Nara Lokesh: ఢిల్లీలో నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ నోటీసులు
అమరావతి నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని భావించామని టీడీపీ చెప్తుంటే.. అందులో పెద్ద మతలబు ఉందంటోంది సీఐడీ. రోడ్డు అలైన్‌మెంట్‌లో ఇష్టానుసారంగా మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారని ప్రధాన ఆరోపణ. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రులు లోకేశ్, నారాయణ కలసి ఈ స్కామ్‌లో అసైన్డ్ భూములను కొల్లగొట్టారని సీఐడీ అభియోగాలు మోపింది.
ఢిల్లీలో నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. లోకేశ్ ప్రస్తుతం ఢిల్లీలోని అశోకారోడ్‌లో ఉన్న గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ నివాసంలో ఉన్నారు. అక్కడికి వెళ్లి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు.. అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ14గా లోకేష్‌ను ఇటీవల సీఐడీ చేర్చిన విషయం తెలిసిందే. తాజాగా 41A కింద విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Published on: Sep 30, 2023 05:26 PM
వైరల్ వీడియోలు