Heart disease: గుండె జబ్బు ప్రమాదం నుంచి బయటపడాలనుకుంటున్నారా..? రోజూ.. ఇన్ని మెట్లు ఎక్కితే చాలు..!

రోజుకు 10,000 అడుగులు నడవడం మర్చిపోండి. తాజా అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ కనీసం 50 మెట్లు ఎక్కడం మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని బాగా తగ్గించగలవు. ఈ అధ్యయనం అథెరోసెలోరిసిస్ జ‌ర్న‌ల్లో ప్ర‌చురించారు. ప్రతిరోజూ 50 కంటే ఎక్కువ మెట్లు ఎక్కడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని 20% తగ్గించవచ్చని కనుగొన్నారు.

Heart disease: గుండె జబ్బు ప్రమాదం నుంచి బయటపడాలనుకుంటున్నారా..? రోజూ.. ఇన్ని మెట్లు ఎక్కితే చాలు..!
Walking five flights of stairs
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 30, 2023 | 7:48 PM

ఆధునిక జీవనశైలితో పాటు, గుండె సంబంధిత వ్యాధుల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గత కొన్ని నెలలుగా గుండెపోటు వీడియోలు ప్రజలను భయపెడుతున్నాయి. గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గాలంటే రోజూ దాదాపు 50 మెట్లు ఎక్కక తప్పదని తాజా పరిశోధనలో వెల్లడైంది. ప్రతిరోజూ కనీసం 50 మెట్లు ఎక్కడం గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుందని అమెరికాలోని లూసియానాలో ఉన్న తులాన్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం అథెరోసెలోరిసిస్ జ‌ర్న‌ల్లో ప్ర‌చురించారు. అధ్యయనంపై తులేన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ డాక్టర్ లు క్వి ఇలా అన్నారు..’హై-ఇంటెన్సిటీ మెట్లు ఎక్కడం అనేది కార్డియోస్పిరేటరీ ఫిట్‌నెస్, లిపిడ్ ప్రొఫైల్‌లను మెరుగుపరచడానికి సమర్థవంతమైన మార్గంగా సూచించారు. ముఖ్యంగా ఎక్కువ వ్యాయామం చేయలేని వ్యక్తులకు ఇది చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు.

UK బయోబ్యాంక్ సుమారు 450,000 పెద్దల నుండి సేకరించిన డేటా ఈ పరిశోధన కోసం ఉపయోగించబడింది. ఈ అధ్యయనం కుటుంబ చరిత్ర, ప్రజల్లో కలిగిన ప్రమాదం, జన్యుపరమైన ప్రమాద కారకాల ఆధారంగా పాల్గొనేవారి గుండె జబ్బులకు గురికావడాన్ని లెక్కించింది. పాల్గొనేవారి జీవనశైలి అలవాట్లు, మెట్లు ఎక్కడం ఫ్రీక్వెన్సీ గురించి సర్వే చేసింది. ప్రతిరోజూ ఎక్కువ మెట్లు ఎక్కడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఫలితాలు కనుగొన్నాయి.

అథెరోసెలోరిసిస్ జ‌ర్న‌ల్లో ప్ర‌చురిత‌మైన ఈ ప‌రిశోధ‌నా ప్ర‌కారం.. రోజుకు క‌నీసం 50 మెట్లుఎక్కితే గ‌నుక గుండెపోటు, గుండె ద‌డ‌, హార్ట్ స్ట్రోక్ వ‌చ్చే అవ‌కాశాలు 20 శాతం మేర త‌గ్గే అవ‌కాశ‌ముందని స్పష్టం చేశారు. గుండె సామ‌ర్థ్యాన్ని, బ‌లాన్ని పెంచుకోవ‌డానికి చ‌వకైన‌, సుర‌క్షిత‌మైన మార్గం మెట్లు ఎక్క‌డ‌మేన‌ని ప‌రిశోధ‌కులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

స‌మాంతర ప్ర‌దేశంపై న‌డ‌వ‌డం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ మేలు కలుగుతుందని వ్యాయామ నిపుణులు గతంలో చెప్పారు. మెట్లు ఎక్కేట‌ప్పుడు మ‌న‌లో చాలా కండ‌రాలు ప‌ని చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా శ‌రీరం బ్యాలెన్స్ అవుతూ న‌డ‌వాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల మెద‌డు, నాడీ వ్య‌వస్థల మ‌ధ్య స‌మ‌న్వ‌యం మెరుగుప‌డుతుందని పలువురు నిపుణులు చెప్పారు.

అంతేకాదు.. మెట్లు ఎక్కటం వల్ల కలిగే లాభాలపై గతంలో కూడా అనేక పరిశోధనలు జరిగాయి. మెట్లు ఎక్కడం వల్ల పలు రకాల క్యాన్సర్ల బారి నుంచి కూడా బయట పడవచ్చునని గతంలోనే పలు అధ్యయనాలు వెల్లడించాయి. మెట్లు ఎక్కడం వల్ల కండరాలు గట్టి పడతాయి. ఫిట్ గా ఉండే వారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం దాదాపు సగానికి పైగా తగ్గుతుందని గతంలోనే నిర్ధారణ అయింది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..