Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Newspapers: ‘ఆహారం ప్యాక్‌ చేయడానికి న్యూస్‌ పేపర్లు వాడొద్దు’.. ఫుడ్‌ సేఫ్టీ అధికారుల హెచ్చరిక

న్యూస్‌ పేపర్‌ ఆహార పదార్థాలకు వినియోగించే విషయంలో ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆహారలను ఫ్యాక్‌ చేయడానికి న్యూస్‌ పేపర్‌ను వినియోగించొద్దని వ్యాపారులను కోరింది. న్యూస్‌ పేపర్‌లో ప్యాక్‌ చేసిన ఆహారాలు, నిల్వ చేసిన పదార్థాలను తినవద్దంటూ వినియోగదారులకు సూచించింది. దీనివల్ల ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుందని హెచ్చరించింది. ఈ విషయంలో నిబంధనలను పర్యవేక్షించి, కఠినంగా అమలు చేయడానికి రాష్ట్ర ఆహార అధికారులతో కలిసి పని చేయనున్నట్లు..

Newspapers: 'ఆహారం ప్యాక్‌ చేయడానికి న్యూస్‌ పేపర్లు వాడొద్దు'.. ఫుడ్‌ సేఫ్టీ అధికారుల హెచ్చరిక
Stop Using Newspapers For Packing Food
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 29, 2023 | 8:43 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 29: న్యూస్‌ పేపర్‌ ఆహార పదార్థాలకు వినియోగించే విషయంలో ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆహారలను ఫ్యాక్‌ చేయడానికి న్యూస్‌ పేపర్‌ను వినియోగించొద్దని వ్యాపారులను కోరింది. న్యూస్‌ పేపర్‌లో ప్యాక్‌ చేసిన ఆహారాలు, నిల్వ చేసిన పదార్థాలను తినవద్దంటూ వినియోగదారులకు సూచించింది. దీనివల్ల ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుందని హెచ్చరించింది. ఈ విషయంలో నిబంధనలను పర్యవేక్షించి, కఠినంగా అమలు చేయడానికి రాష్ట్ర ఆహార అధికారులతో కలిసి పని చేయనున్నట్లు తన ప్రకటనలో తెలిపింది.

FSSAI చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) జీ కమల వర్ధనరావు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు, ఆహార విక్రేతలు ఆహార పదార్థాలను ప్యాకింగ్ చేయడానికి, వడ్డించడానికి , నిల్వ చేయడానికి వార్తాపత్రికలను ఉపయోగించడం తక్షణమే నిలిపివేయాలని కోరారు. నూస్‌ పేపర్‌ అనేక ఆరోగ్య ప్రమాదాలకు కారణం అవుతున్నట్లు ఆయన తెలిపారు. వార్తా పత్రికల్లో వినియోగించే ఇంక్‌లో ఎన్నో బయోయాక్టివ్‌ మెటీరియల్స్‌ ఉంటాయని, ఇవి ఆహారాన్ని కలుషితం చేస్తాయని అంటున్నారు. అలా కలుషితం అయిన ఆహారం తినడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయని FSSAI బుధవారం (సెప్టెంబర్‌ 27) హెచ్చరించింది.

అంతేకాకుండా ప్రింటింగ్‌కు ఉపయోగించే ఇంక్‌లో సీసం, లెడ్, భార లోహాలతో సహా హానికారక రసాయనాలు ఉంటాయని, ఇవి ఆహారంలో కలిసిపోతే కాలక్రమేణా తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించింది. వార్తా పత్రికల పంపిణీ వివిధ పర్యావరణ పరిస్థితులకు లోబడి ఉంటుంది. ఫలితంగా వైరస్‌లు, బ్యాక్టీరియా, ఇతర వ్యాధికారక క్రీములు పేపర్లకు అంటుకుపోతాయి. అటువంటి పేపర్లలో ఆహారం తింటే అనారోగ్యానికి దారితీమవచ్చుఅని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది.

ఇవి కూడా చదవండి

వార్తా పత్రికలను ఆహార పదార్థాల ప్యాకింగ్, నిల్వకు వినియోగించకుండా నిషేధిస్తూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 2018లోనే నిబంధనలను నోటిఫై చేయడం గమనార్హం. ఈ నిబంధనల ప్రకారం న్యూస్‌ పేపర్లలో ఆహార పదార్థాలు ప్యాక్‌ చేయడం, వడ్డించడం, వేయించిన ఆహారాలను అందులో ఉంచి తినడం, నూనె అధికంగా ఉన్నప్పుడు దాన్ని వార్తా పత్రికల్లో సాయంతో తొలగించడం వంటివి చేయకూడదని తెలిపారు. ఆహార విక్రేతలు ఎవరైనా ఇలా చేస్తే చట్టరిత్యా నేరంగా పేర్కొంది. కస్టమర్ల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, చట్ట ప్రకారం అనుమతించిన ప్యాకింగ్‌ మెటీరియల్‌నే ఆహార పదార్థాలకు వినియోగించాలని FSSAI చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కమలవర్ధనరావు కోరారు. ఈ మేరకు వార్తాపత్రికలను ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌గా ఉపయోగించడాన్ని తక్షణమే నిలిపివేయాలని దేశవ్యాప్తంగా వినియోగదారులు, ఆహార విక్రేతలను FSSAI కోరింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.