Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chewing Gum: అరరరె.. పొరపాటున చూయింగ్ గమ్ మింగేశారా..? కడుపులోకి చేరితే జీర్ణం కావడానికి ఏడేళ్లు పడుతుందా..?

అయితే చూయింగ్ గమ్ కడుపులోకి చేరితే ప్రమాదకరమని సాధారణంగా చెబుతారు. చూయింగ్ గమ్ పొరపాటున కడుపులోకి చేరితే.. అది జీర్ణం కావడానికి ఏడేళ్ల వరకు సమయం పడుతుందని చెబుతుంటారు. అయితే ఇది వాస్తవమా లేక అపోహ..? మాత్రమేనా..? వాంతులు, కడుపునొప్పి, మలబద్ధకం, విరేచనాలు వంటివి అనారోగ్య సమస్యలు ఎదురైతే..

Chewing Gum: అరరరె.. పొరపాటున చూయింగ్ గమ్ మింగేశారా..? కడుపులోకి చేరితే జీర్ణం కావడానికి ఏడేళ్లు పడుతుందా..?
Chewing Gum
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 30, 2023 | 6:16 PM

మేకలు, ఆవులు నెమరెస్తున్నట్టుగా చాలా మంది ఎప్పుడూ నోట్లో చూయింగ్‌ గమ్‌ పెట్టుకుని నములుతూ ఉంటారు.. అయితే చూయింగ్ గమ్ కడుపులోకి చేరితే ప్రమాదకరమని సాధారణంగా చెబుతారు. చూయింగ్ గమ్ పొరపాటున కడుపులోకి చేరితే.. అది జీర్ణం కావడానికి ఏడేళ్ల వరకు సమయం పడుతుందని చెబుతుంటారు. అయితే ఇది వాస్తవమా లేక అపోహ..? మాత్రమేనా..? అంటే.. చూయింగ్ గమ్‌ని నమలడానికి ఉద్దేశించినప్పటికీ దాని వినియోగం చాలా మందికి హానికరం కాదని నిపుణులు అంటున్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో క్లినికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ ప్రొఫెసర్ సైమన్ ట్రావిస్ ఏడేళ్ల సంఖ్య ఒక పురాణమని చెప్పారు. చూయింగ్ గమ్ మింగిన తర్వాత అసలు ఏం జరుగుతుందో కూడా ఆయన స్పష్టం చేశారు.

చూయింగ్ గమ్ నములుతూ పొరపాటున మింగేస్తుండటం కొందరిలో సహజం. అయితే, ఇలా మింగేసిన చూయింగ్‌ గమ్‌తో దాదాపు ఎలాంటి హానీ ఉండదు.. కానీ, చాలా అరుదైన పరిస్థితుల్లో మాత్రమే చూయింగ్ గమ్ వల్ల ఇబ్బందులు వస్తాయి. సాధారణంగా అయితే చూయింగ్ గమ్ కడుపులోకి చేరితే మలమూత్రాలతోనే బయటకు వస్తుందని అంటున్నారు. కానీ చూయింగ్ గమ్ ఎక్కువగా కడుపులోకి చేరితే ప్రమాదమని హెచ్చరించాడు. రోజుకు మూడు లేదా అంతకంటే ఎక్కువ ముక్కలు మింగితే అది పేగులలో పేరుకుపోయే ప్రమాదం ఉందని అతను చెప్పాడు. అయితే, ఇది కేవలం ఒక అవకాశం మాత్రమేనని తన 30 సంవత్సరాలకు పైగా గ్యాస్ట్రో ప్రాక్టీస్‌లో చూయింగ్ గమ్‌తో కూడిన ప్రమాదానికి సంబంధించిన ఒక్క కేసును కూడా తాను చూడలేదని అతను పేర్కొన్నాడు. అలా రాకుండా మీరు మింగేసిన చూయింగ్‌ గమ్‌ కడుపు లోపలే ఉండిపోతే పేగులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. వాంతులు, కడుపునొప్పి, మలబద్ధకం, విరేచనాలు వంటివి అనారోగ్య సమస్యలు ఎదురైతే.. మీరు వెంటనే వైద్యులను సంప్రదించటం ఉత్తమం అన్నారు.

ఇండియానా యూనివర్సిటీ చీఫ్ హెల్త్ ఆఫీసర్, పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ డా. ఆరోన్ కారోల్ అంగీకరించారు. చూయింగ్ గమ్ వల్ల తీవ్రమైన శారీరక సమస్యలు లేకపోయినా, అలా చేయమని ప్రజలను ప్రోత్సహించడం లేదని డాక్టర్ ఆరోన్ చెప్పారు. ప్రమాదవశాత్తూ చూయింగ్‌ గమ్‌ మింగినట్లయితే..పెద్దగా భయపడాల్సిన అవసరం లేదన్నారు. చూయింగ్ గమ్ బయటికి రావడానికి కనీసం 12 నుంచి 48 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. అనుకోకుండా చూయింగ్‌ మింగేసినట్టయితే.. నీళ్లు ఎక్కువగా తాగాలని, పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల చూయింగ్ గమ్ బయటికి వచ్చేసే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. కానీ మీరు కడుపులో నొప్పి, ఇతర శారీరక అసౌకర్యాన్ని అనుభవిస్తే, తక్షణమే వైద్యులను సంప్రదించాలని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..