పవన్ వారాహి యాత్రకు టీడీపీ మద్ధతు.. నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు
నంద్యాల ఆర్కే ఫంక్షన్ హాలులో టిడిపి పొలిటికల్ యాక్షన్ కమిటీ భేటీ అయ్యింది. యాక్షన్ కమిటీ సమావేశంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జూమ్ ద్వారా పాల్గొన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేతలు అయ్యన్న పాత్రుడు, బాలకృష్ణతో పాటు కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన చోటు నుంచే తమకు జరిగిన అన్యాయాన్ని..
పవన్ కల్యాణ్ ఆదివారంనాటి నుంచి చేపట్టబోయే వారాహి యాత్రలో టీడీపీ శ్రేణులు పాల్గొనాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. నంద్యాల ఆర్కే ఫంక్షన్ హాలులో టిడిపి పొలిటికల్ యాక్షన్ కమిటీ భేటీ అయ్యింది. యాక్షన్ కమిటీ సమావేశంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జూమ్ ద్వారా పాల్గొన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేతలు అయ్యన్న పాత్రుడు, బాలకృష్ణతో పాటు కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన చోటు నుంచే తమకు జరిగిన అన్యాయాన్ని ప్రజలలోకి తీసుకెళ్లాలని యాక్షన్ కమిటీ భావిస్తోంది. దాంతో పాటు జనసేన లీడర్లు, కేడర్‌తో ఎలా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి అనేదానిపై చర్చించారు.
భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ తప్పు చేయనప్పుడు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదన్నారు. కేసులు, జైళ్లకు వైసీపీ నేతలే భయపడుతారని అన్నారు. ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని ఆరోపించారు. ఆయనపై స్కిల్ కేసును రాజకీయ కక్షతోనే పెట్టారని బాలకృష్ణ అన్నారు. చంద్రబాబును వైసీపీ నేతలు ఏమీ చేయలేరని అన్నారు. వైసీపీకి ఇవే చివరి ఎన్నికలుగా పేర్కొన్నారు. అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారంనాటి నుంచి చేపడుతున్న నాలుగో విడత ‘వారాహి’ యాత్రకు పూర్తిగా మద్దతు ప్రకటించారు.
మృతుల కుటుంబాలను చంద్రబాబు పరామర్శిస్తారు..
కాగా చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన 97 మంది కుటుంబాలను చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత స్వయంగా కలిసి పరామర్శిస్తారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చం నాయుడు నాయుడు తెలిపారు. టిడిపి – జనసేన ఆధ్వర్యంలో ఉమ్మడి కార్యాచరణ కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగే వారాహి యాత్రలో టిడిపి శ్రేణులు పాల్గొని గట్టి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. రెండవ తేదీ చంద్రబాబు అరెస్ట్ నిరసిస్తూ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేస్తామని వెల్లడించారు. ఇంటిలో లైట్లు ఆఫ్ చేసి బయటికి వచ్చి కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. కేసులు, అరెస్టులకు టిడిపి కార్యకర్తలు ఎవరు భయపడవద్దని.. ఈ పోరాటాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామన్నారు. పొలిటికల్ యాక్షన్ కమిటీలో తీసుకున్న నిర్ణయాల మేరకు కార్యక్రమాలు చేస్తామన్నారు. చంద్రబాబు అరెస్టు వెనుక ఎవరు ఉన్నారు ఎవరు మద్దతు ఇచ్చారు అనేది రానున్న రోజుల్లో తేలుస్తాయని వ్యాఖ్యానించారు.
వారాహి యాత్రలో టీడీపీ పాల్గొంటే వైసీపీకి నష్టం లేదు.. బొత్స
నంద్యాలలో టిడిపి – జనసేన పొలిటికల్ యాక్షన్ కమిటీ కొత్తేం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇంతకు ముందు నుండి ఇరు పార్టీలు కలిసే ఉన్నాయని.. ఇప్పుడు బయటపడ్డారని అన్నారు. ఇద్దరు కాదు ఐదుగురు కలిసినా వైసీపీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని వ్యాఖ్యానించారు. వారాహి బస్సు యాత్రలో టిడిపి పాల్గొంటే తమకు వచ్చిన నష్టమేమీ లేదన్నారు. ఇంతకు ముందు రెండు బస్సుల్లో ఇద్దరు తిరిగేవారు ఇప్పుడు ఒకే బస్సులో ఇద్దరూ తిరుగుతారంటూ ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో వైసిపి గెలుస్తుందని.. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తంచేశారు. జీపీఎస్ ప్రభుత్వ విధానమన్నారు. జీపీఎస్‌లో ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తెస్తే ఆలోచిస్తామన్నారు.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..