Prawns 65: రెస్టారెంట్ స్టైల్ ఫ్రాన్స్ 65ని ఇలా ఇంట్లో ఈజీగా చేయండి.. లొట్టలేసుకుంటూ మొత్తం ఖాళీ చేస్తారు!!

రెస్టారెంట్లలో లభించే వాటిల్లో ఫ్రాన్స్ 65 కూడా ఒకటి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా, టేస్టీగా బలేగా ఉంటుంది. నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తినే వాటిల్లో ఇది కూడా ఒకటి. అందులోనూ ఫ్రాన్స్ అంటే లైక్ ఉన్న వాళ్లు మరీ ఇష్టంగా తింటారు. ఈ ఫ్రాన్స్ 65ని మనం కూడా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా మెలకువలు పాటిస్తే సరిపోద్ది. రెస్టారెంట్ కి వెళ్లారంటే.. ఇది ఆర్డర్ చేయకుండా ఉండరు కొద్ది మంది. మరి ఈ ఫ్రాన్స్ 65ని ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు..

Prawns 65: రెస్టారెంట్ స్టైల్ ఫ్రాన్స్ 65ని ఇలా ఇంట్లో ఈజీగా చేయండి.. లొట్టలేసుకుంటూ మొత్తం ఖాళీ చేస్తారు!!
Prawns 65
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 28, 2023 | 7:14 PM

రెస్టారెంట్లలో లభించే వాటిల్లో ఫ్రాన్స్ 65 కూడా ఒకటి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా, టేస్టీగా బలేగా ఉంటుంది. నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తినే వాటిల్లో ఇది కూడా ఒకటి. అందులోనూ ఫ్రాన్స్ అంటే లైక్ ఉన్న వాళ్లు మరీ ఇష్టంగా తింటారు. ఈ ఫ్రాన్స్ 65ని మనం కూడా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా మెలకువలు పాటిస్తే సరిపోద్ది. రెస్టారెంట్ కి వెళ్లారంటే.. ఇది ఆర్డర్ చేయకుండా ఉండరు కొద్ది మంది. మరి ఈ ఫ్రాన్స్ 65ని ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రాన్స్ 65కి కావాల్సిన పదార్థాలు:

క్లీన్ చేసిన రొయ్యలు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, ఉప్పు, నిమ్మ రసం, మిరియాల పొడి, బియ్యం పొడి, కార్న్ ఫ్లోర్, కొద్దిగా నూనె.

ఇవి కూడా చదవండి

టాసింగ్ కు కావాల్సిన ఇంగ్రీడియన్స్:

జీల కర్ర, కరివేపాకు, కొత్తి మీర, పుదీనా, పచ్చి మిర్చి, బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, నూనె.

ఫ్రాన్స్ 65 తయారీ విధానం:

ముందుగా రొయ్యలను మ్యారినేట్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకోని అందులోకి శుభ్రంగా క్లీన్ చేసిన రొయ్యలను వేసుకోవాలి. ఆ తర్వాత టాసింగ్ కి సపరేట్ గా చెప్పిన పదార్థాలు తప్ప మిగతా అన్ని పదార్థాలను వేసి సున్నితంగా కలుపుకోవాలి. ఆ నెక్ట్ డీప్ ఫ్రై కోసం నూనె వేడి చేసుకోవాలి. నూడె వేడెక్కాక.. మ్యారినేట్ చేసుకున్న రొయ్యలను వేసి.. మంటను మీడియంలో పెట్టి.. ఎర్రగా వేయించుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు రొయ్యలకు టాసింగ్ చేయాలి. ఖాళీగా ఉన్న ఒక పాన్ తీసుకుని.. అందులో నూనె వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక.. బిర్యానీ ఆకు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కొత్తి మీర, పుదీనా కూడా వేసుకుని మరో నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు పక్కకు పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకుని బాగా టాసింగ్ చేసుకోవాలి. ఓ ఐదు నిమిషాల వరకు రొయ్యలను వేయించుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ 65 రెడీ. చాలా ఈజీగా అయిపోయింది కదా.. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి రెడీ చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.