తహశీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. ట్రంకు పెట్టెలో దాచిన కట్టల కొద్ది కరెన్సీ నోట్లు, బంగారం.. ఇంకా..
దీంతోపాటు కట్టల కొద్ది నోట్లను ఏసిబి స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది.. నగదు తో పాటు భారీగా బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.. మహేందర్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారుల ఆరోపణలు నిజమయ్యేలా భారీగా ఆస్తులు బయటపడ్డాయి... మొత్తం 15 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఒక రోజంతా సోదాలు కొనసాగే అవకాశం ఉందని సమాచారం.
చాలాకాలం తర్వాత తెలంగాణలో ఆదాయానికి మించిన ఆస్తుల అనుబంధం సోదాలు చేస్తుంది ఏసీబీ. ఇటీవల కాలంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్న కేసులు తప్ప అవినీతి ఆరోపణల మీద ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు శాతం ఏసీబీలో చాలా తక్కువ అయింది. అయితే చాలాకాలం తర్వాత ఒక తహసిల్దార్ ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.. కందుకూర్ తహసిల్దార్ మహేందర్ రెడ్డి పై అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టుకున్నారని ఫిర్యాదులు రావటంతో అతనిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టి సారించారు.
కందుకూర్ తాసిల్దారుగా మహేందర్ రెడ్డి ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అవినీతి నిరోధక శాఖ అధికారులకు మహేందర్ రెడ్డి పై పలు ఫిర్యాదులు వచ్చాయి. మహేందర్ రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులతో ఏసిబి అధికారులు రగంలోకి దిగారు.. మొత్తం 15 చోట్ల సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. మహేందర్ రెడ్డి నివాసంతో పాటు అతడి బంధువులు సన్నిహితుల ఇళ్లలోనూ ఏసిబి అధికారులు సోదాలు జరిపారు. హస్తినాపురంలో ఉన్న మహేందర్ రెడ్డి ఇంటితోపాటు మర్రిగూడ లో ఉన్న తాహాసిల్దార్ కార్యాలయంలోనూ ఏసీబీ సోదాలు చేపట్టింది.
తహాసిల్దార్ ఇంట్లో కట్టల కొద్ది నోట్లు
తనిఖీల సందర్భంగా హస్తినాపురంలో ఉన్న మహేందర్ రెడ్డి ఇంటికి ఉదయం 8 గంటల ప్రాంతంలో ఏసీబీ అధికారులు చేరుకున్నారు. ఇంట్లో ఉన్న మహేందర్ రెడ్డిని అధికారులు విచారించారు.. హస్తినాపురంలో ఉన్న ఇంట్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఒక ట్రంక్ పెట్టెలో రెండు కోట్లకు పైగా లభ్యమైనట్టు మీడియాకు సమాచారం ఇచ్చారు ఏసీబీ అధికారులు.. దీంతోపాటు కట్టల కొద్ది నోట్లను ఏసిబి స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది.. నగదు తో పాటు భారీగా బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.. మహేందర్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారుల ఆరోపణలు నిజమయ్యేలా భారీగా ఆస్తులు బయటపడ్డాయి… మొత్తం 15 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు..ఈ రోజు అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉందని సమాచారం.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..