Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతంటే..

Subhash Goud

Subhash Goud |

Updated on: May 26, 2023 | 5:29 AM

బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు ధర పెరిగితే.. మరో రోజు తగ్గుతుంటుంది. ఇండియా మహిళలకు పసిడికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు జోరుగా సాగుతూనే..

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతంటే..
Gold jewelry

Follow us on

బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు ధర పెరిగితే.. మరో రోజు తగ్గుతుంటుంది. ఇండియా మహిళలకు పసిడికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు జోరుగా సాగుతూనే ఉంటాయి. పెళ్లిళ్ల సీజన్‌, ఇతర శుభకార్యాల సందర్భాలలో అయితే బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. తాజాగా కూడా బంగారం ధర భారీగా తగ్గింది. తులం బంగారంపై రూ.490 వరకు తగ్గుముఖం పట్టింది. వెండి కూడా అదే బాటలో నడుస్తోంది. ఈ ధరలు రోజులో తగ్గవచ్చు. పెరగవచ్చు. లేదా స్థిరంగా ఉండవచ్చు. తాజాగా మే 26న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,250 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,360 వద్ద నమోదైంది.

➦ ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.55,800 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.60,870 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

➦ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.55,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,020 ఉంది.

➦ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870 ఉంది.

➦ బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.55,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,920 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

➦ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870 వద్ద కొనసాగుతోంది.

➦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,870 వద్ద కొనసాగుతోంది.

➦ విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870 ఉంది.

వెండి ధర:

ఇక దేశీయంగా ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ.76,500, ముంబైలో రూ.73,050, ఢిల్లీలో రూ.73,050, కోల్‌కతాలో కిలో వెండి రూ.73,050, బెంగళూరులో రూ.76,500, హైదరాబాద్‌లో రూ.76,500, విజయవాడలో రూ.76,500 విశాఖలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu