Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆడి కారులో వచ్చి ఆకుకూరలు అమ్ముతున్న ఆదర్శ రైతు.. వైరలవుతున్న వీడియో చూస్తే అవాక్కే..!

ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 8 మిలియన్ల వీక్షణలు వచ్చాయి. ఆడి కారును మెయింటెన్‌ చేసే సంపన్నుడు సుజిత్‌ అని చెప్పకుండానే అర్థమవుతుంది. కానీ, అతడు ఏ మాత్రం సిగ్గు, మోహమాటం లేకుండా.. నిబద్ధత, ఎంతో ఉత్సాహంగా తన పనిని తాను చేసుకుంటున్నాడు. అందుకే నెటిజన్లచే ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇది అతని అద్భుతమైన విజయానికి దోహదపడుతుందంటున్నారు చాలా మంది నెటిజన్లు పొగడ్తలు కురిపిస్తున్నారు.

ఆడి కారులో వచ్చి ఆకుకూరలు అమ్ముతున్న ఆదర్శ రైతు..  వైరలవుతున్న వీడియో చూస్తే అవాక్కే..!
Kerala Farmer
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 30, 2023 | 5:32 PM

కేరళకు చెందిన ఓ రైతు ఇటీవల ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాడు.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ‘వెరైటీ ఫార్మర్’ పేరుతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన సుజిత్ ఎస్పీ తన అసాధారణ వ్యవసాయ విధానంతో సోషల్ మీడియాలో బాగా ఫేమస్‌గా మారాడు. అతను తన వినూత్న వ్యవసాయ పద్ధతులు, విభిన్న పంటల సాగు, తన వ్యవసాయ ప్రయత్నాలలో సాంకేతికతను జోడించడం ద్వారా ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈసారి వ్యవసాయంలో కాదు.. మరో అడుగు ముందుకు వేసి…దాదాపు రూ.44 లక్షల విలువైన ఆడి ఏ4 కారులో వెళ్లి ఆకుకూరలను విక్రయిస్తూ.. అందరికీ విస్తు పోయేలా చేస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియా అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ఇప్పుడు ధనిక రైతు సుజిత్‌ వీడియో వైరల్‌ అవుతుంది.

వైరల్‌గా మారిన ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో ఓపెనింగ్‌లో అతడు తోటలోని తాజా ఎర్ర తోట కూరను కోస్తుండటంతో మొదలవుతుంది. కావాల్సినంత వరకు కోసిన ఆకు కూరను అతడు ఆడి ఏ4 లగ్జరీ కారులో వేసుకుని అక్కడ్నుంచి బయల్దేరాడు. రోడ్‌సైడ్ మార్కెట్‌లో ఆకుకూరలు అమ్మడానికి వెళ్లాడు. మార్కెట్‌కు చేరుకున్న తర్వాత, అతను నేలపై చాప వేసి, తన ఎర్రటి బచ్చలి కూరను కొనుగోలుదారులకు గర్వంగా చూపించాడు.. అలాగే ఈ వీడియోకు క్యాప్షన్‌లో ‘నేను ఆడిలో వెళ్లి ఆకు కూరలు అమ్మినప్పుడు’ అనే వీడియోతో పాటు క్యాచీ టైటిల్‌ను జోడించాడు. ఇక దీంతో ఈ వీడియో వేగంగా వైరల్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 8 మిలియన్ల వీక్షణలు వచ్చాయి. ఆడి కారును మెయింటెన్‌ చేసే సంపన్నుడు సుజిత్‌ అని చెప్పకుండానే అర్థమవుతుంది. కానీ, అతడు ఏ మాత్రం సిగ్గు, మోహమాటం లేకుండా.. నిబద్ధత, ఎంతో ఉత్సాహంగా తన పనిని తాను చేసుకుంటున్నాడు. అందుకే నెటిజన్లచే ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇది అతని అద్భుతమైన విజయానికి దోహదపడుతుందంటున్నారు చాలా మంది నెటిజన్లు.

ఇవి కూడా చదవండి

సుజిత్ ప్రయాణం పరివర్తన బాటలో సాగుతోంది. గతంలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసిన అతను పరిమిత జ్ఞానంతో భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. క్రమంగా వివిధ వ్యవసాయ పద్ధతుల్లో ప్రావీణ్యం సంపాదించాడు. అద్భుతమైన విజయాన్ని సాధించాడు. ముఖ్యంగా, అతని లగ్జరీ కారు, ఆడి A4, సెకండ్ హ్యాండ్‌దిగా తెలిసింది.

‘వెరైటీ ఫార్మర్’ సుజిత్ ఎస్పీ సంప్రదాయాన్ని అభిరుచి, కృషిని అపరిమితమైన అవకాశాలకు నిదర్శనం. అతని ప్రయాణం అతని సొంత రాష్ట్రమైన కేరళలో మాత్రమే కాదు.. యావత్‌ దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు స్ఫూర్తినిస్తుంది. అతని కథ అందరికీ ఆదర్శంగా మారి ఆకట్టుకుంటుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..