Tomato for Skin: టమాటాతో చర్మాన్ని మెరిపించండిలా.. రంగు కూడా మారుతుంది!
టమాటాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే తగిన మోతాదులోనే తీసుకోవాలి. కేవలం కూరల్లోకే కాకుండా టమాటోతో చర్మం గ్లో కూడా పెంచుకోవచ్చు. కొంత మంది టమాటాను రసం, జ్యూస్ లా చేసుకుని తాగుతూం ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా.. స్కిన్ కూడా మంచి హైడ్రేట్ గా తయారవుతుంది. అలా జ్యూస్ లా తాగలేని వారు టమాటానో నేరుగా చర్మంపై ఉపయోగించుకోవచ్చు. టమాటాతో చర్మాన్ని కూడా మెరిపించుకోవచ్చు. టమాటా గుజ్జు,..
టమాటాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే తగిన మోతాదులోనే తీసుకోవాలి. కేవలం కూరల్లోకే కాకుండా టమాటోతో చర్మం గ్లో కూడా పెంచుకోవచ్చు. కొంత మంది టమాటాను రసం, జ్యూస్ లా చేసుకుని తాగుతూం ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా.. స్కిన్ కూడా మంచి హైడ్రేట్ గా తయారవుతుంది. అలా జ్యూస్ లా తాగలేని వారు టమాటానో నేరుగా చర్మంపై ఉపయోగించుకోవచ్చు. టమాటాతో చర్మాన్ని కూడా మెరిపించుకోవచ్చు. టమాటా గుజ్జు, రసం, పేస్ట్ వంటి వాటితో ఫేస్ ప్యాక్ లు రెడీ చేసుకుని యూజ్ చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
తరచూ కాస్త సమయం తీసుకుని వాడితే స్కిన్ టోన్ కూడా మెరుగు పడుతుంది. ముఖ్యంగా చర్మంపై పేరుకున్న ట్యాన్ ను తీసి వేయడంలో టమాటా బాగా హెల్ప్ చేస్తుంది. కొంత మందికి కాస్త ఎండ తగిలినా కూడా ముఖం నల్లగా మారుతుంది. స్కిన్ దెబ్బతినకుండా ఉంచడంలో టమాటా బాగా ఉపకరిస్తుంది. టమాటాను ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వృద్ధాప్య ఛాయలు రాకుండా చూస్తుంది:
కొంత మందికి చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తాయి. దీంతో వయస్సు ఉన్న వారిలా కనిపిస్తారు. ఇలాంటి ఛాయలు రాకుండా చూడటంలో టమాటా బాగా హెల్ప్ చేస్తుంది. టమాటాల్లో విటమిన్ డి మెండుగా ఉంటుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు రాకుండా.. వచ్చినా తగ్గించడంలో సహకరిస్తుంది.
డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది:
మనం ఎంత శుభ్రం చేసుకున్నా కూడా ముఖంపై డెడ్ స్కిన్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇవి అంత ఈజీగా పోవు. దీంతో చాలా మంది బ్యూటీ పార్లర్లకు వెళ్తూంటారు. అలా కాకుండా ఇంట్లోనే టమాటా ఫేస్ ప్యాక్ లను ట్రై చేస్తే మృత కణాలు పోతాయి. అంతే కాకుండా స్కిన్ టోన్ కూడా మెరుగు పడుతుంది.
జిడ్డుకు చెక్ పెడుతుంది:
కొంత మందికి జిడ్డు చర్మం ఉంటుంది. దీంతో వారు ఎక్కడికి వెళ్లాలన్నా కష్టమే. ఎంత నీటిగా శుభ్రం చేసుకున్నా.. జిడ్డు కారుతూ ఉంటుంది. ఇలాంటి వారు ఏది వాడాలన్నా భయమే. ఇలాంటి జిడ్డు చర్మం గల వారికి టమాటా బాగా హెల్ప్ చేస్తుంది. టమాటాకు జిడ్డును నియంత్రించే గుణాలు ఉన్నాయి. కాబట్టి టమాటను కట్ చేసి ఒక ముక్కను తీసుకుని ముఖంపై మెల్లగా రుద్దుకోవాలి. బాగా ఆరిపోయాక నీటితో క్లీన్ చేసుకోవమే. ఇలా చేస్తూ ఉంటే జిడ్డు చర్మానికి బై బై చెప్పవచ్చు.
సన్ బర్న్ ను నివారిస్తుంది:
వడ దెబ్బ దీన్నే సన్ బర్న్ అంటారు. ఎండా కాలంలో కొన్ని పనుల నిమిత్తం ఎండలో బయటకు వెళ్లి రావాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. వడ దెబ్బ తినేస్తాం. ముఖం కూడా కమిలిపోయి నల్లగా మారుతుంది. ట్యాన్ పేరుకుంటుంది. ఇలాంటి వారు ఎండలో నుంచి రాగానే కాళ్లు, చేతులు, ముఖం కడుక్కుని.. టమాటా గుజ్జును ముఖానికి, ఎండ తగిలిన భాగాలకు పట్టిస్తే ట్యాన్ పోవడమే కాకుండా.. మంచి రిలాక్సేషన్ దొరుకుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.