PM Modi: నా ఛానల్‌ లైక్‌ చేయండి..షేర్‌ చేయండి.. సబ్‌స్క్రైబ్‌ చేయండి.. బెల్‌ నొక్కండి.:మోడీ.

PM Modi: నా ఛానల్‌ లైక్‌ చేయండి..షేర్‌ చేయండి.. సబ్‌స్క్రైబ్‌ చేయండి.. బెల్‌ నొక్కండి.:మోడీ.

Anil kumar poka

|

Updated on: Oct 01, 2023 | 7:54 AM

యూట్యూబ్‌ ఫ్యాన్‌ఫెస్ట్‌ ఇండియా 2023 కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కంటెంట్‌ క్రియేటర్లను ఉద్దేశించి బుధవారం ప్రసంగించారు. సమాచార సృష్టిలో తాను కూడా వారిలో ఒకరినని భావించడం తనకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. వారి కంటెంట్ దేశ ప్రజలను ఎలా ప్రభావితం చేస్తుందో తాను గమనిస్తున్నానని అన్నారు. గత 15 ఏళ్ల నుంచి యూట్యూబ్‌ ద్వారా దేశానికి, ప్రపంచానికి తాను అనుసంధానమైనట్లు ప్రధాని చెప్పారు.

యూట్యూబ్‌ ఫ్యాన్‌ఫెస్ట్‌ ఇండియా 2023 కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కంటెంట్‌ క్రియేటర్లను ఉద్దేశించి బుధవారం ప్రసంగించారు. సమాచార సృష్టిలో తాను కూడా వారిలో ఒకరినని భావించడం తనకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. వారి కంటెంట్ దేశ ప్రజలను ఎలా ప్రభావితం చేస్తుందో తాను గమనిస్తున్నానని అన్నారు. గత 15 ఏళ్ల నుంచి యూట్యూబ్‌ ద్వారా దేశానికి, ప్రపంచానికి తాను అనుసంధానమైనట్లు ప్రధాని చెప్పారు. తనకు కూడా దాదాపు 17.9 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నట్లు మోదీ తెలిపారు. మనమంతా కలిసి దేశ వ్యాప్తంగా ప్రజల జీవితాల్లో పలు మార్పులు తీసుకురావచ్చన్నారు. తన ఛానల్‌లో వేల కొద్ది వీడియోలు ఉన్నాయని తెలిపారు. పరీక్ష సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి, ఉత్పాదకత పెంపు, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ వంటి విషయాలపై యూట్యూబ్‌ ద్వారా విద్యార్థులతో సంభాషించడం తనకు సంతృప్తినిస్తాయని అన్నారు. ఐదు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో ప్రధాని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. స్వచ్ఛ్‌ భారత్‌, డిజిటల్‌ పేమెంట్స్‌, ‘ఓకల్‌ ఫర్‌ లోకల్‌’ వంటి విషయాలపై మాట్లాడారు. ఇలాంటి ప్రచారాల్లో మరింత మందిని భాగం చేసేలా స్ఫూర్తి తీసుకురావాలని తోటి యూట్యూబర్లను మోదీ కోరారు. మన దేశ శ్రామికులు, చేతి వృత్తులు, హస్త కళలు, చేనేత కళాకారుల చేతుల్లో తయారైన.. వస్తువుల్ని కొనేలా జాతిని మేల్కొల్పాలన్నారు. ఇక యూట్యూబర్లు ప్రతి వీడియో చివరిలో ప్రజలు ఆలోచించేలా ప్రశ్నలను లేవనెత్తాలని, తద్వారా ప్రజల భాగస్వామ్యం మెరుగుపడుతుందన్నారు. ఇక వీడియో చివరిలో మరిన్ని అప్‌డేట్ల కోసం నా ఛానెల్‌ సబ్‌స్క్రైబ్‌ చేయడండి.. బెల్‌ ఐకాన్‌ నొక్కండి అంటూ నెటిజన్లను ప్రధాని కోరారు. ఒక సాధారణ యూట్యూబర్ లా మోడీ అలా కోరడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Oct 01, 2023 07:40 AM