Hyderabad: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి.. భక్తుల మీద పడిపోయిన గణనాధుని విగ్రహం..

Hyderabad: హైదరాబాదులో గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే నిమజ్జనం ముగిసిన తరువాత రోజు ఆలస్యంగా ఓ ఘటన బయట పడింది. హైదరాబాద్ బన్సిలాల్ పేట్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా విగ్రహాల ఊరేగింపు కొనసాగుతున్న తరుణంలో ఒక్కసారిగా వినాయకుడి విగ్రహం భక్తుల మీదకు పడిపోయింది. విగ్రహాన్ని పట్టుకునే ప్రయత్నం చేసిన ఫలితం లేదు. విగ్రహం కింద పడి నలుగురికి గాయాలు అయ్యాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డు అయ్యాయి.

Follow us

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Sep 30, 2023 | 3:25 PM

హైదరాబాద్, సెప్టెంబర్ 30: హైదరాబాదులో గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. రెండు రోజుల పాటు సాగిన కోలహలం మధ్య గణేష్ నిమజ్జనం అద్యంతం అంగరంగ వైభవంగా సాగింది. గణేష్ నిమజ్జనం ముగిసిన తరువాత రోజు ఆలస్యంగా ఓ ఘటన బయట పడింది. హైదరాబాద్ బన్సిలాల్ పేట్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా విగ్రహాల ఊరేగింపు కొనసాగుతున్న తరుణంలో ఒక్కసారిగా వినాయకుడి విగ్రహం భక్తుల మీదకు పడిపోయింది. విగ్రహాన్ని పట్టుకునే ప్రయత్నం చేసిన ఫలితం లేదు. విగ్రహం కింద పడి నలుగురికి గాయాలు అయ్యాయి. నిమజ్జనం రోజు రాత్రి పది గంటల 30 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డు అయ్యాయి.

అసలేం జరిగిందంటే.. ట్యాంక్ బండ్లో నిమజ్జనం సందర్భంగా రాణిగంజ్ నుండి ట్యాంక్ బండ్‌కు విగ్రహాలు క్యూ కట్టాయి. అప్పటికే టస్కర్ నుండి గణేష్ విగ్రహాన్ని కిందికి దించారు. క్రేన్ సహాయంతో నిమజ్జనం చేయాల్సి ఉన్న తరుణంలో కాసేపు విగ్రహాన్ని అలా పక్కకు పెట్టారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఓ మహిళా భక్తురాలు గణేశుడికి దండం పెట్టుకోవడానికి విగ్రహం ముందుకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా విగ్రహం కింద పడిపోయింది. విగ్రహం పడిన సమయంలో దాదాపు పది మంది విగ్రహం కింద ఉండిపోయారు. అయితే ఒక్కసారిగా స్థానికులందరూ అలర్ట్ కావడంతో విగ్రహాన్ని సాధారణ స్థితికి తీసుకు రాగలరు. విగ్రహాన్ని పైకి లేపగానే కింద ఉన్న వారిని అందరిని సురక్షితంగా రక్షించారు స్థానికులు.

అయితే ఈ సారి హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో పలు చోట్ల ఇలాంటి అపశృతుల కారణంగా మొత్తం ఐదు మంది మరణించారు. టస్కర్ల కింద పడి ముగ్గురు మరణించగా.. నిమజ్జనం సందర్భంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరో ఇద్దరు మరణించారు. ఈ ఘటనలు మినహా మిగతా నిమజ్జనం అంతా ప్రశాంతంగా సాగింది. 40 వేల మంది పోలీసులతో అడుగడుగునా సిసి కెమెరాల నిఘాలో భాగ్యనగరంలో గణేష్ నిమర్జనం ప్రశాంతంగా ముగిసింది.

Latest Articles