Amla Juice Benefits: ఉదయాన్నే పరగడుపున ఉసిరి రసం తాగండి.. ఎన్నో బెనిఫిట్స్ ని పొందండి!!

ఉసిరికాయ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎంతో ప్రాచీన కాలం నుంచి ఉసిరి వాడకం కొనసాగుతుంది. పూర్వం ప్రతీ ఇంటి వద్ద ఉసిరి చెట్టు కనిపించేది. కానీ ఇప్పుడు ఉసిరి చెట్టు కనిపిండమే గగనమైంది. ఆయుర్వేదంలో కూడా ఉసిరి కాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు, అనారోగ్య సమస్యలకు ఉసిరిని ఉపయోగిస్తారు. ఉసిరి కాయతో ఎన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే చాలా మందికి ఉసిరిని ఎలా..

Amla Juice Benefits: ఉదయాన్నే పరగడుపున ఉసిరి రసం తాగండి.. ఎన్నో బెనిఫిట్స్ ని పొందండి!!
Amla Juice
Follow us

|

Updated on: Sep 19, 2023 | 5:13 PM

ఉసిరికాయ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎంతో ప్రాచీన కాలం నుంచి ఉసిరి వాడకం కొనసాగుతుంది. పూర్వం ప్రతీ ఇంటి వద్ద ఉసిరి చెట్టు కనిపించేది. కానీ ఇప్పుడు ఉసిరి చెట్టు కనిపిండమే గగనమైంది. ఆయుర్వేదంలో కూడా ఉసిరి కాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు, అనారోగ్య సమస్యలకు ఉసిరిని ఉపయోగిస్తారు. ఉసిరి కాయతో ఎన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే చాలా మందికి ఉసిరిని ఎలా వాడలో తెలీదు. ఎలా వాడితే ఉసిరితో అమేజింగ్ ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరిని తీసుకుంటే అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఉసిరి కాయను తిన్నా, వాటి రసం తాగినా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో ఓ లుక్ వేసేద్దాం.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

ఉసిరిలో ఇమ్యూనిటీని పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ సీ రోగ నిరోధక శక్తిని బల పరుస్తుంది. నారింజ కంటే ఉసిరిలో ఏకంగా 8 రెట్లు విటమిన్ సీ ఉంటుంది. ఇది ఇన్ ఫెక్షన్లు. ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా నివారిస్తుంది. ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగితే.. రోజంతా ఎనర్జీగా ఉంటారు.

ఇవి కూడా చదవండి

శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపుతుంది:

ఉదయాన్నే పరగడుపున ఉసిరి రసాన్ని తీసుకోవడం వల్ల.. బాడీలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. మల, మూత్ర విసర్జన ద్వారా వీటిని బయటకు పంపుతుంది. ఉసిరి రసంతో యూరిన్ ద్వారా వచ్చే ఇన్ ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు.

కంటి సమస్యలు ఉండవు:

ఉదయాన్నే ఉసిరి రసం తాగితే కంటి సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చు. అంతే కాకుండా దృష్టిని కూడా మెరుగు పరిచే శక్తి ఉసిరిలో ఉంది. వయసు రీత్యా వచ్చే కంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది ఉసిరి.

శరీరంలో మంటను తగ్గిస్తాయి:

ఉసిరిలో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు.. శరీరంలో వచ్చే మంటలను తగ్గిస్తాయి. ఉసిరి రసాన్ని క్రమం తప్పకుండా పరగడుపు తాగితే కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.

జీవ క్రియను పెంచుతుంది:

ఉసిరి కాయలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఖాళీ కడుపుతో ఉసిరి రసాన్ని తాగితే జీవక్రియను పెంచుతుంది. అలాగే అధిక బరువును కూడా నియంత్రణలోకి తీసుకొస్తుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది:

ఉసిరి కాయ రసాన్ని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల రక్తంలోని షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.

చర్మం ఆరోగ్యంగా ఉంటుంది:

ఉసిరి రసంలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా.. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే యూవీ కిరణాల నుంచి చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.