AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gorintaku Benefits: మహిళలు చేతికి గోరింటాకు పెట్టుకుంటే.. హార్మోన్లలో తేడాలు వస్తాయా?

గోరింటాకు.. ఇది అంటే ఇష్టం ఉండని మహిళలు ఉండరు. సిటీల్లో ఉండే వారు అయితే కోన్స్ వంటివి కొనుక్కుని పెట్టుకుంటారు కానీ.. పల్లెటూర్లలో ఉండేవాళ్లు మాత్రం గోరింటాకు కోసుకుని, రుబ్బుకుని పెట్టుకుంటారు. ఫంక్షన్లు అయినా, పండగలైనా చేతికి గోరింటాకు ఉండాల్సిందే. మరికొంత మందికి గోరింటాకు అంటే పిచ్చి. వాళ్లకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పెట్టుకుంటూ ఉంటారు. ఇక పెళ్లిళ్ల సమయంలో అయితే చెప్పాల్సిన పని లేదు. ఎవరి చేతికి చూసినా ఎర్రటి..

Gorintaku Benefits: మహిళలు చేతికి గోరింటాకు పెట్టుకుంటే.. హార్మోన్లలో తేడాలు వస్తాయా?
Gorintaku
Chinni Enni
| Edited By: |

Updated on: Sep 24, 2023 | 8:45 PM

Share

గోరింటాకు.. ఇది అంటే ఇష్టం ఉండని మహిళలు ఉండరు. సిటీల్లో ఉండే వారు అయితే కోన్స్ వంటివి కొనుక్కుని పెట్టుకుంటారు కానీ.. పల్లెటూర్లలో ఉండేవాళ్లు మాత్రం గోరింటాకు కోసుకుని, రుబ్బుకుని పెట్టుకుంటారు. ఫంక్షన్లు అయినా, పండగలైనా చేతికి గోరింటాకు ఉండాల్సిందే. మరికొంత మందికి గోరింటాకు అంటే పిచ్చి. వాళ్లకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పెట్టుకుంటూ ఉంటారు. ఇక పెళ్లిళ్ల సమయంలో అయితే చెప్పాల్సిన పని లేదు. ఎవరి చేతికి చూసినా ఎర్రటి చేతులు దర్శనమిస్తాయి. ఇక గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తూంటారని మహిళలు ఆటపట్టింస్తూంటారు.

మరికొంత మంది ఎర్రగా పండటానికి కొన్నిఇంటి చిట్కాలను కూడా పాటిస్తుంటారు. గోరింటాకు రుబ్బేటప్పుడు చింతపండు వేయడం, నిమ్మరసం పిండుకోవడం వంటివి చేస్తూంటారు. మరికొంత మంది గోరింటాకు తీసేశాక.. కొబ్బరి నూనె రాస్తారు. మరికొంత మంది బెల్లం రసంలో కాటన్ ముంచి చేతికి రాస్తారు. ఇలా గోరింటాకు ఎర్రగా పండటానికి అనేకనేక ప్రయత్నాలు చేస్తారు మగువలు. ఇక మరికొంత మంది గోరింటాకు తలకు కూడా రస్తారు. తెల్లగా ఉన్న జుట్టు కలర్ మారుతుందని, తల చట్ట బడుతుందని అలా చేస్తూంటారు. అయితే లేడీస్ గోరింటాకు పెట్టుకోవడం వల్ల హార్మోన్లలో తేడాలు వస్తాయంటున్నారు నిపుణులు.

హార్మోన్లు చక్కగా పని చేస్తాయి:

ఇవి కూడా చదవండి

ఇలా గోరింటాకు పెట్టుకోవడం వల్ల హెల్త్ కి మంచిదే అని నిపుణులు చెబుతున్నారు. గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. సాధారణంగా మహిళలు ఎక్కువగా ఒత్తిడికి, ఆందోళనలకు లోనవుతూంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు, పరుగులు పెడుతూంటారు. ఈ సమయంలో వారిలో హార్మోన్లు ఇన్ బ్యాలేన్స్ అవుతాయి. దీంతో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూంటారు. అయితే మగువలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల హార్మోన్లు అనేవి సరిగా పని చేస్తాయట. కనీసం ఏడాదికి రెండు సార్లు అయినా గోరింటాకు పెట్టుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు.

రక్తం గడ్డ కట్టదు:

అంతే కాదండోయ్ గోరింటాకుతో ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయట. అలాగే గుండెకు రక్తాన్ని చేరవేసే రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా నిరోధిస్తుంది గోరింటాకు. శరీరంలో వేడి తగ్గిస్తుంది. సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. మహిళలకు గర్భాశయ దోషాలను తొలగిస్తుంది గోరింటాకు. కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

Follow Us
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి
గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!
గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!
ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!
ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!
ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!
ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!
24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.
కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.
బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?
బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?
నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన
నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన
భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?
భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?
లియోనెల్‌ మెస్సీ నెట్‌వర్త్‌ చూస్తే కళ్లు తిరగాల్సిందే..!
లియోనెల్‌ మెస్సీ నెట్‌వర్త్‌ చూస్తే కళ్లు తిరగాల్సిందే..!