AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salt Side Effects: ఉప్పు తినడం వల్ల ఆ అవయవాలకు ఎంత ప్రమాదమో తెలుసా!!

ఉప్పు మన ఆహారంలో ఒక భాగం. ఉప్పుతోనే మనం వండే ఆహారాలకు అసలైన రుచి వస్తుంది. ఉప్పు లేకపోతే ఏ వంటకమైనా సరే అంత రుచించదు. ఒక రకంగా ఉప్పు మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎలా అంటారా.. బాడీలో తగినంత నీరు ఉండేలా చేస్తుంది. కండరాలు, నరాల పని తీరును మెరుగు పరుస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ను సమతుతల్యం చేయడంలో కూడా ఉప్పు మనకు హెల్ప్ అవుతుంది. ఉప్పుతో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నా మోతాదుకు మించి ఎక్కువగా తిసుకుంటే మాత్రం విషం..

Salt Side Effects: ఉప్పు తినడం వల్ల ఆ అవయవాలకు ఎంత ప్రమాదమో తెలుసా!!
Rock Salt
Chinni Enni
| Edited By: Ram Naramaneni|

Updated on: Sep 27, 2023 | 10:01 PM

Share

ఉప్పు మన ఆహారంలో ఒక భాగం. ఉప్పుతోనే మనం వండే ఆహారాలకు అసలైన రుచి వస్తుంది. ఉప్పు లేకపోతే ఏ వంటకమైనా సరే అంత రుచించదు. ఒక రకంగా ఉప్పు మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎలా అంటారా.. బాడీలో తగినంత నీరు ఉండేలా చేస్తుంది. కండరాలు, నరాల పని తీరును మెరుగు పరుస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ను సమతుతల్యం చేయడంలో కూడా ఉప్పు మనకు హెల్ప్ అవుతుంది. ఉప్పుతో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నా మోతాదుకు మించి ఎక్కువగా తిసుకుంటే మాత్రం విషం అవుతుంది. ఉప్పు అనేది స్లో పాయిజన్. మెల్లగా మన శరీరంలోని అవయవాలను పాడు చేస్తుంది. కాబట్టి ఉప్పును ఎప్పుడూ తక్కువగానే తీసుకుంటూ ఉండాలి. లేదంటే మనం వివిధ దీర్ఘకాలిక రోగాల బారిన పడాల్సి వస్తుంది. ఎన్నో దుష్ప్రభావాలను ఎదుర్కొనవలసి ఉంటుంది. ఉప్పును అధికంగా తీసుకోవడం కారణంగా మన శరీరంలోని కొన్ని అవయవాలు సరిగ్గా పని చేయవు. అధికంగా ఉప్పును తీసుకోవడం వల్ల తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మరి ఆ అవయవాలు ఏంటో తెలుసుకుందాం.

రక్త నాళాలు:

అధికంగా ఉప్పును తీసుకోవడం వల్ల రక్త నాళాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో రక్త నాళాలు ఒత్తిడికి గురవుతాయి. ఈ కారణంగా రక్త పోటు వచ్చే కారణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతే కాకుండా గుండె జబ్బులు కూడా వస్తాయి. గుండె పోటు, స్ట్రోక్ వంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మూత్ర పిండాలు:

ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్ర పిండాలపై కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఉప్పు అధికంగా తినడం వల్ల మూత్ర పిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది.

మెదడు:

ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల బ్రెయిన్ కు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది.

కంటి సమస్యలు:

ఉప్పును ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కంటి చూపు మందగించే అవకాశం ఉంది. దృష్టి లోపాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఎముకలు:

ఉప్పును తీసుకోవడం వల్ల క్యాల్షియం సాంద్రత అనేది తగ్గుతుంది. మూత్రం ద్వారా బయటకు పోతుంది. ఎముకలు కూడా బలహీనంగా, నిర్జీవంగా తయారవుతాయి. దీంతో ఎముకలు గుల్లగా తయారవుతాయి.

ఉప్పు తింటే రుచిగానే ఉంటుంది. కానీ ఆ తర్వాతే అసలైన సమస్యలు మొదలవుతాయి. ఇవి కాస్తా దీర్ఘకాలిక వ్యాధులుగా తయారవుతాయి. కాబట్టి ఉప్పును సరైన తక్కువ మోతాదులో తీసుకుంటేనే ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..