Sperm Precautions: ఈ ఫుడ్స్ తో జాగ్రత్త.. వీటిని తింటే మీ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందట!
మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా మన శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. లేని పోని అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. పూర్వంలో వ్యాధులు అనేవి చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు రోజుకో రోగం బయటపడుతుంది. ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో పురుషులు ఎక్కువగా ఫేస్ చేసే మరో ప్రాబ్లమ్ ఏంటంటే.. స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం. కాలుష్యం, కల్తీ ఫుడ్, శరీరక శ్రమ లేపోవడం, మద్యం సేవించడం, పొడ త్రాగటం వంటివి..
మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా మన శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. లేని పోని అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. పూర్వంలో వ్యాధులు అనేవి చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు రోజుకో రోగం బయటపడుతుంది. ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో పురుషులు ఎక్కువగా ఫేస్ చేసే మరో ప్రాబ్లమ్ ఏంటంటే.. స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం. కాలుష్యం, కల్తీ ఫుడ్, శరీరక శ్రమ లేపోవడం, మద్యం సేవించడం, పొడ త్రాగటం వంటివి పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి దారి తీస్తున్నాయి. దీంతో పిల్లలు పుట్టడం కష్టంగా మారుతుంది. మనకు తెలియకుండానే తినే కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ పడిపోతాయి. మరి ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకోండి.
ఎనర్టీ డ్రింక్స్, సోడాలు:
కొంత మంది ఎనర్జీ డ్రింక్స్, సోడాలు, కార్బోనేటేడ్ డ్రింక్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. రెస్టారెంట్లలో, ఫంక్షన్స్ లో లేదా ఇంట్లో తరచూ తాగుతూంటారు. ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకుంటే స్పెర్మ్ కౌంట్ పడిపోతుందట. డ్రింక్స్ అండ్ ఎనర్జీ డ్రింక్స్ లో షుగర్ మోతాదు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది బాడీలో ఆక్సీకరణ ప్రెజర్ ను పెంచుతంది. దీంతో స్పెర్మ్ డీఎన్ఏకి హాని కలిగి.. 30 శాతం వరకూ స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశాలు ఉన్నాయట. కాబట్టి పురుషులు వీటికి దూరంగా ఉంటేనే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.
క్యాన్డ్ ఫుడ్ కి దూరంగా ఉండాలి:
క్యాన్డ్ ఫుడ్ అంటే డబ్బాలు, టిన్లలో నిల్వ చేసే ఆహారం. వీటిల్లో బిస్పినాల్ (బీపీఏ) అనే పదార్థం ఉంటుంది. ఇది బాడీలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తికి సహకరిస్తుంది. దీంతో స్పెర్మ్ ప్రొఫైల్ పై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఫుడ్స్ కి మగవారు దూరం ఉండాలి.
ప్రాసెస్ చేసిన మాంసాహారం:
ప్రాసెస్ చేసిన మాంసాహారానికి కూడా దూరంగా ఉండాలి. ఇలా ప్రాసెస్ చేసిన మాంసాహారం తింటే స్పెర్మ్ కౌంట్ తగ్గుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మాంసాహార పదార్థాల్లో బీఫ్ జెర్కీ, సలామీ, హాట్ డాగ్, బేకన్ లాంటివి స్పెర్మ్ కౌంట్ ను ప్రభావితం చేస్తాయి.
హై ఫ్యాట్ మిల్క్:
హై ఫ్యాట్ ఉన్న మిల్క్, పాల ఉత్పత్తులు అయిన చీజ్, క్రీమ్ మిల్క్ వంటివి తీసుకున్నా కూడా స్పెర్మ్ కౌంట్ పై ప్రభావితం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
సోయా ఉత్పత్తులు:
సోయాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని పిల్లలు కావాలనుకున్న వారు మాత్రం తీసుకోక పోవడం బెటర్ అని చెబుతున్నారు నిపుణులు. ఇది బాడీలో ఈస్ట్రోజన్ స్థాయిలను పెంచి, టెస్టో స్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇవి స్పెర్మ్ పై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నవారు.. సోయా ఉత్పత్తులకు దూరంగా ఉండటమే మంచిది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.