Health Tips: తినేటప్పుడు పైనుంచి ఉప్పు తినే అలవాటు ఉందా? మీరు ఈ వ్యాధులను ఆహ్వానిస్తున్నట్లే!
దీని బారిన పడిన చాలా మందికి తమకు హైపర్ టెన్షన్ ఉందని తెలియక, తెలిసినా చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డేటా ప్రకారం, 2019 లో భారతదేశంలో 30 - 79 సంవత్సరాల మధ్య వయస్సు గల 19 కోట్ల మంది ప్రజలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. కేవలం 7 కోట్ల మంది మాత్రమే దాని నుంచి..
అధిక రక్తపోటు హై బీపీకి కారణంగా చెబుతారు. ఇది ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణం. దీనికి నిర్దిష్ట లక్షణాలు లేవు కాబట్టి దీనిని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. దీని బారిన పడిన చాలా మందికి తమకు హైపర్ టెన్షన్ ఉందని తెలియక, తెలిసినా చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డేటా ప్రకారం, 2019 లో భారతదేశంలో 30 – 79 సంవత్సరాల మధ్య వయస్సు గల 19 కోట్ల మంది ప్రజలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. కేవలం 7 కోట్ల మంది మాత్రమే దాని నుంచి కోలుకోగలిగారు. మిగిలిన 12 కోట్ల మంది ప్రజలు అధిక రక్తపోటుతో జీవిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం.. రక్తపోటు అనేది ఒక వ్యక్తికి 140 mmHg లేదా అంతకంటే ఎక్కువ సిస్టోలిక్ రక్తపోటు, డయాస్టొలిక్ రక్తపోటు 90 mmHg లేదా అంతకంటే ఎక్కువ ఉన్న పరిస్థితి. హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 1990లో 65 కోట్ల మంది ఉండగా, 2019 నాటికి ఈ సంఖ్య 130 కోట్లకు పెరిగింది.
డబ్ల్యూహెచ్‌వో అధిక రక్తపోటుపై తన ఇటీవలి నివేదికలో ‘ఈ సాధారణమైన కానీ ప్రాణాంతకమైన పరిస్థితి నేడు పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. ఇది స్ట్రోక్, గుండెపోటు, గుండె వైఫల్యం, మూత్రపిండాల వైఫల్యం వంటి అనేక వ్యాధులకు దారి తీస్తుంది.’ పొగాకు వాడకం, మధుమేహం అధిక రక్తపోటుతో మరణించే ప్రమాదాన్ని మరింత పెంచుతుందని నివేదిక పేర్కొంది. అయినప్పటికీ 1990 నుంచి భారతదేశంలో, ప్రపంచంలో రక్తపోటు ప్రాబల్యం పెరుగుతోందని గమనించారు.
అయితే 2010, 2019 మధ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఉప్పును ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిదంటున్నారు నిపుణులు. అయితే చాలా మంది అధిక రక్తపోటు కారణంగా మరణాల వరకు వెళ్తున్నారు. అందుకే గుండె విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏవైనా గుండెకు సంబంధించిన లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే వైద్యున్ని సంప్రదించడం ఉత్తమం.
ఇప్పుడున్న కాలంలో రకరకాల వ్యాధులు వెంటాడుతున్నాయి. మారుతున్న జీవనశైలి, ఇతర అలవాట్ల కారణంగా చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. అధిక రక్తపోటు కారణంగా సంభవించే సమస్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్‌లో ప్రతి ఒక్కరి జీవన శైలిలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. మంచి పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది. ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ద తీసుకుని జీవన శైలిలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు వైద్య నిపుణులు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)