగ్గాలేని ఆ వ్యక్తి గత రెండేళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో రెండు రోజులుగా కడుపు నొప్పితోపాటు వాంతులు, తీవ్రవైన జ్వరం తోడయ్యింది. దీంతో అతను రాత్రిళ్లు నిద్ర పోకుండా ఉండటంతో కుటుంబ సభ్యులు మెడిసిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
డాక్టర్లు పరీక్షించి కొన్ని మందులు ఇచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో స్టమక్ ఎక్స్‌రే, స్కాన్ చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. స్కాన్ చేస్తున్న సమయంలో బాధితుడి కడుపులో ఇనుప, ప్లాస్టిక్ వస్తువులు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. దాంతో వైద్యులు మూడు గంటలపాటు శస్త్ర చికిత్స చేసి ఆ వస్తువులన్నింటినీ తొలగించారు. వ్యక్తి కడుపులో నుంచి తీసిన వస్తువుల్లో ఇయర్ ఫోన్‌లు, వాషర్లు, నట్స్, తాళం చెవి లాకెట్‌లు, బటన్‌లు, రేపర్‌లు, హెయిర్‌క్లిప్‌లు, జిప్పర్ ట్యాగ్, సేఫ్టీపిన్స్, బోల్ట్‌లు, వైర్లు, రాఖీలు, తాళం, మార్బుల్ వంటి దాదాపు వంద వస్తువులు ఉన్నాయి.
మానసిక స్థితి సరిగా లేని ఆ వ్యక్తి వాటిని ఎప్పుడు మింగేశాడో తమకు తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇలాంటి కేసును తన వైద్య వృత్తిలో తొలిసారి చూశానని మెడిసిటీ డైరెక్టర్ డాక్టర్ అజ్మీర్ కర్లా తెలిపారు. రెండేళ్ల నుంచి బాధితుడి కడుపులో ఆ వస్తువులు బాధితుడి కడుపులో ఉండటంతో అనారోగ్యానికి గురయ్యాడు. దాదాపు 3 గంటలపాటు ఆపరేషన్ చేసి వస్తువుల్ని తొలగించామని ఆయన అన్నారు. వ్యక్తి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. మానసిక స్థితి సరిగా లేని సదరు వ్యక్తి ఎప్పుడు మింగేశాడో తమకు అవగాహన లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బాధితుడి కడుపులో అన్ని వస్తువులు ఉండటం తెలిసి తాము కూడా ఆశ్చర్యానికి గురయ్యామని అన్నారు. కడుపు నొప్పి గురించి అప్పుడప్పుడు చెప్పేవాడని, కొద్ది రోజులగా నొప్పి ఎక్కువై నిద్ర కూడా పోకపోవడంతో డాక్టర్లను సంప్రదించామని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.