Viral Look Karthik: కోహ్లిని పోలిన కోహ్లికి ఫ్యాన్స్‌ క్రేజ్‌ మామూలుగా లేదు..!

Viral Look Karthik: కోహ్లిని పోలిన కోహ్లికి ఫ్యాన్స్‌ క్రేజ్‌ మామూలుగా లేదు..!

Anil kumar poka

|

Updated on: Oct 15, 2023 | 7:37 PM

కార్తీక్‌ శర్మ... అతన్ని చూడగానే ‘ఏంటి విరాట్‌ కోహ్లిలా ఉన్నాడే!’ అని అనుకోని వాళ్లు ఉండరు. కార్తీక్‌.. కోహ్లి క్లోన్‌లాగే ఉంటాడు. విరాట్‌ మాదిరి శరీరం, అతడిలాగే గడ్డం, నవ్వుతో విరాట్‌ను దించేశాడు కార్తీక్‌. చండీగఢ్‌కు చెందిన ఈ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌గా మారాడు. అతడు ఎక్కడికి వెళ్లినా అభిమానులు పొరబడి ఆటోగ్రాఫ్‌లు అడుగుతున్నారంటే కార్తీక్‌.. విరాట్‌ను ఎంతలా తలపిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.

కార్తీక్‌ శర్మ… అతన్ని చూడగానే ‘ఏంటి విరాట్‌ కోహ్లిలా ఉన్నాడే!’ అని అనుకోని వాళ్లు ఉండరు. కార్తీక్‌.. కోహ్లి క్లోన్‌లాగే ఉంటాడు. విరాట్‌ మాదిరి శరీరం, అతడిలాగే గడ్డం, నవ్వుతో విరాట్‌ను దించేశాడు కార్తీక్‌. చండీగఢ్‌కు చెందిన ఈ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌గా మారాడు. అతడు ఎక్కడికి వెళ్లినా అభిమానులు పొరబడి ఆటోగ్రాఫ్‌లు అడుగుతున్నారంటే కార్తీక్‌.. విరాట్‌ను ఎంతలా తలపిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. కార్తీక్‌కు విరాట్‌కు చాలా పోలికలే ఉన్నాయి. నడక, స్టయిల్, నవ్వు కూడా విరాట్‌నే పోలి ఉండడంతో అభిమానులు ఆశ్చర్యపడుతున్నారు. అందుకే సోషల్‌ మీడియాలో అతడికి ఫాలోయింగ్‌ కూడా భారీగా పెరిగిపోయింది. కార్తీక్‌ బయటకు వస్తే చాలు కోహ్లి వచ్చాడేమో అనుకుని వెంటపడుతున్నారట. విరాట్‌.. ప్లీజ్‌ ఆటోగ్రాఫ్‌ ఇవ్వండి.. ఫొటోలు కావాలి అని అడుగుతున్నారట. కానీ ఈ క్రేజ్‌ని అతడేమి సొమ్ము చేసుకోవాలని అనుకోవట్లేదు. వచ్చిన వాళ్లకు తాను విరాట్‌ని కానని ముందే చెప్పేస్తున్నాడు. అయినా అభిమానులు మాత్రం అతడిని వదలట్లేదు. కోహ్లినే కావాలని ఇలా చెబుతున్నాడని అనుకుని ఫొటోలు దిగుతున్నారట. ఆటోగ్రాఫ్‌లు అడుగుతున్నారట. అతడి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ని ఇప్పటికే 2.5 లక్షల మంది దాకా ఫాలో అవుతున్నారు. రోజురోజుకి ఈ ఫాలోవర్లు పెరిగిపోతున్నారు. కోహ్లి అంటే కార్తిక్‌కి చాలా ఇష్టం. మైదానంలోనే కాదు మైదానం బయట విరాట్‌ వ్యక్తిత్వానికి తాను ఫిదా అని చెబుతాడు. ఏదో ఒక రోజు తన క్రికెట్‌ హీరోని కలవాలనేది అతడి ఆశ. కోహ్లిని పోలిన కోహ్లి గురించి తెలుసుకున్న కొన్ని సంస్థలు డాక్యుమెంటరీలు కూడా తీస్తున్నాయి. హ్యుమన్స్‌ ఆఫ్‌ బాంబే కార్తీక్‌పై ఓ డాక్యుమెంటరీ నిర్మాణానికి సిద్ధమైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Oct 15, 2023 07:31 PM