Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harish Rao: చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన మంత్రి హరీష్ రావు

సిద్ధిపేటలో పర్యటన సందర్భంగా మంత్రి హరీష్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఏపీకి సీఎంగా పనిచేసిన చంద్రబాబును ఈ వయసులో అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదన్నారాయన. చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు. తెలంగాణలో ప్రస్తుతం భూముల రేట్లు గణనీయంగా పెరిగినట్లు చంద్రబాబు చెప్పిన విషయాన్ని హరీశ్ రావు గుర్తు చేశారు.

Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 30, 2023 | 3:17 PM

సిద్దిపేట్ జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్ ఫామ్ కర్మగారానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “తెలంగాణ రాకపోతే ఈరోజు సిద్దిపేట జిల్లాకి ఆయిల్ ఫామ్ కర్మాగారం వచ్చేదా. ఈ ప్రాంత రైతులకు నేడు శుభదినం. 300 కోట్ల రూపాయలతో ప్రారంభించబోతున్న ఈ కర్మాగారం ఇక్కడి ప్రాంత రైతుల ఆర్థిక పరిస్థితిని మార్చబోతుంది.  హరిత విప్లవ సృష్టికర్త డాక్టర్ స్వామినాథన్ గారి అంత్యక్రియలకి ఈరోజు చెన్నైలో హాజరైనందుకు రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి గారు రాలేకపోయారు. ఆయిల్ పామ్ సాగు కోసం ప్రభుత్వం రైతులను మరింత చైతన్యపరిచే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఆయిల్ ఫామ్ సాగుకు సంబంధించి ఆయిల్ ఫెడ్ వారి ఆధ్వర్యంలో సాగుకు సంబంధించి ఒక డైరీ ప్రతి రైతుకు అందిస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు సంబంధించి రైతులతో శిక్షణ కార్యక్రమాలు రైతుల తోటలోనే నిర్వహించాలి. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం కష్టపడి కాలేశ్వరం కట్టుకున్నాం. 24 గంటల కరెంటు తెచ్చుకున్నాం. కానీ సాంప్రదాయ పంటల వల్ల రైతులు నష్టపోతున్నారు. ఆయిల్ పామ్ సాగుబడి ప్రభుత్వ ఉద్యోగం లాగా నెలనెలా ఆదాయం ఉంటుంది. రైతుకు లాభసాటిగా సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆలోచన చేశారు” అని హరీశ్ రావు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు.. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ గురించి స్పందించారు. చంద్రబాబును ఈ వయసులో అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు. ఇది మంచి విషయం కాదన్నారు.  ఉమ్మడి పరిపాలనలో వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతంలోనే ప్రస్తుతం అత్యధిక భూమి రేట్లు ఉన్నాయని చంద్రబాబు నాయుడు అన్న విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ఆదాయం పెంచి.. రైతుల భూమి విలువ కూడా పెరిగేలా చేశారని హరీశ్ రావు పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..