AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cauliflower Fried Rice: ధాబా స్టైల్ లో క్యాలీ ఫ్లవర్ రైస్ ఇలా చేయండి.. ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా లాగించేస్తారు!

రెస్టారెంట్లలో, ధాబాల్లో చేసే వాటిల్లో క్యాలీ ఫ్లవర్ ఫ్రైడ్ రైస్ కూడా ఒకటి. వెజిటేరియన్స్ ఎక్కువగా దీన్ని తింటూంటారు. చాలా టేస్టీగా.. తినే కొద్దీ తినాలనిపించేంతగా ఉంటుంది. అదే స్టైల్ లో ఇంట్లో కూడా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో మనం చేసుకుంటే ఎంతో హైజినిక్ గా కూడా ఉంటుంది. ఇలా ఒక్కసారి క్యాలీ ఫ్లవర్ ఫ్రైడ్ రైస్ ను తయారు చేశారంటే ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా మొత్తం లాగించేస్తారు. మరింకెందుకు లేట్ ఎంతో టేస్టీగా ఉన్న క్యాలీ ఫ్లవర్ ఫ్రైడ్ రైస్ కు..

Cauliflower Fried Rice: ధాబా స్టైల్ లో క్యాలీ ఫ్లవర్ రైస్ ఇలా చేయండి.. ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా లాగించేస్తారు!
Cauliflower Fried Rice
Chinni Enni
| Edited By: |

Updated on: Oct 02, 2023 | 11:30 PM

Share

రెస్టారెంట్లలో, ధాబాల్లో చేసే వాటిల్లో క్యాలీ ఫ్లవర్ ఫ్రైడ్ రైస్ కూడా ఒకటి. వెజిటేరియన్స్ ఎక్కువగా దీన్ని తింటూంటారు. చాలా టేస్టీగా.. తినే కొద్దీ తినాలనిపించేంతగా ఉంటుంది. అదే స్టైల్ లో ఇంట్లో కూడా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో మనం చేసుకుంటే ఎంతో హైజినిక్ గా కూడా ఉంటుంది. ఇలా ఒక్కసారి క్యాలీ ఫ్లవర్ ఫ్రైడ్ రైస్ ను తయారు చేశారంటే ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా మొత్తం లాగించేస్తారు. మరింకెందుకు లేట్ ఎంతో టేస్టీగా ఉన్న క్యాలీ ఫ్లవర్ ఫ్రైడ్ రైస్ కు కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.

క్యాలీ ఫ్లవర్ ఫ్రైడ్ రైస్ కు కావాల్సిన పదార్థాలు:

కట్ చేసి పెట్టుకున్న క్యాలీ ఫ్లవర్ ముక్కలు, ఉడికించిన బాస్మతీ రైస్, అల్లం, వెల్లుల్లి పేస్ట్, షాజీరా, ఉప్పు, మిరియాల పొడి, కారం, నూనె, ఫుడ్ కలర్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్, ఫ్రెంచ్ బీన్స్, పచ్చి బఠాణీ, క్యాబేజీ తరుగు, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, సన్నగా తరిగిన వెల్లుల్లి, వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్.

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

ముందుగా బాస్మతీ రైస్ ని అరగంట సేపు నాన బెట్టుకుని, పదునుగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో నీటిగా శుభ్రం చేసుకున్న క్యాలీ ఫ్లవర్ ముక్కల్లో అల్లం, వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం, ఉప్పు, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, ఫుడ్ కలర్, మిరియాల పొడి, కొద్దిగా నీటిని వేసుకుని మొత్తం ముక్కలన్నింటికీ పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని.. వేడి చేసుకున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకోని, ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. వెడల్పుగా ఉన్న ఒక బాండీ తీసుకుని సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక.. వెల్లుల్లి తరుగు, ఉల్లి పాయ ముక్కలు, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఇవి వేగాక పచ్చి బఠాణి, క్యాబేజీ, బీన్స్ తరుగు వేసి మళ్లీ ఎర్రగా వేయించుకోవాలి.

నెక్ట్స్ వీటిని బాగా వేయించుకున్న తర్వాత మిరియాల పొడి, ఉప్పు, వెనిగర్, సోయా సాస్, చిల్లీ సాస్ వేసి కలపాలి. తర్వాత వేయించిన క్యాలీ ఫ్లవర్ ముక్కలు వేసి కలపాలి ఇవి కూడా వేగాక.. ఉడికించిన అన్నాన్ని కూడా వేసి హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకోవాలి. చివరిగా మరోసారి కొత్తి మీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే ధాబా స్టైల్ క్లాలీ ఫ్లవర్ రైస్ రెడీ. ఇంకెందుకు లేట్ మీరూ ఓ సారి ట్రై చేయండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

Follow Us
తొండం లేని వినాయకుడు ఎక్కడ ఉన్నాడు? ప్రపంచంలోనే అరుదైన నరముఖ..
తొండం లేని వినాయకుడు ఎక్కడ ఉన్నాడు? ప్రపంచంలోనే అరుదైన నరముఖ..
ఈ పశువుల డాక్టర్ ఇలా ఎందుకు చేయిస్తున్నారో తెలుసా..?
ఈ పశువుల డాక్టర్ ఇలా ఎందుకు చేయిస్తున్నారో తెలుసా..?
కారవాన్‌లోనే బోర్డు మీటింగ్.. ఏపీ టూరిజం సరికొత్త ఆలోచన
కారవాన్‌లోనే బోర్డు మీటింగ్.. ఏపీ టూరిజం సరికొత్త ఆలోచన
బూందీ మిక్చర్‌లో కరకరలాడే బల్లి.. స్వీట్‌ షాప్‌పై కేసు, జరిమానా
బూందీ మిక్చర్‌లో కరకరలాడే బల్లి.. స్వీట్‌ షాప్‌పై కేసు, జరిమానా
పిచ్చి పీక్స్.. వ్యూస్ కోసం ట్రైన్‌లో యువకుడు చేసింది చూస్తే..
పిచ్చి పీక్స్.. వ్యూస్ కోసం ట్రైన్‌లో యువకుడు చేసింది చూస్తే..
బ్యాంక్ అకౌంట్లో్ అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ఇబ్బందులే..
బ్యాంక్ అకౌంట్లో్ అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ఇబ్బందులే..
ఇదేం మ్యాజిక్ భయ్యా.. మన తెలుగోడి స్కిల్‌కు ఎవరైనా ఫిదా..
ఇదేం మ్యాజిక్ భయ్యా.. మన తెలుగోడి స్కిల్‌కు ఎవరైనా ఫిదా..
ఈ నెలలోనే తొలి ఏకాదశి.. వీరికి ఆ రోజున మహర్దశ పట్టబోతోంది..
ఈ నెలలోనే తొలి ఏకాదశి.. వీరికి ఆ రోజున మహర్దశ పట్టబోతోంది..
పూజలో నేలపై కూర్చోవచ్చా? ఆసనం లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది?..
పూజలో నేలపై కూర్చోవచ్చా? ఆసనం లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది?..
'Wiproలో లేఆఫ్.. అది దేవుడిచ్చిన వరం' మాజీ ఉద్యోగిని వీడియో వైరల్
'Wiproలో లేఆఫ్.. అది దేవుడిచ్చిన వరం' మాజీ ఉద్యోగిని వీడియో వైరల్