Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg Side Effects: గుడ్డుతో కలిపి వీటిని అస్సలు తినకండి.. తిన్నారంటే ఇక అంతే..

గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచింది. శరీరానికి ఎంతో మేలు చేసే ఇలాంటి ఎన్నో పోషకాలు ఇందులో ఉన్నాయి. రోజూ గుడ్లు సరిగ్గా తీసుకుంటే.. దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, గుడ్లుతో కొన్ని పదార్థాలు తీసుకోవడం హానికరం. అయితే, ఒక పెద్ద గుడ్డులో దాదాపు 74 కేలరీలు ఉంటాయి. 3 ఉడికించిన గుడ్లు, కూరగాయలు,అవోకాడో ముక్కలతో కూడిన భోజనం 500 కేలరీల కంటే తక్కువ కలిగి ఉంటుంది. అయితే గుడ్లుతో కొన్ని పదార్థాలు తినకూడదని మీకు తెలుసా? ప్రయోజనానికి బదులుగా ఆరోగ్యానికి హాని ఉండవచ్చు. కోడిగుడ్లతో ఏయే పదార్థాలు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం..

Egg Side Effects: గుడ్డుతో కలిపి వీటిని అస్సలు తినకండి.. తిన్నారంటే ఇక అంతే..
Eggs
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 28, 2023 | 6:46 PM

గుడ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుడ్లలో ప్రోటీన్, కాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. రోజూ గుడ్లు సరిగ్గా తీసుకుంటే.. దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే గుడ్లుతో కొన్ని పదార్థాలు తినకూడదని మీకు తెలుసా? ప్రయోజనానికి బదులుగా ఆరోగ్యానికి హాని ఉండవచ్చు. కోడిగుడ్లతో ఏయే పదార్థాలు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం..

సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన వ్యక్తిగా మారవచ్చు. అయితే, ఏదైనా ఆహార కలయిక తప్పుగా ఉంటే.. అది మీ శరీరానికి హాని కలిగించవచ్చు. మనం ఏం తింటున్నామో తెలియక మన బిజీ జీవితం గడిచిపోతోంది. ఒక గుడ్డులో దాదాపు 74 కేలరీలు ఉంటాయి. 3 ఉడికించిన గుడ్లు, కూరగాయలు, అవోకాడో ముక్కలతో కూడిన భోజనం 500 కేలరీల కంటే తక్కువ కలిగి ఉంటుంది.

కెఫీన్ ఉన్న ఆహారాలతో గుడ్డును తింటున్నారా..

మీరు గుడ్లు తిన్నప్పుడల్లా.. దానితో పాటు టీ లేదా కాఫీ వంటి కెఫిన్ ఉన్న వాటిని తీసుకోకండి. లేకపోతే జీర్ణక్రియ దెబ్బతింటుంది. అంతే కాదు, కెఫీన్ ఉన్న ఆహారాలు లేదా పానీయాలు గుడ్డులోని పోషకాలను గ్రహించగలవు. దీని కారణంగా దాని సామర్థ్యం తగ్గిపోవచ్చు. ఇది కడుపు నొప్పికి కారణమవుతుంది. శరీరంలోని పోషక మూలకాల లోపాన్ని కూడా కలిగిస్తుంది.

గుడ్డు, అరటి..

గుడ్డు, అరటిపండు రెండూ పోషకాల నిధి. ఈ రెండింటినీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి గొప్ప ప్రయోజనాలను పొందవచ్చు. గుడ్డు, అరటిపండు ఎప్పుడూ కలిపి తినకూడదని చాలా తక్కువ మందికి తెలుసు. ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. ఒకటి నుంచి రెండు గంటల వ్యవధిలో గుడ్లు లేదా అరటిపండ్లు తినడం మంచిది.

గుడ్డు, స్వీట్లు

గుడ్డుతో స్వీట్లు ఎవరూ తినరు.. అయితే గుడ్లతో చక్కెర అధికంగా ఉండే పదార్థాలు తింటే కడుపుకు హాని కలుగుతుందని గుర్తుంచుకోండి. రెండింటి మధ్య కనీసం ఒక గంట గ్యాప్ ఉండాలా చూసుకోండి.

గుడ్డు, సోయా ఉత్పత్తులు..

గుడ్లు కాకుండా, సోయాబీన్, సోయా ఉత్పత్తులలో అధిక ప్రోటీన్ ఉంటుంది. కానీ రెండింటినీ కలిపి తినకూడదని సూచించబడింది. గుడ్లు, సోయా ఉత్పత్తులను కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ప్రోటీన్ చేరుతుంది. అనేక సమస్యలను కలిగిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి