Amul Milk: అమూల సంస్థ పాలసేకరణ ఆపాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు సీఎం లేఖ
కేంద్రంతో మరోసారి యుద్దానికి సిద్దమయ్యారు తమిళనాడు సీఎం స్టాలిన్. తమ రాష్ట్రంలో అమూల సంస్థ పాలసేకరణ ఆపాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు . అమూల్ ఎంట్రీతో తమ రాష్ట్రానికి చెందిన ఆవిన్ సంస్థకు..
కేంద్రంతో మరోసారి యుద్దానికి సిద్దమయ్యారు తమిళనాడు సీఎం స్టాలిన్. తమ రాష్ట్రంలో అమూల సంస్థ పాలసేకరణ ఆపాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు . అమూల్ ఎంట్రీతో తమ రాష్ట్రానికి చెందిన ఆవిన్ సంస్థకు అన్యాయం జరుగుతుందని అంటున్నారు స్టాలిన్ . కర్నాటకలో నందిని వర్సెస్ అమూల్ పాల వివాదం మరవక ముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. తమిళనాడులో అమూల్ పాల సేకరణను వెంటనే ఆపేలయాలని సీఎం స్టాలిన్ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ఆయన లేఖ రాశారు.
దేశంలో పాల కొరత ఉందని, అటువంటి పరిస్థితుల్లో అమూల్ ఈ విధంగా ఆవిన్ పరిధిలోని పాలను సేకరిస్తే, సమస్యలు మరింత ముదురుతాయని చెప్పారు. అమూల్ చర్యలు ఆవిన్ మిల్క్ షెడ్ ఏరియాలో చొరబడే విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
తమిళనాడులో అమూల్ సంస్థ పాలసేకరణతో రాష్ట్రానికి చెందిన డెయిరీ పరిశ్రమ ఆవిన్‌పై తీవ్ర ప్రభావం పడుతోందని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు. ఒకే ప్రాంతంలో రెండు సంస్థలు పాలసేకరణ చేస్తే అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతుందన్నారు. అమూల్ సంస్థ కృష్ణగిరి జిల్లాలో ప్రాసెసింగ్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయడాన్ని స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
అమూల్ సంస్థ కృష్ణగిరి , ధర్మపురి , వెల్లూరు , రాణిపేట , తిరుపత్తూరు ,కంచీపురం , తిరువల్లూరు జిల్లాల్లో రైతుల నుంచి , సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల నుంచి పాలసేకరణ చేస్తోందని , దీనిని వెంటనే ఆపేయాలని స్టాలిన్ కోరారు. 1981 నుంచి ఆవిన్ సంస్థ తమిళనాడులో పాలసేకరణ చేస్తోందని , అమూల్ ఎంట్రీతో ఆవిన్‌పై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు స్టాలిన్. అమూల్ సంస్థ పాల ఉత్పత్రి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేయడం తగదన్నారు
కర్నాటకలో ఎన్నికల వేళ అమూల్ -నందిని డెయిరీ వివాదం చెలరేగింది. అమూల్ సంస్థ కర్నాటకలో లో ప్రవేశించబోతోందని, నందిని సంస్థను దెబ్బతీయబోతోందని పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రచారం చేసింది. శాసన సభ ఎన్నికల సమయంలో ఏర్పడిన ఈ వివాదం ప్రభావం కాంగ్రెస్ విజయావకాశాలపై ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి