ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి దూసుకొచ్చింది హీరోయిన్ కృతి శెట్టి. తొలి సినిమా విడుదల కాకముందే ఈ అమ్మడి ఫాలోయింగ్ ఒక్కసారిగా మారిపోయింది. ఫస్ట్ మూవీ విడుదలకు ముందే సోషల్ మీడియాలో సెన్సెషన్ అయ్యింది. చూడచక్కని రూపం.. కట్టిపడేసే అందంతో తెలుగు కుర్రాళ్లకు ఫేవరెట్ అయిపోయింది. ఉప్పెన తర్వాత బేబమ్మకు ఆఫర్స్ క్యూ కట్టాయి. వెంట వెంటనే స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు కొట్టేసింది. దీంతో తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది.