Heart Care Tips: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే గుండె పట్ల జాగ్రత్త వహించండి!!
ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అందరిలో కూడా గుండె పోటు, స్ట్రోక్ వంటివి కామన్ అయిపోయాయి. మన మధ్యలో నవ్వుతూ ఉండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా హార్ట్ స్ట్రోక్ కి గురై మరణిస్తున్నారు. లైఫ్ స్టైల్, తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా ఈ సమస్యలు అనేవి తలెత్తుతున్నాయి. తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం ఒక కారణమైతే, బిజీ లైఫ్ తో ఒత్తిడికి గురవుతుండటం మరో కారణం అవుతుంది. దీంతో శరీంలో హార్మోన్లు ఇన్ బ్యాలెన్స్ అవుతున్నాయి. దీంతో హార్ట్ అనేది వీక్ అవుతుంది. మన శరీరంలో అంత్యంత..
ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అందరిలో కూడా గుండె పోటు, స్ట్రోక్ వంటివి కామన్ అయిపోయాయి. మన మధ్యలో నవ్వుతూ ఉండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా హార్ట్ స్ట్రోక్ కి గురై మరణిస్తున్నారు. లైఫ్ స్టైల్, తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా ఈ సమస్యలు అనేవి తలెత్తుతున్నాయి. తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం ఒక కారణమైతే, బిజీ లైఫ్ తో ఒత్తిడికి గురవుతుండటం మరో కారణం అవుతుంది. దీంతో శరీంలో హార్మోన్లు ఇన్ బ్యాలెన్స్ అవుతున్నాయి. దీంతో హార్ట్ అనేది వీక్ అవుతుంది. మన శరీరంలో అంత్యంత ముఖ్యమైన అవయవాల్లో గుండె ఒకటి. హార్ట్ పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మొదటిలోనే శరీరంలో వచ్చే మార్పులను గమనించి.. తగిన చికిత్స తీసుకుంటే.. గుండె పోటుకు దూరంగా ఉండవచ్చు. హార్ట్ ఎటాక్ వచ్చే ముందు మన శరీరంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వాటిని కనుక ముందే గుర్తించి.. చికిత్స తీసుకుంటే.. జాగ్రత్తగా ఉండవచ్చు. మరి సంకేతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
1. అలసట:
గుండె పోటు వచ్చే ముందు అలసట అనేది ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న చిన్న పనులకే మనకు తెలియకుండానే అలసట వచ్చేస్తుంది.
2. బరువు పెరగడం:
సడెన్ గా వచ్చే గుండె సంబంధిత సమస్యల కారణంగా మనం ఒక్కసారిగా బరువు పెరుగుతాం.
3. శరీరంలో నొప్పులు:
హార్ట్ ఎటాక్ వచ్చే ముందు మనలో చాలా మార్పులు కనిపిస్తాయి. వాటిల్లో శరీరంలో నొప్పులు కూడా ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలలో భుజాలు, మెడ, దవడలో నొపపి, భుజాలు, చేతులు, ఎగువ బొడ్డు వంటివి గుండె సమస్యలను సూచిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా గుర్తించాలి.
4. వికారం – వాంతులు:
గుండె పోటుకు గురయ్యే ముందు చాలా మందిలో వికారంగా, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
5. విపరీతమైన చెమట:
విపరీతంగా చెమట పడితే అది కార్డియాక్ అరెస్ట్ కి సంకేతంగా గుర్తించవచ్చు. ఛాతీలో నొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు కూడా చెమట విపరీతంగా కనిపిస్తుంది.
6. ఛాతిలో నొప్పి:
గుండె పోటు ఎదురైనప్పుడు ఛాతీలో నొప్పి అనేది మొదలవుతుంది. కానీ దీన్ని ఎవరూ సరిగ్గా గుర్తించరు. ఒత్తిడిగా, మంట, బిగుతుగా అనిపిస్తుంది.
7. వాపులు:
హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు చాలా మందిలో పాదాలు, కాళ్లు, చీల మండలు, పొత్తి కడపులో వాపు లక్షణాలు కనిపిస్తాయి. గుండె తగినంతగా రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేనప్పుడు బాడీ ద్రవంతో నిండిపోతుంది. ఈ క్రమంలో వాపులు వస్తాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.