- Telugu News Photo Gallery Health Benefits of Garlic: Does garlic lower cholesterol and high blood pressure?
Benefits of garlic: ఔషధాల వెల్లుల్లి తింటున్నారా? మధుమేహం అదుపులో ఉండాలంటే ఇలా చేసి చూడండి..
వెల్లుల్లి వంటకు కొత్త రుచిని అందించడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. వెల్లుల్లి పలు రకాల వ్యాధుల నివారణకు పోరాడటానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో విటమిన్లు సి, కె, ఫోలేట్, నియాసిన్, థయామిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.రోజూ ఆహారంలో వెల్లుల్లి తీసుకుంటే స్థూలకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. రుబ్బిన వెల్లుల్లి పేస్ట్‌ను ఫ్రిజ్‌లో దాచుకునే అలవాటు..
Updated on: Oct 13, 2023 | 8:40 PM

వెల్లుల్లి వంటకు కొత్త రుచిని అందించడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. వెల్లుల్లి పలు రకాల వ్యాధుల నివారణకు పోరాడటానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో విటమిన్లు సి, కె, ఫోలేట్, నియాసిన్, థయామిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

రోజూ ఆహారంలో వెల్లుల్లి తీసుకుంటే స్థూలకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. రుబ్బిన వెల్లుల్లి పేస్ట్‌ను ఫ్రిజ్‌లో దాచుకునే అలవాటు ఉన్నవారు..దానిని పేస్ట్ చేసేటప్పుడు వెల్లుల్లితో పాటు తాజా మూలికలను కూడా ఉపయోగించవచ్చు.

వెల్లుల్లిని నిద్రపోయే ముందు లేదా ఉదయం ఖాళీ కడుపుతో తింటే జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ముఖ్యంగా ఈ సమయాల్లో వెల్లుల్లి తినడం వల్ల కడుపులో బ్యాక్టీరియాను నాశనం చేసి, జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

వెల్లుల్లి శరీరంలోని అనేక ఇతర భాగాలకు కూడా ఉపయోగపడుతుంది. వెల్లుల్లిలో విటమిన్లు B1, B6, కాల్షియం, కాపర్, సెలీనియం, మాంగనీస్ వంటి పోషకాలు జీర్ణక్రియలో తోడ్పడుతాయి. పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. వెల్లుల్లి ఎండిపోకుండా, కుళ్లిపోకుండా, చెడిపోకుండా ఉండాలంటే వెల్లుల్లి తొక్క తీసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. కానీ దానికి నీళ్లు మాత్రం కలపకూడదు.





























