Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silent Walking: ఈ విషయం మీకు తెలుసా.. వాకింగ్ చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలంట!

వ్యాయామంలో భాగంగా చాలా మంది వాకింగ్ చేస్తూంటారు. రోజూ ఒక గంట లేదా కనీసం అరగంటైనా వాకింగ్ చేయాలని వైద్యులు కూడా సూచిస్తూంటారు. ఎక్సర్ సైజులు చేయలేని వారు వాకింగ్ చేయడం అనేక లాభాలు ఉన్నాయి. చాలా మందికి వాకింగ్ చేయం కూడా ఇష్టమే. సరదాగా వారి పార్టనర్స్, పిల్లలు, ఫ్రెండ్స్ లేదా కొలిగ్స్ తో వాకింగ్ చేస్తూంటారు. కుదిరిన వారు ఉదయం, సాయంత్రం కూడా వాకింగ్ చేస్తారు. కుదరని వారు మార్నింగ్ లేదా ఈవినింగ్ చేస్తూంటారు. అయితే వాకింగ్ చేస్తూ సరదగా మాట్లాడుకుని వెళ్తూండటం కామన్. ఒంటరిగా వెళ్లిన వారు మాత్రం ఎయిర్ ఫోన్స్ చెవిలో పెట్టేస్తూంటారు. పాటలు..

Silent Walking: ఈ విషయం మీకు తెలుసా.. వాకింగ్ చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలంట!
Morning Walk
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 27, 2023 | 7:24 PM

వ్యాయామంలో భాగంగా చాలా మంది వాకింగ్ చేస్తూంటారు. రోజూ ఒక గంట లేదా కనీసం అరగంటైనా వాకింగ్ చేయాలని వైద్యులు కూడా సూచిస్తూంటారు. ఎక్సర్ సైజులు చేయలేని వారు వాకింగ్ చేయడం అనేక లాభాలు ఉన్నాయి. చాలా మందికి వాకింగ్ చేయం కూడా ఇష్టమే. సరదాగా వారి పార్టనర్స్, పిల్లలు, ఫ్రెండ్స్ లేదా కొలిగ్స్ తో వాకింగ్ చేస్తూంటారు. కుదిరిన వారు ఉదయం, సాయంత్రం కూడా వాకింగ్ చేస్తారు. కుదరని వారు మార్నింగ్ లేదా ఈవినింగ్ చేస్తూంటారు. అయితే వాకింగ్ చేస్తూ సరదగా మాట్లాడుకుని వెళ్తూండటం కామన్. ఒంటరిగా వెళ్లిన వారు మాత్రం ఎయిర్ ఫోన్స్ చెవిలో పెట్టేస్తూంటారు. పాటలు వింటూ వాకింగ్ లేదా జాగింగ్ చేస్తారు. వాకింగ్ చేయడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి నో డౌట్. అయితే మాట్లాడుకుంటూ వాకింగ్ చేయడం ఎలాంటి బెనిఫిట్స్ ఉండవని వెల్లడించారు ఆరోగ్య నిపుణులు. వాకింగ్ తో బెనిఫిట్స్ పొందాలంటే సైలెంట్ వాకింగే బెటర్ అని తేల్చారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒంటరిగా వెళ్లేందుకు ట్రై చేయండి:

వాకింగ్ కి కామన్ గా ఫ్రెండ్స్ లేదా మనకు తెలిసిన వాళ్లతో వెళ్తూంటాం. వాళ్లతో సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తారు. ఇలా టైమ్ స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది. కానీ ఇది సరైన పద్దతి కాదంట. అలా మాట్లాడుకుంటూ వెళ్లడం వల్ల మీ ఫోకస్ వాకింగ్ పై ఉండదట. సైలెంట్ గా వాకింగ్ చేస్తేనే.. మీ ఫోకస్ అంతా వాకింగ్ పై ఉంటుందని.. ఇలా చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది:

మాట్లాడకుండా సైలెంట్ గా వాకింగ్ చేయడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగు పడుతుందట. ఇలా చేస్తే ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా సైలెంట్ గా నడిచే వారిలో పాజిటీవిటీ, క్రియేటివిటీ కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గుతారు:

సైలెంట్ గా వాకింగ్ చేస్తే.. కేవలం మీ ఫోకస్ వాకింగ్ పైనే ఉంటుంది. కాబట్టి రోజూ నడిచే దాని కంటే ఇంకొంత దూరం నడవాలనిపిస్తుంది. కాబట్టి ఇది మీరు బరువు తగ్గేందుకు కూడా సహాయ పడుతుంది.

ఏకాగ్రతను పెంచుతుంది:

ఒంటరిగా, సైలెంట్ గా వాకింగ్ చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. దీంత ఏ పని మీదైనా ఏకాగ్రత పెట్టేందుకు హెల్ప్ అవుతుంది.

కాగా రోజూ అరగంట సేపు వాకింగ్ చేస్తే 150 క్యాలరీలను కరిగించుకోవచ్చు. గుండె సంబంధిత వ్యాధులు కూడా రావు. ఎముకలు బలంగా మారడమే కాకుండా కండరాలకు శక్తి పెరుగుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.