AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్లీజ్ మా బిడ్డ మృతదేహాన్ని ఇప్పించండి.. తెలంగాణ ప్రభుత్వానికి తల్లిదండ్రుల వేడుకోలు..

Hyderabad, September 30: ఓ పూట అన్నం తిని.. తినక.. పిల్లలకు మంచి చదువులు అందించి గొప్పవారిని చేయాలని తలంచారు ఆ తల్లిదండ్రులు. అనుకున్న ప్రకారమే తమ కొడుకుని ఉన్నంతో గొప్ప చదువులు చదివించారు. తల్లిదండ్రుల సహకారంతో ఆ కొడుకు విదేశాలకు పయనమయ్యాడు. చదువుల కోసం అక్కడికి వెళ్లిన ఆ యువకుడు ఇంతకాలం సంతోషంగానే ఉన్నాడు. కానీ, విధిరాత అతన్ని బలితీసుకుంది.

Telangana: ప్లీజ్ మా బిడ్డ మృతదేహాన్ని ఇప్పించండి.. తెలంగాణ ప్రభుత్వానికి తల్లిదండ్రుల వేడుకోలు..
Hyderabad Man Dies In Chicago
Shiva Prajapati
|

Updated on: Sep 30, 2023 | 2:44 PM

Share

Hyderabad, September 30: ఓ పూట అన్నం తిని.. తినక.. పిల్లలకు మంచి చదువులు అందించి గొప్పవారిని చేయాలని తలంచారు ఆ తల్లిదండ్రులు. అనుకున్న ప్రకారమే తమ కొడుకుని ఉన్నంతో గొప్ప చదువులు చదివించారు. తల్లిదండ్రుల సహకారంతో ఆ కొడుకు విదేశాలకు పయనమయ్యాడు. చదువుల కోసం అక్కడికి వెళ్లిన ఆ యువకుడు ఇంతకాలం సంతోషంగానే ఉన్నాడు. కానీ, విధిరాత అతన్ని బలితీసుకుంది. గుండెపోటుతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి వరకు ఆ తల్లిదండ్రులు తమ కొడుకు గురించి కన్న కలలన్నీ కల్లలైపోయాయి. ఓవైపు కన్నకొడుకు ప్రాణాలు కోల్పోయి శోఖసంద్రంలో మునిగిపోగా.. మరోవైపు అతని మృతదేహాన్ని స్వదేహానికి తీసుకువచ్చే స్థోమత లేక కుమిలిపోతున్నారు. ఉన్న డబ్బునంతా కొడుకు చదువు కోసం ఖర్చు చేశారు. చిన్నా చితకా బిజినెస్ నడుపుతూ జీవనం సాగిస్తున్న ఈ తరుణంలో కొడుకు మరణ వార్త ఆ కుటుంబాన్ని కుదిపేసింది. అయితే, చనిపోయిన కొడుకు మృతదేహాన్ని సొంత ఖర్చులతో తీసుకువచ్చే స్థోమతలేని ఆ తల్లిదండ్రులు తెలంగాణ ప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రికి, తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా వేడుకున్నారు. తమ కొడుకు మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు సహకరించాలని, కడసారి చూపు చూసుకునే అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, తెలంగాణ సీఎంఓ, మంత్రి కేటీఆర్‌ లను ట్యాగ్ చేస్తూ విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌లోని మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన కంగుల బాల రేవంత్ కుమార్(22), పై చదువుల కోసం చికాగోకు వెళ్లాడు. అక్కడి రూజ్‌వెల్ట్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్నాడు. అయితే, 28, సెప్టెంబర్ 2023న అంటే గురువారం ఉదయం తెల్లవారుజామున 2 గంటలకు తాను ఉంటున్న గదిలోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలిసి అతని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అయితే, రేవంత్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు చాలా ఖర్చు అవుతుంది. అంత మొత్తం పెట్టే స్థితిలో వారు లేరు. దాంతో తమ కొడుకు కడసారి చూసుకునే అవకాశం కల్పించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి రేవంత్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకువస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..