- Telugu News Photo Gallery Cinema photos Vijay Thalapathy LEO movie Team clarity on remake movie Telugu Entertainment Movies
Vijay Thalapathy – LEO: కథ హాలీవుడ్ దే.. ట్రీట్మెంట్ లోకేష్ స్టైల్‌లో..! లియో పై క్లారిటీ.
విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లియో. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ సినిమా రీమేక్ అన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. ఈ వార్తలపై సినిమాలో విలన్‌గా నటించిన ఆర్టిస్ట్ క్లారిటీ ఇచ్చారు. విక్రమ్ లాంటి పాన్ ఇండియా హిట్ తరువాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లియో.
Updated on: Oct 13, 2023 | 6:23 PM

విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లియో. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ సినిమా రీమేక్ అన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది.

ఈ వార్తలపై సినిమాలో విలన్‌గా నటించిన ఆర్టిస్ట్ క్లారిటీ ఇచ్చారు. విక్రమ్ లాంటి పాన్ ఇండియా హిట్ తరువాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లియో.

గతంలో విజయ్ హీరోగా మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన లోకేష్, మరోసారి దళపతితో మూవీ చేస్తుండటంతో లియో మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అదే సమయంలో ఈ సినిమా రీమేక్ అన్న టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది.

2005లో రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ యాక్షన్ మూవీ ఏ హిస్టరీ ఆఫ్ వయలెన్స్‌కు లియో అఫీషియల్ రీమేక్ అన్న వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. అయితే ఇంతవరకు లోకేష్ టీమ్ ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వలేదు.

కానీ తాజాగా సినిమాలో నటించిన ఓ ఆర్టిస్ట్ ఈ న్యూస్‌పై రియాక్ట్ అయ్యారు.. లియో సినిమాలో విలన్ గ్యాంగ్‌లో నటించిన ఆత్మ పాట్రిక్ రీమేక్ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. 'ఏ హిస్టరీ ఆఫ్ వయలెన్స్' హక్కులు అఫీషియల్‌గా తీసుకొని లోకేష్ ఈ రీమేక్‌ను రూపొందించారని క్లారిటీ ఇచ్చారు.

కథ హాలీవుడ్ సినిమా నుంచి తీసుకున్నా.. ట్రీట్మెంట్ అంతా లోకేష్ స్టైల్‌లో ఉంటుందన్నారు లియో యాక్టర్. అంతేకాదు ఈ సినిమా లోకేష్ యూనివర్స్‌లో భాగమే అన్న క్లారిటీ కూడా ఇవ్వటంతో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.




