Cooking in Iron Kadai: ఐరన్ పాత్రల్లో వంట చేస్తే ఆరోగ్యానికి మంచిదేనా? అసలు నిజాలేంటో తెలుసుకోండి!

ఇప్పుడంటే వంట చేసే పాత్రల్లో అనేక రకాలు వచ్చాయి కానీ.. ఒకప్పుడు మాత్రం మట్టి పాత్రల్లో, ఇనుము కళాయిల్లో వంటలు చేసే వారు. మారుతున్న లైఫ్ స్టైల్ ప్రకారం.. ఎవరి ఆర్థిక పరిస్థితికి తగ్గట్టు వంట చేసే పాత్రల్లో ఎన్నో రకాలు వచ్చాయి. కొత్తగా ఎన్ని వచ్చినా.. పాత పద్దతులే బెటర్ అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే ఊరికే అనలేదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. నాన్ స్టిక్ పాన్స్ వచ్చాక.. ఇనుము పాత్రల వాడకం పూర్తిగా తగ్గిపోయింది. ఏ రకం వంట చేయాలన్నా ఇప్పుడు అందరూ నాన్ స్టిక్ పాన్సే ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇందులో చేసిన వంట మాడకుండా, త్వరగా అయిపోతుంది. అయితే నాన్ స్టిక్..

Cooking in Iron Kadai: ఐరన్ పాత్రల్లో వంట చేస్తే ఆరోగ్యానికి మంచిదేనా? అసలు నిజాలేంటో తెలుసుకోండి!
Cooking In Iron Kadai
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 27, 2023 | 9:43 PM

ఇప్పుడంటే వంట చేసే పాత్రల్లో అనేక రకాలు వచ్చాయి కానీ.. ఒకప్పుడు మాత్రం మట్టి పాత్రల్లో, ఇనుము కళాయిల్లో వంటలు చేసే వారు. మారుతున్న లైఫ్ స్టైల్ ప్రకారం.. ఎవరి ఆర్థిక పరిస్థితికి తగ్గట్టు వంట చేసే పాత్రల్లో ఎన్నో రకాలు వచ్చాయి. కొత్తగా ఎన్ని వచ్చినా.. పాత పద్దతులే బెటర్ అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే ఊరికే అనలేదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. నాన్ స్టిక్ పాన్స్ వచ్చాక.. ఇనుము పాత్రల వాడకం పూర్తిగా తగ్గిపోయింది. ఏ రకం వంట చేయాలన్నా ఇప్పుడు అందరూ నాన్ స్టిక్ పాన్సే ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇందులో చేసిన వంట మాడకుండా, త్వరగా అయిపోతుంది. అయితే నాన్ స్టిక్ పాన్స్ వాడకం కూడా అంత మంచిది కాదని నిపుణులే స్వయంగా చెప్పారు. కానీ ఇనుము పాత్రల్లో వంట చేసుకుని తినడం వల్ల కూడా ఆరోగ్యానికి మంచిదన్న విషయం మీకు తెలుసా..

ఇనుపు పాత్రల్లో వంట చేయడం ఆరోగ్యానికి మంచిదా? కాదా?:

జర్నల్ ఆఫ్ ది అమెరికన్ డైటెటిక్ లేటెస్ట్ గా ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం.. ఇనుము పాత్రల్లో చేసిన ఆహారాల్లో దాదాపు 90 శాతం ఐరన్ ఉన్నట్లు తేల్చారు. అలాగే ఇనుము పాత్రల్లో వంట చేసిన ఆహారాన్ని తినడం వల్ల రక్త హీనత, ఐరన్ లోపం ప్రమాదాలు తగ్గినట్టు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

శరీరానికి ఐరన్ చాలా అవసరం:

ఐరన్ అనేది శరీరానికి ఎంతో అవసరం. ఇది శరీరంలో కణాలను అభివృద్ధి చేయడంలో ఎంతో హెల్ప్ చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోని తగినంతగా రక్తం ఉండాలంటే ఐరన్ చాలా అవసరం. అందుకే రక్త హీనతతో బాధపడే వారిని ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తినాలని వైద్యులు చెబుతూంటారు. ఐరన్ లోపం వల్ల చాలా మంది రక్త హీనతతో బాధ పడుతూంటారు. చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఐరన్ ముఖ్యం. ఐరన్ లోపం వల్ల అలసట, నీరసం, ఏ పని చేయాలనిపించకపోవడం, నిద్రలేమి సమస్యలు వంటివి ఎదురవుతాయి.

ఇనుము పాత్రల్లో వంట చేసినప్పుడు గుర్తించుకోవాల్సిన విషయాలు:

* ఇనుము పాత్రల్లో ఒకసారి చేసిన ఆహారాలను మళ్లీ వేడి చేయకూడదు.

* ఇనుము పాత్రల్లో ఆమ్ల రకాల పదార్థాలను వండకూడదు. అంటే వెనిగర్, నిమ్మ వంటి పదార్థాలను చేయకూడదు. దీని వలన వంట రుచి చెడిపోతుంది.

* ఇనుము పాత్రల్లో ఆహారాలను ఎక్కువ సేపు ఉడికించకూడదు. దీని వల్ల ఆహారంలోని పోషకాలు నశిస్తాయి.

* ఇనుము పాత్రలను అతిగా రుద్ది తోమకూడదు. దీని వల్ల చేసిన వంట అతుక్కుపోతుంది.

* ఇనుము పాత్రలను వాష్ చేసే ముందు ఉప్పు, బేకింగ్ సోడా వేసి ఒకసారి రుద్దుకుని ఆ తర్వాత శుభ్రంగా కడగడం మంచిది.

* ఐరన్ పాత్రలను తరుచుగా ఉపయోగిండం వల్ల ఐరన్ కూడా మనకు లభిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.