Newspapers Side Effects: నూనె పీల్చేందుకు న్యూస్ పేపర్లను వినియోగిస్తున్నారా.. అయితే మీరు డేంజర్ లో పడ్డట్లే!!
మనం చేసే చిన్న చిన్న పొర పాట్లు, మిస్టేక్స్ వల్లనే అనారోగ్య పాలవుతూంటాం. కానీ ఆ విషయం మనకు తెలీదు. సాధారణంగా రోడ్ సైడ్ టిఫిన్స్ కానీ, స్నాక్స్ కానీ తినేటప్పుడు వాటిని న్యూస్ పేపర్లలో పెట్టి ఇస్తూంటారు. స్ట్రీట్ స్టైల్ ఫుడ్ అదిరిపోతుందని మనం కూడా లొట్టలేసుకుంటూ తినేస్తూ ఉంటాం. ప్యాకింగ్ కూడా న్యూస్ పేపర్ లోనే చేసి ఇస్తారు. ఇళ్లలో కూడా చాలా మంది స్నాక్స్ తినేందుకు న్యూస్ పేపర్లనే ఉపయోగిస్తూంటారు. అందులోనూ మనకు వేడి వేడిగా నోట్లో..
మనం చేసే చిన్న చిన్న పొర పాట్లు, మిస్టేక్స్ వల్లనే అనారోగ్య పాలవుతూంటాం. కానీ ఆ విషయం మనకు తెలీదు. సాధారణంగా రోడ్ సైడ్ టిఫిన్స్ కానీ, స్నాక్స్ కానీ తినేటప్పుడు వాటిని న్యూస్ పేపర్లలో పెట్టి ఇస్తూంటారు. స్ట్రీట్ స్టైల్ ఫుడ్ అదిరిపోతుందని మనం కూడా లొట్టలేసుకుంటూ తినేస్తూ ఉంటాం. ప్యాకింగ్ కూడా న్యూస్ పేపర్ లోనే చేసి ఇస్తారు. ఇళ్లలో కూడా చాలా మంది స్నాక్స్ తినేందుకు న్యూస్ పేపర్లనే ఉపయోగిస్తూంటారు. అందులోనూ మనకు వేడి వేడిగా నోట్లో పడాల్సిందే. అలాంటి వేడి వేడి పదార్థాలను న్యూస్ పేపర్లలో తినడం చాలా ప్రమాదమని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) వెల్లడించింది.
ఎఫ్ఎస్ఎస్ఏఐ వార్నింగ్:
ఇళ్లలో అయినా హోటల్స్ లో అయినా నూనె పీల్చేందుకు ఎక్కువగా న్యూస్ పేపర్లనే ఉపయోగిస్తూంటారు. వేడి వేడి పదార్థాలను ఆ న్యూస్ పేపర్ వేస్తారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరమట. వేడిగా ఉన్న ఆహారాలు కానీ, చల్లగా ఉన్న ఆహార పదార్థాలు కానీ నేరుగా న్యూస్ పేపర్ పై వేయ కూడదట. ప్యాకింగ్ కూడా న్యూస్ పేపర్లలో చేయకూడదు. దీని వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ సూచించింది.
న్యూస్ పేపర్లలో వేసిన ఆహారాలు తింటే రోగాలను కొని తెచ్చుకున్నట్టే అని తెలిపారు. ఇదే కాదు ఇళ్లలో కూడా ఈ న్యూస పేపర్లను పలు రకాలుగా ఉపయోగిస్తూంటారు. ముఖ్యంగా ఆహార పదార్థాలను భద్ర పరచడంలో, ప్యాక్ చేయడం చూస్తూటాం. వీటి వాడకం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయిని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. అలాగే వ్యాపారులకు న్యూస పేపర్లను తిను బండారాలకు ఉపయోగించవద్దని వార్నింగ్ ఇచ్చింది.
న్యూస్ పేపర్ ఇంక్ లో హానికర రసాయనాలు:
న్యూస్ పేపర్లను తయారు చేయడానికి వాడే ఇంక్ లో ఎన్నో రసాయనాలు కలుపుతూంటారు. దానికి తోడు వీటిని ఎక్కడ పడితే అక్కడ వేస్తారు. ఉదయం పేపర్లు వేసే టప్పుడు కూడా ఇవి చెట్ల మధ్యలో, దుమ్ములో పడిపోతూ ఉంటాయి. వీటిపై దుమ్మూ, ధూళి అనేవి ఎక్కువగా పేరుకుపోయి ఉంటాయి. ఇలాంటి వాటిపై వేడి వేడి ఆహార పదార్థాలు వేయడం వల్ల పలు సమస్యలు వస్తాయట. అంతే కాదు ఇవే దీర్ఘకాలిక వ్యాధులుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
న్యూస్ పేపర్ లో ఉంచిన ఆహారాలు తీసుకుంటే డేంజర్:
రసాయనాలు కలిపిన ఈ ఇంక్ శరీరంలోకి వెళ్లడం వల్ల లేని పోని అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఇవి వెంటనే చూపించక పోయినా.. భవిష్యత్తులో మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపింది. ఈ విషయంపై పలు అధ్యయనాలు చేసినట్టు పేర్కొంది ఎఫ్ఎస్ఎస్ఏఐ. న్యూస్ పేపర్లను ఆహార పదార్థాలకు అస్సలు వినయోగించ వద్దని తాజాగా సూచించింది. ఈ మేరకు వ్యాపారులకు కూడా పలు సూచనలు జారీ వెల్లడించింది ఎఫ్ఎస్ఎస్ఏఐ.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.