Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nipah Virus In Children: తరుముకొస్తున్న నిఫా వైరస్.. మీ పిల్లలను రక్షించుకోండిలా!!

పిల్లలు ఎక్కువగా ఈ నిఫా వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారిని ఈ సమయంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అసలే ప్రస్తుతం వాతావరణ మార్పులు ఉంటాయి కాబట్టి.. దీంతో జలుబు, జ్వరం, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఈ క్రమంలో వారికి రోగ నిరోధక శక్తి అనేది తగ్గుతుంది. ఇది కాస్తా నిఫా వైరస్ గా మారే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా పెద్దలతో పోల్చిచే పిల్లలకు సరైన అవగాహన ఉండదు. కాబట్టి కింద పడిన..

Nipah Virus In Children: తరుముకొస్తున్న నిఫా వైరస్.. మీ పిల్లలను రక్షించుకోండిలా!!
Nipah Virus
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Sep 19, 2023 | 1:51 PM

2018లో కేరళను వణికించిన నిఫా వైరస్.. ఇప్పుడు మరోసారి దాని ప్రభావాన్ని చూపిస్తోంది. నిఫా వైరస్ తో లేటెస్ట్ గా కేరళలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. మరికొంతమంది చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధి క్రమ క్రమంగా విస్తరిస్తోంది. నిఫా వైరస్.. కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైనదని ఐసీఎంఆర్ చెబుతోంది. నిఫా వైరస్ సోకిన వారిలో మరణాల రేటు 40 నుంచి 70 శాతం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక నిఫా వైరస్ కారణంగా ఇప్పటికే కేరళలో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. నిఫా వైరస్ అనేది పందులు, గబ్బిలాల నుంచి వ్యాపించేది. ముందు ఈ వ్యాధి జంతువులకు సోకుంది. జంతువుల నుంచి మనుషులకు సోకుంది. అయితే ఈ నిఫా వైరస్ కు సరైన చికిత్స, వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది.

అయితే పిల్లలు ఎక్కువగా ఈ నిఫా వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారిని ఈ సమయంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అసలే ప్రస్తుతం వాతావరణ మార్పులు ఉంటాయి కాబట్టి.. దీంతో జలుబు, జ్వరం, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఈ క్రమంలో వారికి రోగ నిరోధక శక్తి అనేది తగ్గుతుంది. ఇది కాస్తా నిఫా వైరస్ గా మారే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా పెద్దలతో పోల్చిచే పిల్లలకు సరైన అవగాహన ఉండదు. కాబట్టి కింద పడిన ఫుడ్ ని కూడా తీసుకుని తినడం, ఇతర పిల్లలతో కలిసి బయట ఆడుకోవడం వంటివి చేస్తూంటారు. అయితే ఈ సమయంలో వారి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఒక చూద్దాం.

వైరస్ పట్ల అవగాహన కల్పించడం:

ఇవి కూడా చదవండి

నాలుగేళ్ల వయసు నుంచి పిల్లలకు కాస్త అర్థమయ్యే శక్తి ఉంటుంది. కాబట్టి వారికి నిఫా వైరస్ గురించి అవగాహన కల్పించాలి. భౌతిక దూరం పాటించడం, క్లీనింగ్ పాటించడం, కాళ్లు, చేతులు కడుక్కోవడం గురించి చెబుతూ ఉండాలి.

పరిశుభ్రతను పాటించాలి:

పిల్లలకు తెలీదు కాబట్టి ముందు ఇంట్లోనే తల్లిదండ్రులు చెప్పాలి. కింద పడిన వస్తువులను తినకూడదని, జంతువులకు దూరంగా ఉండాలని, తరచూ కాళ్లు, చేతులు క్లీన్ చేసుకోవడం చెప్పాలి. అలాగే వారు ఏ వస్తువునైనా తాకే ముందు శానిటైజర్ ను వాడాలని గుర్తు చేయాలి.

మాస్క్ ధరించాలి:

మార్కెట్ లేదా బహిరంగ ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు మాస్క్ పెట్టుకోవాలని సూచించాలి. కేవలం నోరు మాత్రమే కాకుండా ముక్కును మాస్క్ కవర్ చేసే విధంగా ఉండాలి. అలాగే వారికి సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి.

వ్యాక్సిన్ అందించడం:

పిల్లలు జబ్బు పడితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. జబ్బు పడిన సమయంలో పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గుతుంది. కాబట్టి టెస్టులు చేసి సంబంధిత వ్యాక్సిన్ ను అందించాలి.

ఇమ్యూనిటీ ఫుడ్ ని అందించాలి:

పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచడానికి అవసరమయ్యే ఫుడ్ ని అందించాలి. పిల్లలు జంక్ ఫుడ్ నే ఎక్కువగా ఇష్టపడతారు. కానీ ఈ సమయంలో తినకూడదు కాబట్టి.. ఏదైనా ఫుడ్ ని ఇంట్లోనే తయారు చేసి పెట్టాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.