Andhra Pradesh: ‘ఎవరి ఫ్యాన్లు వారే తెచ్చుకోండి..’ అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో విచిత్ర పరిస్థితి

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కొరత తారా స్థాయిలో ఉంది. సాధారణంగా ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా వైద్యం, చికిత్స, మందులు, వైద్య పరీక్షలు అన్నీ ఉచితంగానే అందిస్తారు. ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లే స్తోమత లేనివారు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం చేయించుకుని సర్దుకుంటారు. ప్రసవాలు, కుటుంబ నియంత్ర ఆపరేషన్ల వంటి వాటి కోసం ఎక్కువ మంది ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తుంటారు. కానీ రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు..

Andhra Pradesh: 'ఎవరి ఫ్యాన్లు వారే తెచ్చుకోండి..' అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో విచిత్ర పరిస్థితి
Piler Government Hospital
Follow us

|

Updated on: Oct 12, 2023 | 3:30 PM

పీలేరు, అక్టోబర్ 12: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కొరత తారా స్థాయిలో ఉంది. సాధారణంగా ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా వైద్యం, చికిత్స, మందులు, వైద్య పరీక్షలు అన్నీ ఉచితంగానే అందిస్తారు. ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లే స్తోమత లేనివారు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం చేయించుకుని సర్దుకుంటారు. ప్రసవాలు, కుటుంబ నియంత్ర ఆపరేషన్ల వంటి వాటి కోసం ఎక్కువ మంది ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తుంటారు. కానీ రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు లేక.. ఎవరికి విన్నవించుకోవాలో తెలియక అవస్థలు పడుతున్నారు. రోగులకు కనీసం ఫ్యాన్‌ సదుపాయం కూడా లేక ఉక్కపోతతో అల్లడిపోతున్నారు. రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా పీలేరు ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలోని పరిస్థితి ఇది. ఇక్కడ వైద్యం చేయించుకోవాలంటో తమ ఫ్యాన్‌ తామే తెచ్చుకోవల్సిన విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడి సర్కార్ ఆసుపత్రిలో వైద్యం ఉచితమే కానీ, ఎవరి ఫ్యాన్లు వారే తెచ్చుకోవాలి అనేలా తయారైంది ఇక్కడి పరిస్థితి.

పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి పాత భవనంలోని ప్రసూతి వార్డులో 2 సీలింగ్ ఫ్యాన్లు ఉన్నాయి. కానీ అవి పాతవి కావడంతో సరిగ్గా తిరగక పోవడంతో వాటి నుంచి వచ్చే గాలి ఆ వార్డులోని వారికి సరిపోవడం లేదు. దీంతో వార్డులోని గర్భిణీ మహిళలు ఉక్కపోత తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. అక్కడి రోగుల పరిస్థితిని క్యాష్‌ చేసుకోవడానికి కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు ఆసుపత్రి బయట అద్దెకు ఫ్యాన్లు ఇవ్వబడునంటూ వ్యాపారం ప్రారంభించారు. ఆసుపత్రి ఆవరణలోని ప్రైవేటు మందుల షాపుల్లోనూ ఫ్యాన్లను అద్దెకు ఇవ్వడబునంటూ బోర్డులు పెట్టారు.

ఇలా అత్యవసర పరిస్థితుల్లో.. గత్యంతరం లేక ప్రసూతి వార్డులోని మహిళల బంధువుల స్టాండింగ్ ఫ్యాన్లకు అద్దెకు తీసుకెళ్తున్నారు. ఇలా ఒక్కో ఫ్యాన్‌ కోసం రోజుకు రూ.500 డిపాజిట్ చేస్తే, రోజుకు రూ.50ల వరకు అద్దె వసూలు చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లలేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే రోగుకుల కనీసం సదుపాయాలు కూడా కల్పించరా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని వాపోతున్నారు రోగులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.