Black Pepper Benefits: చిట్టి మిరియాలతో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
మిరియాలు.. వీటి గురించి పరిచయాలు అవసరం లేదు. అందరికీ తెలుసు. మిరియాలను పురాతన కాలం నుంచి వినియోగిస్తున్నారు. ఆయుర్వేదంలో కూడా మిరియాలను ఉపయోగిస్తూంటారు. వీటితో అనేక అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాగే ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. అందులో ప్రస్తుతం వర్షా కాలం నడుస్తోంది.. ఇక వచ్చేది వింటర్ సీజన్. ఈ రెండు కాలాల్లో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే జలుబు, దగ్గు, జ్వరం వంటిని వెంటనే చుట్టుముడతాయి. ఇలా సీజన్ల ద్వారా వచ్చే సమస్యలను తగ్గించడంలో మిరియాలు బాగా పని చేస్తాయి. మిరియాల్లో ఐరన్,..
మిరియాలు.. వీటి గురించి పరిచయాలు అవసరం లేదు. అందరికీ తెలుసు. మిరియాలను పురాతన కాలం నుంచి వినియోగిస్తున్నారు. ఆయుర్వేదంలో కూడా మిరియాలను ఉపయోగిస్తూంటారు. వీటితో అనేక అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాగే ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. అందులో ప్రస్తుతం వర్షా కాలం నడుస్తోంది.. ఇక వచ్చేది వింటర్ సీజన్. ఈ రెండు కాలాల్లో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే జలుబు, దగ్గు, జ్వరం వంటిని వెంటనే చుట్టుముడతాయి. ఇలా సీజన్ల ద్వారా వచ్చే సమస్యలను తగ్గించడంలో మిరియాలు బాగా పని చేస్తాయి. మిరియాల్లో ఐరన్, సోడియం, పాస్పరస్, పొటాషియం, కాల్షియం, విటమిన్ ఏ, సి వంటివి ఉంటాయి. సాధారణంగా మనకు జలుబు చేస్తే మిరియాల పాలు తాగుతూ ఉంటాయి. ఇంకా మిరియాలతో చాలా బెనిఫిట్స్ పొందవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణ సమస్యలు ఉండవు:
జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడేలా చేయడంలో మిరియాలు ఉపకరిస్తాయి. తరచూ వీటిని తీసుకుంటే జీర్ణ సమస్యలు ఉండవు. గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను తగ్గించడంలో మిరియాలు బాగా హెల్ప్ చేస్తాయి. పొట్ట పట్టేసి కడుపు ఉబ్బరంగా, నొప్పిగా ఉన్నప్పుడు కాసిన్ని మిరియాలను ఓ గ్లాస్ నీటిలో వేసి కాసేపే నానబెట్టి ఆ నీటిని తాగితే ఉపశమనం పొందవచ్చు.
సీజన్ల వ్యాధులు రాకుండా కాపాడుతుంది:
మిరియాల్లో యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. తరచూ వీటిని తీసుకుంటూ ఉంటే.. వాతావరణ మార్పులు కారణంగా వచ్చే వ్యాధులు రాకుండా చూస్తాయి. దగ్గు, జలుబు వంటి సమస్యలతో ఇబ్బంది పడితే.. ఒక కప్పు నీటిలో మిరియాలు, తులసి ఆకులు, అల్లం వేసి బాగా మరిగించుకోవాలి. ఇవి సగం అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు తేనె కలుపుకుని తాగితే రిలీఫ్ వస్తుంది. అలాగే బాడీలోని వ్యర్థ పదార్థాలు ఏమైనా ఉంటే బయటకు పోతాయి.
మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది:
డయాబెటీస్ తో బాధపడే వారు మిరియాలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటే ఈ వ్యాధి కంట్రోల్ కి వస్తుంది. మిరియాలు రక్తంలోని షుగర్ లెవల్స్ ని అదుపులోకి తీసుకువస్తాయి.
రక్త ప్రసరణ సాఫీగా:
మిరియాలు తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేందుకు తోడ్పడతాయి.
గుండె పనితీరును మెరుగు పరుస్తుంది:
మిరియాలు తీసుకోవడం వల్ల గుండె పని తీరు మెరుగు పడుతుంది. గుండెకు సరఫరా చేసే రక్తంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చేస్తాయి మిరియాలు.
క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది:
మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ ను నివారించే శక్తి మిరియాల్లో ఉంది. మిరియాల్లో విటమిన్ ఏ, సి, కెరోటిన్లు, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.