AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Vijay Antony’s Daughter Suicide: విజయ్ ఆంటోనీ కూతురు సూసైడ్.. టీనేజర్స్ ఆత్మహత్యలకు కారణాలు అవేనా?

ఆత్మహత్యలు.. క్షణిక కాలంలో తీసుకున్న నిర్ణయాలు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో టీనేజర్స్ ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చదువులు, ఆర్థిక ఇబ్బందులు, ప్రేమలు మొదలగు చిన్న చిన్న కారణాలతోనే ఎంతో మంది యువతీ యువకులు సూసైడ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో అందరితో పాటు ఫాస్ట్ గా ముందుకు వెళ్లాలి.. లేదంటే లైఫ్ లో వెనుక ఉండిపోవాల్సిందే. ఇప్పుడు ఇదే కారణంతో ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. ఎవరికి చెప్పాలో..

Actor Vijay Antony's Daughter Suicide: విజయ్ ఆంటోనీ కూతురు సూసైడ్.. టీనేజర్స్ ఆత్మహత్యలకు కారణాలు అవేనా?
Depression
Chinni Enni
|

Updated on: Sep 19, 2023 | 5:06 PM

Share

ఆత్మహత్యలు.. క్షణిక కాలంలో తీసుకునే నిర్ణయాలు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో టీనేజర్స్ ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చదువులు, ఆర్థిక ఇబ్బందులు, ప్రేమలు మొదలగు చిన్న చిన్న కారణాలతోనే ఎంతో మంది యువతీ యువకులు సూసైడ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో అందరితో పాటు ఫాస్ట్ గా ముందుకు వెళ్లాలి.. లేదంటే లైఫ్ లో వెనుక ఉండిపోవాల్సిందే. ఇప్పుడు ఇదే కారణంతో ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. ఎవరికి చెప్పాలో.. ఏం చేయాలో తెలీని స్థితిలో సూసైడే మార్గమని క్షణికావేశంలో ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకుని, కన్నవాళ్లకు కన్నీళ్లను మిగుల్చుతున్నారు.

తాజాగా ప్రముఖ స్టార్ హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోని పెద్ద కూతురు మీరా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో కోలీవుడ్ మొత్తం షాక్ కి గురైంది. ఉదయం మూడు గంటలకు తన గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. మీరా ప్రస్తుతం 12వ తరగతి చదువుతుంది. ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే కన్ను మూసింది మీరా. ప్రస్తుతం విజయ్ ఆంటోని కూతురు మీరా సూసైడ్ కేసు.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

కాగా గత కొద్ది రోజులుగా మీరా డిప్రెషన్ తో బాధ పడుతుంది. తనకు ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తున్నారు విజయ్. కానీ ఇంతలోనే మీరా సూసైడ్ చేసుకుంది. గత కొద్ది రోజుల క్రితం ఓ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన విజయ్ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారని, వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలని సూచించారు. ముఖ్యంగా ర్యాంకుల విషయంలో పిల్లల్ని తల్లిదండ్రులు ప్రెజర్ చేయవద్దని సూచించారు. ఈ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

భారత దేశంలో 15 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు ఉన్నవారే మానసికంగా కృంగిపోయి.. ఒత్తిడిని తట్టుకోలేక సూసైడ్ లు చేసుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. డిప్రెషన్ కు చాలా కారణాలు ఉంటాయి. చదువులు, ఇంట్లోని ఆర్థిక ఇబ్బందులు, డ్రగ్స్ కి ఎడిక్ట్ కావడం, ఇతరులతో పోల్చుకోవడం, ఉద్యోగాల్లో ఒత్తిడిలు ఇలా అనేక కారణాలు ఉంటాయి. అయితే మీరు ఎప్పుడైతే లోన్లీగా ఫీల్ అవుతారో.. మీకు ఏ విషయం నచ్చదో అది ఇతరులకు షేర్ చేయాలి. అప్పుడే మనసులోని ఒత్తిడి కాస్త దూరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

జాగ్రత్తలు పాటించాల్సిందే:

* ముఖ్యంగా పిల్లలు చదువుల విషయంలో ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారు. టీచర్లు, పేరెంట్స్ వారిపై ఎక్కువగా ప్రెజర్ తీసుకురాకూడదు. ఆ ఒత్తిడి తట్టుకోలేక కూడా చాలా మంది స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

* తల్లిదండ్రులు కూడా ఎదుటి వారి పిల్లలతో పోల్చకూడదు. అలాగే వారిని నచ్చినివి ఏంటో.. నచ్చనివి ఏంటో తెలుసుకోవాలి. వారు స్కూల్ లో ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి.

* పిల్లలతో వీలైనంత వరకూ ఫ్రెండ్లీగా ఉండాలి. ఈ మధ్య స్కూళ్లు, కాలేజీల్లో కూడా లైంగిక వేధింపులు ఎక్కువ అయ్యాయి. అలాంటి విషయాలు కూడా పిల్లలు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి సున్నితమైన సమస్యలను కూడా వారితో మెల్లగా మాట్లాడుతూ తెలుసుకోవాలి.

* పిల్లలైనా, టీనేజర్స్, ఉద్యోగస్తులు ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన రాగానే దాని నుంచి వేరే విషయాలపై ఫోకస్ చేయాలి. మీరు ఒత్తిడికి గురవుతున్న విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా చెప్పాలి.

* వీలైనంత వరకూ బిజీగా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి సమయాల్లో ఒంటరిగా అస్సలు ఉండకూడదు.

* ఎంత చేసినా ఇంకా డిప్రెషన్ వెంటాడుతూనే ఉంటే వెంటనే సైకాలజిస్ట్ ని సంప్రదించడం మేలు.

* డిప్రెషన్ ఎందుకు వస్తుందో.. ఆ కారణాలకు, ఆ వ్యక్తులకు దూరంగా ఉండాలి.

* డిప్రెషన్ గా ఉంటే వెకేషన్ లాంటివి కూడా ప్లాన్ చేయవచ్చు.

* పిల్లల్ని కూడా పెద్దలు అప్పుడప్పుడూ గమనిస్తూ ఉండాలి. వారిలో డిప్రెషన్ లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సైకాలజిస్ట్ కి చూపించాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.