Dengue: బిర్యానీ తింటున్నారా? అయితే, డెంగ్యూ భారిన పడే ఛాన్స్ ఉంది జాగ్రత్త..!
బిర్యానీ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి.. ఎదురుగా పెడితే లొట్టేసుకుని తింటారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా బిర్యానీ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్స్ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో బిర్యానీనే నిలుస్తుంది. సంతోషకరమైన సందర్భమేదైనా సరే బిర్యానీ బుక్ చేసుకుని లాగించేస్తుంటారు. అయితే, ఈ ఇష్టమైన బిర్యానీనే ఇప్పుడు దేశ ప్రజలను హడలెత్తిస్తోంది. ఈ బిర్యానీనే ప్రాణాంతకమైన డెంగ్యూకు కారణం అవుతోంది. అవును, ఇది మేం చెబుతున్న మాట కాదు.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట. పచ్చి నిజం. బిర్యానీనే డెంగ్యూ వైరస్ వ్యాప్తికి కారణం అంటున్నారు వైద్యులు. అదెలాగో ఇప్పుడుత ఎలుసుకుందాం..

డెంగ్యూ వైరస్‌ను మోసే ఏడిస్ ఈజిప్ట్ దోమ లార్వా ప్లాస్టిక్ కంటైనర్లలో ఎక్కువగా ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. వీటిలో ఎక్కువ భాగం బిర్యానీ, చికెన్ వంటి ఆహారాలను పార్శిల్ చేసే ప్లాస్టిక్ కవర్లలో ఉన్నట్లు గుర్తించారు. అనేక సందర్భాల్లో ఈ ప్లాస్టిక్ కంటైనర్లు మురికగా ఉండటం, ఓ మూలన దుమ్ముదూళి ఉన్న ప్రదేశాల్లో వదిలేస్తుంటారు. అలాంటి ప్రదేశాలనే సురక్షితమైన ప్రదేశంగా ఎంచుకుంటున్న ఏడిస్ ఈజిప్ట్ దోమ.. ఆ కవర్లపై తమ సంతానానికి కారణమైన లార్వాను విడుదల చేస్తుంటాయి. ఫలితంగా ఈ దోమల వ్యాప్తి పెరిగి డెంగ్యూకు కారణం అవుతోందని నిపుణులు ఉదహరిస్తున్నారు. బ
మొదట్లో పట్టణ ప్రాంతాల్లో మాత్రమే డెంగ్యూకు కారణమైన ఈ దోమల వ్యాప్తి.. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆందోళనను పెంచుతుంది. మన దేశంలో పశ్చిమ బెంగాల్‌లో డెంగ్యూ భారిన పడే వారి సంఖ్య ఇటీవలి కాలంలో భాగా పెరిగిపోతుంది. సెప్టెంబర్ రెండో వారంలో కూడా బంగాళాఖాతం తీర ప్రాంత గ్రామాలలో విపరీతంగా డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయని ఆ రాష్ట్ర వైద్య శాఖ పేర్కొంది. ఒక్క బెంగాల్‌లోనే కాదు.. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ పరిస్థితి నెలకొంది.

డెంగ్యూ బారిన పడొద్దంటే..
డెంగ్యూ అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ఇందులో వ్యాధి తీవ్రత మరింత పెరిగితే.. ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అందుకే.. డెంగ్యూ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా డెంగ్యూ వ్యాప్తికి కారణమైన దోమల వ్యాప్తిని నివారించాలి. ఇందుకోసం ముందుగా.. మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలి. ఖాళీ ప్రదేశాల్లో మురుగు, చెత్త లేకుండా చూసుకోవాలి. తద్వారా దోమల వ్యాప్తి ఉండదు. డెంగ్యూ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.
ఇక డెంగ్యూ భారిన పడిన వారు వెంటనే వైద్యలును సంప్రదించి చికిత్స పొందాలి. లేదంటే సమస్య మరింత తీవ్రమై ప్రాణాపాయానికి దారి తీస్తుంది. డెంగ్యూ లక్షణాలు కనిపించిన వెంటనే.. వైద్యులను సంప్రదించాలి. అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అదే సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. మీరు తినే ఆహారం, వంటపాత్రలపై మూతలు సరైన రీతిలో పెట్టాలి. లేదంటే దోమలు వాటిపై వాలి, వ్యాధులు ప్రభలే అవకాశం ఉంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..