Parenting Tips: మీ పిల్లలు చేతికి అందిన వస్తువులను విసిరేస్తున్నారా.. ఎందుకో తెలుసుకోండి!
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే.. ఆ ఇల్లు ఎప్పుడూ గందర గోళంగానే ఉంటుంది. పెట్టిన వస్తువు పెట్టిన చోట ఉండదు. అన్నింటినీ పీకి పందిరి వేస్తారు. పిల్లలు జాగ్రత్తగా ఉండకపోతే దెబ్బలు కూడా తగిలే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని సార్లు చెప్పినా.. తిట్టినా.. ఆఖరికి కొట్టినా కూడా కొంత మంది పిల్లలు అస్సలు పట్టించుకోరు. వారి చేతికి అందిన వస్తువులను విసిరేస్తారు. ఇలా ఆట వస్తువులు విసిరా పర్వాలేదు కానీ..
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే.. ఆ ఇల్లు ఎప్పుడూ గందర గోళంగానే ఉంటుంది. పెట్టిన వస్తువు పెట్టిన చోట ఉండదు. అన్నింటినీ పీకి పందిరి వేస్తారు. పిల్లలు జాగ్రత్తగా ఉండకపోతే దెబ్బలు కూడా తగిలే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని సార్లు చెప్పినా.. తిట్టినా.. ఆఖరికి కొట్టినా కూడా కొంత మంది పిల్లలు అస్సలు పట్టించుకోరు. వారి చేతికి అందిన వస్తువులను విసిరేస్తారు. ఇలా ఆట వస్తువులు విసిరినా పర్వాలేదు కానీ.. కొన్ని వస్తువులు ఇంట్లోకి పనికి వచ్చేవి కూడా ఉంటాయి. అవి పగిలితే బాధగా ఉంటుంది. కానీ ఏం చేస్తాం వాళ్లకు అర్థం కాని వయసు అని సరిపెట్టుకుంటారు పెద్దలు. అయితే పిల్లలు వస్తువులను ఎందుకు విసిరి కొడతారో తెలుసా.
- మనతో చెప్పడానికి: కొంత మంది పిల్లలకు రెండు, మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు మాటలు సరిగా రావు. ఫలానాది కావాలని చెప్పలేరు. కాబట్టి వాళ్లు ఎక్స్ ప్రెస్ చేసే విధానం వేరుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆకలి నుంచి చిరాకు వరకు వారు ఏం చెప్పాలనుకున్నా వారి వద్ద ఉన్న వస్తువులను విసిరేస్తారు. వాటిని పెద్దవారు గ్రహించి పిల్లలకు ఏం కావాలో ఇవ్వాలి.
- ఇష్టం ఆట: వస్తువులను విసరడం కూడా వాళ్లకు నచ్చిన ఓ ఆట. అలా విసిరేయడం నవ్వడం చూస్తూంటాం. అంతే కాదు ఆ వస్తువు కింద పడిన శబ్దాలు ఒక్కోటి ఒక్కోలా ఉంటాయి. అవి కూడా ఇష్టపడుతూంటారు పిల్లలు. వాళ్లు ఎక్కువగా ఆడుకోవడానికి మక్కువ చూపిస్తూ ఉంటారు.
- దృష్టిని ఆకర్షించడం కోసం: పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని ఇంట్లోని సభ్యులు వారి వారి పనుల్లో నిమగ్నమై ఉంటారు. కానీ పిల్లలు మాత్రం ఎవరూ నన్ను పట్టించుకోవడం లేదని.. వారినే పట్టించుకోలనే ఆశతో కూడా వస్తువులను విసిరి కొడతారని నిపుణులు చెబుతున్నారు. అలాగే మనం వారినే చూస్తూ ఉంటే మళ్లీ మళ్లీ వస్తువులను విసిరేస్తూనే ఉంటారు. అంటే దానికి అర్థం వారితో సమయం గడపాలని అర్థం.
- చూసి నేర్చుకోవడం: కొంత మంది పిల్లలు వస్తువులను విసిరికొట్టరు. అయితే ఇంట్లోని సభ్యులు ఎవరైనా ఇలా చేస్తే మాత్రం చూసి నేర్చుకుంటారు. పక్క పిల్లల్ని చూసి కూడా ఇలా చేస్తారు. కిడ్స్ ఎక్కువగా బాల్స్ విసరడానికి ఇష్ట పడతారు.
- అలా చేయవద్దని చెప్పాలి: పిల్లలు వస్తువులను విసరడానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే అలా వస్తువులు విసరవద్దని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది వారికి ఆటగానే ఉన్నా.. ఉండేకొద్దీ అలవాటు అవుతుంది. దీంతో ఖరీదైన వస్తువులు పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిల్లల్ని ఏడిపించే మాదిరిగా కాకుండా కాస్త సున్నితంగా చెప్పాలి.
ఇవి కూడా చదవండి
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.