- Telugu News Photo Gallery Health Tips: You Must Know Signs of Vitamin K Deficiency And Health Problems
Lifestyle Problems: గాయాలైనప్పుడు రక్తం గడ్డ కట్టడం లేదా? జాగ్రత్త.. ఇది కారణం కావచ్చు
ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్లు, మినరల్స్, పోషకాలు అవసరం. ముఖ్యంగా విటమిన్ ఎ, బి, సి, డిలతోపాటు విటమిన్ కె కూడా మన శరీరానికి చాలా అవసరం. విటమిన్ K ప్రధానంగా రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది. అలాగే కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడేవారు త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. అలాగే విటమిన్ K2 బలమైన ఎముకలను నిర్మించడంలోనూ సహాయపడుతుంది. విటమిన్ K శరీరంలో ఊపిరితిత్తుల పనితీరుతో..
Updated on: Sep 28, 2023 | 12:17 PM

ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్లు, మినరల్స్, పోషకాలు అవసరం. ముఖ్యంగా విటమిన్ ఎ, బి, సి, డిలతోపాటు విటమిన్ కె కూడా మన శరీరానికి చాలా అవసరం. విటమిన్ K ప్రధానంగా రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది. అలాగే కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడేవారు త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.

అలాగే విటమిన్ K2 బలమైన ఎముకలను నిర్మించడంలోనూ సహాయపడుతుంది. విటమిన్ K శరీరంలో ఊపిరితిత్తుల పనితీరుతో సంబంధం కలిగి ఉంటుంది. అందువల్లనే విటమిన్ కె లోపం ఏర్పడినప్పుడు ముకల ఆరోగ్యంతో పాటు ఆస్తమా, సీఓపీడీ వంటి మొదలైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

విటమిన్ కె ఎముక ఆరోగ్యానికి, కాలేయ వ్యాధుల నివారణ, రక్తం గడ్డకట్టడానికి మాత్రమే కాకుండా.. ఎముకల పనితీరును కూడా క్రమబద్ధీకరిస్తాయి. కాబట్టి మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్ కె లోపం ఉన్నట్లు అర్ధం.

విటమిన్ K లోపం ఉన్న వారి ఎముకలు చిన్న గాయానికే విపరీతంగా దెబ్బతింటాయి. ఒక్కోసారి ఎముకలు విరిగిపోతాయి కూడా. సాధారణంగా విటమిన్ కె లోపం బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది.

చర్మంపై నీలిరంగు మచ్చలు కనిపించినట్లయితే మీ శరీరంలో విటమిన్ K లోపం ఉందని గ్రహించాలి. గుండె వేగం కూడా అకస్మాత్తుగా పెరుగుతుంది. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. ఋతుస్రావం సమయంలో స్త్రీలకు పొత్తి కడుపు భాగంలో విపరీతమైన నొప్పి ఉంటే విటమిన్ K లోపం ఉన్నట్లు అర్ధం. అలాగే ఈ విటమిన్ లోపం వల్ల ముక్కులో రక్తస్రావం కూడా అవుతుంది.





























