AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wood Apple Benefits: ఈ సీజన్ లో వెలగ పండును తప్పకుండా తినాలి.. అస్సలు మిస్ చేయకండి!!

వెలగ పండు.. దీని గురించి అందరికీ తెలుసు. వినాయక చవితి వచ్చిందంటే ఈ పండ్లన్నీ ఒక్కసారిగా దర్శనమిస్తాయి. ఈ వెలగ పండు అంటే గణేషుడికి ఎంతో ఇష్టమట. అందుకే ఏ పండ్లు పెట్టినా.. పెట్టకపోయినా.. వెలగ పండును మాత్రం బొజ్జ గణపయ్యకు ఖచ్చితంగా సమర్పిస్తారు. అందులోనూ ఈ సీజన్ లో లభ్యమయ్యే వెలగ పండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ఈ పండులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, వెలగ పండును ఖచ్చితంగా తినాలని నిపుణులు కూడా..

Wood Apple Benefits: ఈ సీజన్ లో వెలగ పండును తప్పకుండా తినాలి.. అస్సలు మిస్ చేయకండి!!
Wood Apple
Chinni Enni
| Edited By: |

Updated on: Sep 28, 2023 | 7:10 PM

Share

వెలగ పండు.. దీని గురించి అందరికీ తెలుసు. వినాయక చవితి వచ్చిందంటే ఈ పండ్లన్నీ ఒక్కసారిగా దర్శనమిస్తాయి. ఈ వెలగ పండు అంటే గణేషుడికి ఎంతో ఇష్టమట. అందుకే ఏ పండ్లు పెట్టినా.. పెట్టకపోయినా.. వెలగ పండును మాత్రం బొజ్జ గణపయ్యకు ఖచ్చితంగా సమర్పిస్తారు. అందులోనూ ఈ సీజన్ లో లభ్యమయ్యే వెలగ పండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ఈ పండులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, వెలగ పండును ఖచ్చితంగా తినాలని నిపుణులు కూడా చెబుతున్నారు. వెలగ పండుతో ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చని అంటున్నారు. ఆయుర్వేదంలో కూడా వెలగ పండును.. పలు రోగాలను నయం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఇంకా వెలగ పండుతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

అల్సర్ నుంచి బయట పడొచ్చు:

వెలగ పండును తింటే అల్సర్ నుంచి బయట పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పండును నేరుగా తిన్నా.. లేక జ్యూస్ రూపం తీసుకున్నా మంచిదేనని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

రక్తాన్ని శుద్ధి చేస్తుంది:

రక్తాన్ని శుద్ధి చేసే గుణం వెలగ పండులో ఉందట. ఈ సీజన్ లో లభ్యమైనప్పుడు వెలగ పండును తీసుకుంటే రక్తాన్ని శుభ్ర పరుచుకోవచ్చు.

బలహీనత తగ్గుతుంది:

వెలగ పండులో రోగ నిరోధక శక్తి ఉంటుంది. వెలగ పండు జ్యూస్ లో బెల్లాన్ని కలుపుకుని తాగితే బలహీనత, నీరసం వంటివి ఏమైనా ఉంటే ఉపశమనం లభిస్తుంది.

మూత్ర పిండాల సమస్యలను తగ్గించుకోవచ్చు:

వెలగ పండుతో మూత్ర పిండాల ప్రాబ్లమ్స్ ను కూడా తగ్గించుకోవచ్చు. ఈ పండు తిన్నా, తాగినా మూత్ర పిండాలు ఆరోగ్యం ఉంచేందుకు హెల్ప్ చేస్తుందట.

క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది:

ముఖ్యంగా ప్రస్తుత కాలంలో చాలా మంది స్త్రీలు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. వెలగ పండు తినడం వల్ల క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చట.

షుగర్ ను కంట్రోల్ లో పెట్టొచ్చు:

వెలగ పండు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఈ పండు తినడం వల్ల షుగర్ ను అదుపులో పెట్టుకోవచ్చు.

ఇమ్యూనిటీని పెంచుతుంది:

వెలగ పండులో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పండు తిన్నా, జ్యూస్ రూపంలో తాగినా ఇమ్యూనిటీ లెవల్స్ అనేవి పెరుగుతాయి. వెలగ పండు తింటే 21 బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

Follow Us
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే