Diabetes Insulin: డయాబెటీస్ వ్యాధి గ్రస్తులకు గుడ్ న్యూస్ అంటే ఇది కదా.. 2025 నాటికి..!!

డయాబెటీస్.. ఇదొక దీర్ఘకాలిక వ్యాధి. ఒకసారి ఈ షుగర్ వచ్చిందంటే మళ్లీ పోవడం కష్టం. ప్రస్తుతం చిన్నా పెద్దా అనే తేడా లేదు. స్కూల్ కి వెళ్లే పిల్లలు సైతం ఈ డయాబెటీస్ తో బాధ పడుతున్నారు. ఇప్పుడున్న జీవన విధానం, ఆహారం కూడా ఈ డయాబెటీస్ రావడానికి తోడ్పడుతుంది. ఒక వైపు మెడిసిన్ తీసుకున్నా కూడా చాలా కంట్రోల్ లో ఉండాలి. లేదంటే ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. దీంతో మళ్లీ ఆస్పత్రుల చుట్టూ తిరగాలి. ఇష్టమైన ఆహారాన్ని కూడా తీసుకోవడానికి జంకుతూంటారు మధుమేహంతో బాధ పడేవారు..

Diabetes Insulin: డయాబెటీస్ వ్యాధి గ్రస్తులకు గుడ్ న్యూస్ అంటే ఇది కదా.. 2025 నాటికి..!!
Diabetes
Follow us
Chinni Enni

|

Updated on: Sep 19, 2023 | 2:17 PM

డయాబెటీస్.. ఇదొక దీర్ఘకాలిక వ్యాధి. ఒకసారి ఈ షుగర్ వచ్చిందంటే మళ్లీ పోవడం కష్టం. ప్రస్తుతం చిన్నా పెద్దా అనే తేడా లేదు. స్కూల్ కి వెళ్లే పిల్లలు సైతం ఈ డయాబెటీస్ తో బాధ పడుతున్నారు. ఇప్పుడున్న జీవన విధానం, ఆహారం కూడా ఈ డయాబెటీస్ రావడానికి తోడ్పడుతుంది. ఒక వైపు మెడిసిన్ తీసుకున్నా కూడా చాలా కంట్రోల్ లో ఉండాలి. లేదంటే ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. దీంతో మళ్లీ ఆస్పత్రుల చుట్టూ తిరగాలి. ఇష్టమైన ఆహారాన్ని కూడా తీసుకోవడానికి జంకుతూంటారు మధుమేహంతో బాధ పడేవారు. కాస్త ఎక్కువ ఆహారం తీసుకున్నా కూడా.. షుగర్ లెవల్స్ ను పెంచేస్తుంది చేస్తుంది.

ఇలా బాధ పడే డయాబెటీస్ వ్యాధి గ్రస్తులకు ఇప్పుడు చెప్పబోయే వార్త నిజంగా గుడు న్యూస్. 2025 లో భారతదేశంలో షుగర్ కు మొట్ట మొదటి వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని డెన్మార్క్ ఫార్మా దిగ్గజం నోవో నార్డిస్క్ కంపెనీ వెల్లడించింది. ఈ విషయాన్ని ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రీయ లేటెస్ట్ ఇంటర్వ్యూలో మీడియాకు తెలిపారు. భారత్ కు వీలైనంత త్వరగా డయాబెటీస్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురాన్నున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ పై ట్రైయల్స్ జరుగుతున్నాయని.. అవి సమర్థవంతంగా పూర్తి అయ్యాక 2025లో ఈ వ్యాక్సిన్ ను భారత్ లోకి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పుకొచ్చారు శ్రోత్రీయ.

ఐకోడెక్ వ్యాక్సిన్ భద్రత కోసం 52 వారాల పాటు భారత్ తో పాటు మరో తొమ్మి దేశాల్లో 80 సైట్ లలో పరీక్షలు నిర్వహించారు శాస్త్రవేత్తలు. అధ్యయనం ప్రకారం.. ఈ వ్యాక్సిన్ టైప్ – 2 డయాబెటీస్ తో బాధ పడుతున్న వారు వారానికి ఒక్కసారి తీసుకుంటే సరిపోతుందని, ఇది ఇన్సులిన్ తో పోలిస్తే గ్లైసెమిక్ ను నియంత్రణలో ఉంచుతుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా ఈ సంవత్సరం ది లాన్సెట్ లో ప్రచురించబడిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన ఒక అధ్యయనంలో భారతదేశంలో 101 మిలియన్ల మంది డయాబెటీస్ తో బాధపడుతున్నట్లు తేలింది. అయితే డయాబెటీస్ రాకుండా ఉండాలంటే.. రోజూ వ్యాయామంతో పాటు ఇంట్లో చేసిన ఆహారానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగే మీ రోజు వారీ డైట్లో ఆకు కూరలు, కాయగూరలు, పండ్లు వంటివి ఉండేలా చూసుకోండి. అలాగే నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ లాంటి వాటికి వీలైనంత వరకూ దూరంగా ఉంటే బెటర్.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్