Hair Growth Tips: ఈ ఆకులు జుట్టును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. ఒత్తుగా నిగనిగలాడేలా చేస్తాయి!!

ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో చాలా మంది అనేక సమస్యలతో పోరాడుతున్నారు. వాటిల్లో జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా ఉంటున్నాయి. నేటి తరంలో సరైన పౌష్టిక ఆహారాన్ని తీసుకోక పోవడంతో జుట్టుకు సరైన పోషణ అందడం లేదు. దీంతో జుట్టు నిర్జీవంగా, బలహీనంగా తయారై రాలిపోతుంది. ఇప్పుడున్న కాలుష్యంతో చుండ్రు, దురద వంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. దీంతో జుట్టు పలుచబడడం, నెరిసిపోవడం జరుగుతున్నాయి. దాంతో చిన్న వయసులోనే.. వయసు అయిపోయిన వారిలా కనిపిస్తున్నారు. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం..

Hair Growth Tips: ఈ ఆకులు జుట్టును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. ఒత్తుగా నిగనిగలాడేలా చేస్తాయి!!
Hair Care 5
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 28, 2023 | 10:16 PM

ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో చాలా మంది అనేక సమస్యలతో పోరాడుతున్నారు. వాటిల్లో జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా ఉంటున్నాయి. నేటి తరంలో సరైన పౌష్టిక ఆహారాన్ని తీసుకోక పోవడంతో జుట్టుకు సరైన పోషణ అందడం లేదు. దీంతో జుట్టు నిర్జీవంగా, బలహీనంగా తయారై రాలిపోతుంది. ఇప్పుడున్న కాలుష్యంతో చుండ్రు, దురద వంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. దీంతో జుట్టు పలుచబడడం, నెరిసిపోవడం జరుగుతున్నాయి. దాంతో చిన్న వయసులోనే.. వయసు అయిపోయిన వారిలా కనిపిస్తున్నారు. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడమే కాకుండా పోషణ కూడా అందించాలి. జంక్ ఫుడ్ ని పూర్తిగా అవైడ్ చేసి.. ఇంట్లో చేసిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే వ్యాయామం కూడా చేస్తూ ఉండాలి. వీటితో పాటు ఇప్పుడు చెప్పబోయే టిప్స్ కూడా పాటిస్తే.. ఆరోగ్యమైన జుట్టు మీ సొంతం అవుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.

బ్రహ్మి:

బ్రహ్మి మొక్క ఆకులు కూడా జుట్టు ఎదుగుదలకు ఎంతగానో సహకరిస్తాయి. వీటిలో ఉండే ఆల్కలాయిడ్స్ జుట్టు పెరుగుదలకు హెల్ప్ చేస్తుంది. బ్రహ్మిని వాడటం వల్ల జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

తులసి ఆకులు:

మన చుట్టు ప్రక్కల ఉండే తులసి ఆకులు కూడా మన జుట్టు ఆరోగ్యానికి సహాయ పడతాయి. ముఖ్యంగా స్కాల్ఫ్ పై ఉండే చుండ్రు, దురదను తగ్గిస్తాయి. తులసి ఆకుల రసాన్ని తల మాడుపై రాసి, మర్దనా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. జుట్టు ఎదుగుదలకు కూడా చక్కగా ఉపయోగ పడుతాయి తులసి ఆకులు.

పుదీనా ఆకులు:

పుదీనా ఆకులు కూడా మనకు విరివిగా లభ్యమవుతాయి. పుదీనాతో కూడా జుట్టును పోడవుగా పెంచుకోవచ్చు. తలలో ఇన్ ఫెక్షన్, జుట్టు రాలడం వంటి సమస్యలను తగ్గించడంతో పాటు హెయిర్ ని ఆరోగ్యంగా ఉంచడంలో పుదీనా హెల్ప్ చేస్తుంది.

కరివేపాకులు:

జుట్టు సమస్యలను తగ్గించుకోవడంలో కరివే పాకు బాగా సహాయ పడుతుంది. కరివేపాకుతో జుట్టుకును పొడుగ్గా, ఒత్తుగా, ఆరోగ్య వంతంగా తయారు చేసుకోవచ్చు. కుదుళ్లను స్ట్రాంగ్ చేయడంలో కరివేపాకు చక్కగా ఉపయోగ పడుతుంది.

లావెండర్:

తలలో ఉండే ఇన్ ఫెక్షన్లను, బ్యాక్టీరియాను తగ్గించడంలో లావెండర్ ఆయిల్ బాగా ఉపయోగ పడుతుంది. అలాగే కుదుళ్లు పొడి బారిపోకుండా, సాఫ్ట్ గా, షైనీగా ఉంచుతుంది.

ఉసిరి:

జుట్టును హెల్దీగా ఉంచడంలో ఉసిరి కాయ ఎంతో హెల్ప్ చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా ఉసిరి కాయను జుట్టు సంరక్షణలో బాగా ఉపయోగిస్తారు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును ఒత్తుగా చేయడమే కాకుండా ఎదిగేందుకు కూడా తోడ్పడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే