AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nominee: బ్యాంకులో ఖాతా తీస్తే నామినీ పేరు ఎందుకు చేర్చాలి..? పూర్తి వివరాలు

ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా తీసుకునే ముందు బ్యాంకు సిబ్బంది నామినీ పేరును చేర్చాలని అడుగుతారు. ఇప్పుడు నామినీ పేరును చేర్చడం తప్పనిసరి అయిపోయింది. నామినీ పేరు అనేది బ్యాంకు ఖాతాలతో పాటు వివిధ ప్రభుత్వ,..

Nominee: బ్యాంకులో ఖాతా తీస్తే నామినీ పేరు ఎందుకు చేర్చాలి..? పూర్తి వివరాలు
Nominee Neme
Subhash Goud
|

Updated on: May 26, 2023 | 5:30 AM

Share

ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా తీసుకునే ముందు బ్యాంకు సిబ్బంది నామినీ పేరును చేర్చాలని అడుగుతారు. ఇప్పుడు నామినీ పేరును చేర్చడం తప్పనిసరి అయిపోయింది. నామినీ పేరు అనేది బ్యాంకు ఖాతాలతో పాటు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పథకాల్లో ఎంతో అవసరం. ఎందుకంటే ఖాతాదారుడు ఏదైనా కారణం చేత మరణించినట్లయితే ఈ ప్రయోజనం నామినీకి చెందుతుంది. నామినీ పేరు లేకపోతే బ్యాంకులో ఉన్న మొత్తం వెనక్కి తీసుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.

వాస్తవానికి నామినీ.. చట్టబద్ధమైన వారసులు వేర్వేరు. పెట్టుబడులు వారసులందరికీ చేరేందుకు.. నామినీ ఒక వారధి మాత్రమే. అంటే.. పెట్టుబడిదారుడికి ఏదైనా జరిగినప్పుడు అతని తరఫున వారసులకు వాటిని బదిలీ చేసే వ్యక్తి అన్నమాట. అందుకే నామినీగా సొంత వారినే కాదు.. బయట వారినీ నియమించుకునే అవకాశం ఉంది.

  1. యజమాని మరణించిన సందర్భంలో.. పెట్టుబడుల విషయంలో అసలు యజమాని మరణించిన సందర్భంలో.. వాటిని అతని వారసులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా అందించేందుకు నామినీ తోడ్పడతారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మ్యూచువల్‌ ఫండ్లు, డీమ్యాట్‌ ఖాతా, చిన్న మొత్తాల పొదుపు, బ్యాంకు ఖాతాలు, జీవిత బీమా పాలసీలు.. ఇలా ప్రతి చోటా నామినీ పేరు తప్పనిసరి.
  2. నామినీ పేరు చేర్చకుంటే.. ఒకవేళ ఒక ఖాతాదారుడు నామినీ పేరు రాయలేదనుకుందాం.. ఆ ఖాతాదారుడికి ఏదైనా జరిగినప్పుడు బ్యాంకు సంబంధిత వ్యక్తి వారసుల కోసం చూస్తుంది. వారు వచ్చిన తర్వాత వారసత్వ ధ్రువీకరణను కోరుతుంది. లేదా వీలునామా అవసరమని చెప్పవచ్చు. ఇవన్నీ పూర్తయ్యేనాటికి ఎంతో సమయం పడుతుంది. ఆర్‌బీఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. బ్యాంకు ఖాతాల్లో ఎవరూ పట్టించుకోని సొమ్ము దాదాపు వేల కోట్లల్లో ఉంది. ఈ మొత్తం అంతా నామినీ వివరాలు సరిగా లేకపోవడమే కారణమని ఆర్బీఐ చెబుతోంది.
  3. ఇవి కూడా చదవండి
  4.  నామినీ పేరును మార్చుకోవచ్చు.. ఒక వ్యక్తి వీలునామా రాసినప్పుడు.. నామినీ.. ఆ మేరకు వారసులకు ఆస్తులను అందించాల్సి ఉంటుంది. అంతేకానీ, నామినీగా పేరు రాసినంత మాత్రాన మొత్తం అతనికి/ఆమెకే చెందదు. నామినీ పేరును ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు.
  5. నామినీలు ఎంత మంది ఉండవచ్చు.. బ్యాంకు ఖాతాలో ఒకరిని నామినీగా పేర్కొనవచ్చు. అలాగే ఉమ్మడి ఖాతా ఉంటే.. ఒకరి కంటే ఎక్కువ నామినీలు ఉండవచ్చు. జీవిత బీమా పాలసీల్లో ఎంతమంది నామినీలనైనా పేర్కొనవచ్చు. పాలసీ విలువలో ఎవరికి ఎంత శాతం చెందాలన్నది వివరించాలి. ఈపీఎఫ్‌లోనూ ఇలాంటి వెసులుబాటు ఉంటుంది. డీమ్యాట్‌ ఖాతాలోనూ ఒకరికంటే ఎక్కువ నామినీలుగా ఉండేందుకు అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!